- Home
- Entertainment
- Ananya About Vijay: విజయ్ దేవరకొండ నిజస్వరూపం బయట పెట్టిన అనన్య పాండే... ఎలాంటోడంటే...?
Ananya About Vijay: విజయ్ దేవరకొండ నిజస్వరూపం బయట పెట్టిన అనన్య పాండే... ఎలాంటోడంటే...?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది అనన్య పాండే(Ananya Pandey). విజయ్ నిజ స్వరూపం ఇది అని బయట పెట్టేసింది. ఇంతకీ విజయ్ గురించి అనన్య చెప్పిన ఆ సీక్రేట్ ఏంటి..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, (Vijay Devarakonda) బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) జంటగా లైగర్ మూవీ తెరకెక్కుతోంది.. పూరీజగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో అగస్ట్ 25న రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు విజయ్(Vijay Devarakonda), అనన్య పాండేలు(Ananya Pandey). ఈ సందర్భంగా చాలా విషయాలు బయటపెట్టారు ఈ ఇద్దరు. ఈ సందర్భంలో విజయ్ దేవరకొండ గురించి అనన్య పాండే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ కు సంబంధంచిన టాప్ సీక్రేట్ బయట పెట్టింది అనన్య.
అనన్య(Ananya Pandey) మాట్లాడుతూ.. తన కెరీర్ లో విజయ్ బెస్ట్ కో-స్టార్ అని కితాబు ఇచ్చింది. కాకపోతే సినిమాలో కనిపించేదాని కన్నా విజయం బయట చాలా భిన్నంగా ఉంటాడు అంటోంది అనన్య. ఒక్కసారి అతడిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సినిమాల్లో అతడి పాత్రలన్ని ధైర్యవంతంగా ఉంటాయి. కానీ బయటక మాత్రం విజయ్ చాలా బయటపడతాడు అంది స్టార్ హీరోయిన్
అంతే కాదు సహజంగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పిరికివాడు అంటూ సంచలన వాఖ్యలు చేసింది. అంతే కాదు విజయ్ మంచి సహానటుడని, ఒక కో-స్టార్ నుంచి ఎలాంటి కంఫర్ట్స్ ఉండాలనుకుంటామో అవన్ని విజయ్ దగ్గర ఉంటాయని చెప్పింది. దీంతో ప్రస్తుతం అనన్య కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.
ఈపాన్ ఇండియా మూవీని ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్నాయి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈసినిమాను బాలీవుడ్ లో డీల్ చేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 2022 అగష్టు 25 న లైగర్ విడుదల కానుంది.ఇక ఈమూవీ లో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో కనిపంచనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మేక్ ఓవర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కంప్లీట్ గా లుక్ చేంజ్ చేసిన విజయ్.. టోన్డ్ బాడీతో.. రోమన్ శిల్పంలా మెరిసిపోతున్నాడు. సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి.