- Home
- Entertainment
- క్యాజువల్ వేర్ లో అనన్య నాగళ్ల కిర్రాక్ పోజులు.. సింపుల్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న తెలుగమ్మాయి..
క్యాజువల్ వేర్ లో అనన్య నాగళ్ల కిర్రాక్ పోజులు.. సింపుల్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న తెలుగమ్మాయి..
తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ (Ananya Nagalla) అందానికి కేరాఫ్ గా తయారవుతోంది. గ్లామర్ విందులో ఏమాత్రం తగ్గడం లేదు. క్యాజువల్ వేర్ లో కుర్రాళ్ల చూపును తనపై పడేలా చేస్తోంది.

తెలుగు అమ్మాయి, యంగ్ బ్యూటీ అనన్యా నాగళ్ల తాజాగా క్యాజువల్ వేర్ లో సూపర్ లుక్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ.. క్రేజీ ఫొటోషూట్లతో తన అభిమానులను ఫిదా చేస్తోంది.
ఇటీవల పొట్టి గౌనులో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ.. ఏ దుస్తుల్లోనైనా కుర్రాళ్లను ఇట్టే అట్రాక్ట్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా స్కిన్ షోలోనూ ఇరగదీసింది. తెలుగమ్మాయి అందాలతో ఇంటర్నెట్ నే షేక్ చేస్తోంది.
లేటెస్ట్ గా ఓ అపార్ట్ మెంట్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో చిలిపిగా ఫొటోలకు ఫోజులిచ్చింది. అలాగే గదిలోని డ్రెసింగ్ టేబుల్ వద్ద కొంటె చేష్టలతో ఆకట్టుకుంటోంది. అనన్యా పిక్స్ ను చూసిన పలువురు నెటిజన్లు తెలుగమ్మాయి అంటే అమాత్రం ఉంటుందని అంటున్నారు.
తను పోస్ట్ చేసిన పిక్స్ ను అభిమానులు, ఫాలోవర్స్ లైక్స్ , కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. అమ్మడు అందాలను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ ఇన్ స్టాలో దగ్గర దగ్గర 10 లక్షల ఫాలోవర్స్ కు చేరువలో ఉంది. తెలుగు బ్యూటీ ఇలాగే ఫొటోషూట్లతో అదరగొడుతుంటే ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరగనుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీతో అనన్యకు మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందే ‘మల్లేశం’ సినిమాతో బెస్ట్ ఫీమెయిల్ డెబ్యూ యాక్ట్రెస్ సైమా అవార్డుకు కూడా ఎంపికైంది. అప్పటి నుంచి తన పెర్పామెన్స్ కు మరింత మెరుగుపెడుతోంది.
బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న అనన్య చివరిగా నితిన్ ‘మ్యాస్ట్రో’లో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంలో ఓ పాత్రలో మెరియనుంది. ఈ చిత్రంతో అనన్య రేంజ్ మరో స్థాయికి వెళ్లనుందని ఆమె శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.