- Home
- Entertainment
- మేకప్ లేకుండా కాఫీ కప్‌తో అనసూయ మత్తు పోజులు.. హ్యాంగోవర్ దిగలేదా? అంటూ హాట్ యాంకర్‌పై పోస్టులు
మేకప్ లేకుండా కాఫీ కప్‌తో అనసూయ మత్తు పోజులు.. హ్యాంగోవర్ దిగలేదా? అంటూ హాట్ యాంకర్‌పై పోస్టులు
అనసూయ అంటే సోషల్ మీడియాకి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్. ఆమె బోల్డ్ గా ఉంటుంది, కౌంటర్లేస్తుంది, ఆమెని నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ఇవన్నీ పక్కన పెడితే నెట్టింట అనసూయ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది వాస్తవం.

అనసూయ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. నిర్మొహమాటంగా ఉంటుంది. తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతుంది, అదే చేస్తుంది. దాన్ని కొందరు అతి అనుకుంటారు. తన మాత్రం ముక్కుసూటి తనం అంటుంది. అదే సమయంలో తనపై ఎవరైనా కామెంట్లు చేస్తే అదే రేంజ్‌లో కౌంటర్లిస్తుంటుంది అన్నుబేబీ. మొత్తానికి అనసూయ ఇంటర్నెట్‌లోకి వచ్చిందంటే రచ్చ రచ్చైపోతుందని చెప్పొచ్చు.
దీనికితోడు ఆమె గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లకి ట్రీట్ ఇస్తుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. ఫ్యాన్స్ కావాల్సిన అందాల విందు చేస్తూ అలరిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకోవడంతోపాటు అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటుంది. వన్నె తగ్గని అందంతో అందరిని అలరిస్తుందీ ఈ హాట్ యాంకర్.
అనసూయ.. తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. అదే సమయంలో క్రేజీ కామెంట్లకికారణమవుతుంది. ఇందులో ఈ మాజీ యాంకర్.. కాఫీ కప్పుతో కూడిన సెల్ఫీ ఫోటోని పంచుకుంది. అయితే ఆమె మేకప్ లేకుండా ఉన్న ఫోటోని పంచుకోవడం విశేషం. తన ఒరిజినల్ అందాన్ని ఆవిష్కరిస్తూ కాస్త దిగులుగా, ఇంకాస్త చిరాకుగా, మొత్తంగా మూడ్ బాగాలేదనేలా ఆమె సెల్ఫీ ఫోటో ఉంది. దానికి క్రేజీ పోస్ట్ పెట్టింది.
Anasuya Bharadwaj
దీనిపై నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. మళ్లీ అనసూయని గెలికే ప్రయత్నం చేస్తున్నారు. నెగటివ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. దొరికిందే ఛాన్స్ అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. అందులో భాగంగా అనసూయ `హ్యాంగోవర్`లో ఉందని అంటున్నారు. మరికొందరు రాత్రి తాగింది దిగలేదా అంటున్నారు. ప్రతి దాన్ని భజన చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
photo credit-anasuya insta
ఏదో మత్తులో ఉన్నావా? అని, అనసూయ చెల్లెలులా ఉన్నావని అని కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఇక ఆమె అభిమానులు మాత్రం అందాల దేవతలా ఉన్నావని, చాలా క్యూట్‌గా ఉన్నావని, బ్యూటీఫుల్ క్వీన్ అని, చాలా హాట్‌గా ఉన్నావని ఇలా ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇలా పాజిటివ్‌గా, ఆటు నెగటివ్‌గానూ అనసూయ చర్చనీయాంశంగా మారడం విశేషం.
photo credit-anasuya insta
అనసూయ యాంకరింగ్ మానేసిన విషయం తెలిసిందే. తన పిల్లలు ఎదుగుతున్నారని, తనపై వచ్చే కామెంట్లని వాళ్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, బాడీ షేమింగ్ కామెంట్లు ఇబ్బంది పెట్టేలా ఉంటాయని భావించిన ఆమె పిల్లల కోసం యాంకరింగ్ మానేసింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది అనసూయ. తెలుగు తమిళంలో మూవీస్ చేస్తుంది. అందులో `పుష్ప2`, `సింబా`తోపాటు తమిళంలో `వుల్ఫ` వంటి సినిమాలున్నాయి.