అలనాటి నటీమణులను ఇమిటేట్ చేసిన అనసూయ.. బ్యూటీఫుల్ పిక్స్ చూశారా?
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సినీ వేడుకలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా అలనాటి నటీమణులను అనుకరిస్తూ ఓ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ సందర్భంగా కొన్నిబ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంది.
స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) వెండితెరపై వరుస చిత్రాలతో విభిన్న పాత్రలతో అలరిస్తోంది. బుల్లితెరకు కాస్తా దూరమైన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి మెరియనుంది. ఓ వేడుకలో బ్యూటీఫుల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోబోతోంది.
జీ కుటుంబం అవార్డ్స్ 2023 (Zee Kutumbam Awards 2023) వేడుకలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఈరోజు 6గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో అనసూయ తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
అయితే, ఈ పెర్ఫామెన్స్ ను అలనాటి నటీమణులు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య లను ఇమిటేట్ చేస్తూ డాన్స్ అదరగొట్టనుంది. లెజెండరీ యాక్ట్రెస్ ను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వారిని ఇమిటేట్ చేస్తున్న కొన్ని ఫొటోలను తన ఫొటోలతో జతచేసి అభిమానులతో పంచుకుంది.
ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసిన నటీమణులను అనుకరించడంతో అనసూయ అభిమానులు ఫిదా అవుతున్నారు. సావిత్రి గారి లుక్ లో చాలా బాగుందంటూ పొగుడుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ఇక అనసూయ చాలా రోజుల తర్వాత ‘జీ కుటుంబం అవార్డ్స్’ లో బుల్లితెరపై సందడి చేయడం విశేషం. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ ఖుషీ చేస్తోంది. అదిరిపోయే ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటోంది.
మరోవైపు వెండితెరపై అనసూయ వరుస చిత్రాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటిగా వరుసగా చిత్రాలతో ఫుల్ బిజీగానే ఉంది. ‘రంగమార్తాండ’, ‘విమానం’, ‘ప్రేమ విమానం’ వంటి సినిమాలతో రీసెంట్ గా అలరించింది. ప్రస్తుతం Pushpa 2 The Rule లో నటిస్తోంది.