- Home
- Entertainment
- అనసూయని కోలుకోలేని దెబ్బకొట్టిన ఈ ఒక్క నిర్ణయం.. టాప్‌లో ఉండాల్సిన యాంకర్ ఒంటరిగా మిగిలిపోయిందా?
అనసూయని కోలుకోలేని దెబ్బకొట్టిన ఈ ఒక్క నిర్ణయం.. టాప్‌లో ఉండాల్సిన యాంకర్ ఒంటరిగా మిగిలిపోయిందా?
ఒకప్పుడు స్టార్ యాంకర్ గా రాణించిన అనసూయ ఇప్పుడు సినిమాలు, షోస్ లేక ఖాళీగా ఉంటోంది. అయితే దీనికి ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం కారణమని చెప్పొచ్చు.

జబర్దస్త్ షోతో స్టార్ యాంకర్‌గా ఎదిగిన అనసూయ
అనసూయ ఒకప్పుడు టాప్ యాంకర్. `జబర్దస్త్` కామెడీ షోతో విశేషమైన గుర్తింపుని తెచ్చుకుంది. స్టార్ యాంకర్‌గా ఎదిగింది. విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో రాణించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ తనపైనే చర్చ జరిగేది. ఆమెపై నెటిజన్లు కామెంట్స్ చేయడం, ఆమె వారికి కౌంటర్ ఇవ్వడం ఇలా సోషల్ మీడియాలో నిత్యం అనసూయ నామస్మరణమే జరిగేది. దీనికితోడు ఆమె నిత్యం గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ తన అభిమానులను అలరిస్తూ ఉండేది. మొత్తంగా బుల్లితెరపై గత మూడేళ్ల వరకు అనసూయ హవా సాగింది. కానీ ఆ తర్వాత నెమ్మదిగా డౌన్ అయ్యింది. సినిమాల్లో హడావుడి లేదు, టీవీ షోస్ లేవు, ఇప్పుడు చాలా వరకు ఖాళీగానే కనిపిస్తుంది. సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది.
అనసూయ చేసిన మిస్టేక్ ఇదేనా?
అనసూయ కెరీర్ డౌన్ కావడానికి, కోలుకోలేని దెబ్బతినడానికి ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, అదే జబర్దస్త్ షోని వదిలేయడం. అనసూయ వెళ్లిపోయాక `జబర్దస్త్` షో క్రేజ్ కూడా తగ్గింది. ఆమెతోపాటు సుడిగాలి సుధీర్, రోజా, అంతకు ముందే నాగబాబు వెళ్లిపోవడంతో ఆ షో ప్రభావం తగ్గింది. అయితే ఆ షోని ఇప్పుడు రష్మి లీడ్ చేస్తుంది. ఆమె తనదైన స్టయిల్‌లో అలరిస్తూనే ఉంది. కానీ అనసూయనే ఎటూ కాకుండపోయిన పరిస్థితి నెలకొంది. మరి ఇంతకి అనసూయ ఈ షోని ఎందుకు వదిలేసిందనేది చూస్తే, ఆమె పిల్లలు పెద్ద అవుతున్నారు. షోలో తనపై వేసే డబుల్ మీనింగ్ సెటర్లు, చేసే కామెంట్లకి ఆమె ఇబ్బంది పడుతుందట. పిల్లలకు అవి అర్థమవ్వడంతో తనని తప్పుగా అర్థం చేసుకుంటారని భావించి ఆమె ఈ షోని వదిలేసిందట.
జబర్దస్త్ ని అనసూయ ఎందుకు వదిలేసింది
ఇదే కాదు, మరో కారణం కూడా ఉంది. ఆ షోలో మేనేజర్ల వ్యవహారం కూడా తనకు నచ్చలేదని, వాళ్లు అతి చేయడం, అనసూయ ఇబ్బంది పడటం వంటి కారణాలతో ఆమె ఈ షో నుంచి తప్పుకుందట. ఆ సమయంలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు ఈ షోలో పాల్గొనడం కష్టమవుతుంది. షో కోసం డైరెక్టర్లని డేట్స్ అడ్జెస్ట్ అడగడం ఇబ్బందిగా మారింది. దీంతో తానే ఈ షోని వదులుకున్నట్టు తెలిపింది అనసూయ. ఇదే ఇప్పుడు ఆమె కొంప ముంచింది. ఆమె డౌన్ కావడానికి కారణమయ్యింది.
సినిమాలు, షోస్ లేక ఖాళీగా అనసూయ
షో వదిలేసిన ప్రారంభంలో బాగానే సినిమాలు చేసింది. బ్యాక్ టూ బ్యాక్ పలు భారీ చిత్రాల్లో నటించింది. `పుష్ప` రెండు పార్ట్ ల్లో, అలాగే `పెదకాపు`, `ఖిలాడీ`, `దర్జా`, `గాడ్ ఫాదర్`, `మైఖేల్`, `రంగమార్తాండ`, `విమానం`, `ప్రేమ విమానం`, `రజాకార్`, `అరి` వంటి చిత్రాలతో మెప్పించింది. ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలే ఉన్నాయి. అవి కూడా రెండేళ్ల నాటి చిత్రాలు. కొత్తగా ఇంకేదీ ప్రకటించలేదు. ఆ మధ్య తనకు సినిమాలున్నాయని చెప్పింది అనసూయ. కానీ వాటి తాలూకూ ఎలాంటి అప్ డేట్లు లేవు. పైగా అనసూయ ఎక్కువగా రీల్స్ చేస్తూ, వీడియోలు పోస్ట్ చేస్తూ కనిపిస్తోంది. ఆ మధ్య `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్` షో చేసింది. ఇప్పుడు అది కూడా లేదు. దీంతో అనసూయ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఆమె కెరీర్ డౌన్ అయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు షోస్ లేక, సినిమాలు లేక రెంటికి చెడ్డ రేవడిలా అనసూయ పరిస్థితి తయారైందంటున్నారు.
చీరలో మెరిసిపోతున్న అనసూయ
ఇదిలా ఉంటే అనసూయ లేటెస్ట్ గా ఫోటో షూట్ ఇచ్చింది. ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. `తెలిసిందా` అంటూ పోస్ట్ పెట్టింది. ఇందులో చీరలో ఒంటినిండా నగలు ధరించి ఆమె ఎంతగానో మెరిసిపోతుంది. మరి ఇది నగల బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిందా? లేక కొత్తగా షో ఏదైనా చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

