జాన్వీ కపూర్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ చాలా కష్టం.. దేవరలో 'చుట్టమల్లే' సాంగ్ భలే నచ్చింది, అనన్య పాండే
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న విడుదలైంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే అంచనాలని పూర్తి స్థాయిలో ఈ చిత్రం అందుకోలేదు.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న విడుదలైంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే అంచనాలని పూర్తి స్థాయిలో ఈ చిత్రం అందుకోలేదు. కానీ కలెక్షన్లకు మాత్రం ఢోకా లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది. దసరా సెలవులు కూడా మొదలయ్యాయి కాబట్టి దేవర చిత్రానికి మరింత భారీ వసూళ్లు ఆశించవచ్చు.
ఇదిలా ఉండగా దేవర చిత్రంలో జాన్వీ కపూర్ కి బలమైన పాత్ర దక్కలేదు అనే విమర్శలు ఉన్నాయి. ఏదో గ్లామర్ కోసం ఆమెని ఉంచారు అన్నట్లుగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ బాలీవుడ్ నటీమణుల నుంచి మాత్రం జాన్వీకి ప్రశంసలు దక్కుతున్నాయి.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పెర్ఫామెన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించడం ఆడియన్స్ అనుకున్నంత సులభం కాదు. కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించడం ఒక కళ. ఇటీవల జాన్వీ కపూర్ దేవర చిత్రంలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ ఆమె హావభావాలు అద్భుతంగా ఉన్నాయి.
ఒకే సాంగ్ లో డ్యాన్స్ చేస్తూ హావ భావాలు మార్చడం చాలా కష్టం. ఆ పనిని జాన్వీ చాలా బాగా చేసింది అంటూ అనన్య పాండే ప్రశంసలు కురిపించింది. అనన్య పాండే తెలుగులో లైగర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. దేవర సక్సెస్ తో జాన్వీ కపూర్ కి టాలీవుడ్ లో గ్రాండ్ వెల్కమ్ లభించినట్లు అయింది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కి దేవర చిత్రం రెండో మూవీ. గతంలో వీరిద్దరూ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే చిత్రం వచ్చింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అక్కర్లేదు అనే పాయింట్ తో సముద్రం బ్యాక్ డ్రాప్ లో దేవర కథ రాసుకున్నారు.