- Home
- Entertainment
- దీపావళి కాంతుల్లో మెరిసిపోతున్న అనన్య అందం.. బాలీవుడ్ స్టార్ ఫిదా.. మతిపోయేలా యంగ్ బ్యూటీ గ్లామర్ షో!
దీపావళి కాంతుల్లో మెరిసిపోతున్న అనన్య అందం.. బాలీవుడ్ స్టార్ ఫిదా.. మతిపోయేలా యంగ్ బ్యూటీ గ్లామర్ షో!
‘లైగర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday). దీపావళి సందర్భంగా ట్రెడిషన్ లుక్ లో నెట్టింట గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంటోంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనన్యపాండే బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. స్టార్ కాస్ట్ తో నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈబ్యూటీ సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
ఇంటర్నెట్ లో అనన్య పాండేకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్ల స్థాయిలో నెట్టింట అభిమానులను సంపాదించుకుందీ బ్యూటీ. అతి తక్కువ సమయంలో ఇంత క్రేజ్ సంపాదించుకున్న అనన్య ఇప్పటికీ తన అభిమానులకు, ఫాలోవర్స్ కు ఇంటర్నెట్ లో దగ్గరవుతూనే ఉంది. .
దీపావళి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నెట్టింట దర్శనమిచ్చింది. గ్రీన్ లెహంగా, వోణీలో ప్రత్యక్షమైంది. పండుగవేళ ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చేసింది. సంప్రదాయ దుస్తులు, పండుగల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అభిమానులను, నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది అనన్య.
మరోవైపు గ్లామర్ విందులోనూ తగ్గేదేలే అనిపిస్తోంది. ట్రెడిషనల్ వేర్ ధరించినా హాట్ అందాలను వడ్డించింది. బిగుతైన స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన అనన్య ఎద అందాలను క్లియర్ గా చూపిస్తూ మతిపోగొట్టింది. టాప్ గ్లామర్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది.
తన ఫొటోలు ‘ప్రేమ, కాంతులతో నిండిపోయాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అభిమానులు కూడా యంగ్ బ్యూటీని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా అనన్య ఫొటోలపై స్పందించారు. ఆమె బ్యూటీకి ఫిదా అవుతుతూ లైక్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టైగర్ ష్రాఫ్ తో అనన్య 2019లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో నటించింది. ఈ మూవీతోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ పాపులారిటీని దక్కించుకుంది. ప్రస్తుతం హిందీలోనే ‘ఖో గయే హమ్ కహన్’, ‘డ్రీమ్ గర్ల్ 2’లో నటిస్తోంది.