షాకింగ్ లుక్‌లో `ఆనందం` హీరోయిన్ రేఖ వేదవ్యాస్.. బాబోయ్ ఇలా మారిపోయిందేంటి?.. ఏమైంది?
`ఆనందం`, `ఒకటో నెంబర్ కుర్రాడు` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన హీరోయిన్ రేఖ.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత కనిపించి షాకిచ్చింది. అచ్చం పేషెంట్‌లా మారిపోయి ఆశ్చర్యపరుస్తుంది.
కర్నాటకకి చెందిన రేఖ వేదవ్యాస్(Rekha Vedavyas).. 2001లో `ఆనందం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో క్యూట్ అందాలతో మెప్పించింది. ఆకాష్ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అటు ఆకాష్‌కి, ఇటు రేఖలకు పేర్లు రావడంతోపాటు దర్శకుడిగా శ్రీనువైట్ల తానేంటో నిరూపించుకున్నారు.
`జాబిలి`తోపాటు నందమూరి తారకరత్నతో `ఒకటో నెంబర్ కుర్రాడు` చిత్రంలో నటించింది Rekha Vedavyas. హీరోయిన్‌గా అదరగొట్టింది. సినిమా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రం తారకరత్నకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత `జానకి వెడ్స్ శ్రీరామ్`లో మెరిసింది. అట్నుంచి అడపాదడపా సినిమాలు చేసిన రేఖ..పెద్దగా సక్సెస్‌లు లేకపోవడంతో కన్నడకే పరిమితమయ్యింది. అక్కడే వరుసగా సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
2008లో `నిన్న నేడు రేపు` రేఖ తెలుగులో చివరి చిత్రం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మెరిసింది. ఆ మధ్య అలీ హోస్ట్ గా నిర్వహించిన `అలీతో సరదాగా` షోలో పాల్గొంది. తాను మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పింది. చాలా బొద్దుగా మారి ఆశ్చర్యపరిచింది. కానీ ఇంకా అందంగా మారింది.
మళ్లీ కనిపించకుండా పోయిన ఈ బ్యూటీ ఇప్పుడు సడెన్‌గా ప్రత్యక్షమైంది. `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో మెరిసింది. రష్మి గౌతమ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ఇది. ఇందులో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతే షాకిచ్చింది. చూడ్డానికి చాలా సన్నగా గుర్తు పట్టేలేని విధంగా మారిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్‌లా మారిపోయింది.
రేఖని ఇలా చూసి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆర్టిస్టులు ఒకింత ఆనందానికి గురి కాగా, మరికొంత షాక్‌కి గురయ్యారు. ఇక వచ్చీ రావడంతోనే షోలో కామెడీని పంచింది. బుల్లెట్ భాస్కర్‌పై పంచ్‌లేసి నవ్వులు పూయించింది. దీంతో అంతా నవ్వులు పూయించారు.
ఈ క్రమంలో ఇక తట్టుకోలేక ఇంద్రజ ఆమెని అడిగేసింది. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూడటం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. కానీ ఇలా చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపింది. దీనికి రేఖ కూడా స్పందించింది. ఆమె వివరణ ఇచ్చింది. సడెన్‌గా ఇలా జరిగిందని చెప్పింది.
ఏం జరిగిందనేది మాత్రం ఆదివారం తెలియనుంది. ఇది ప్రోమో మాత్రమే. పూర్తి ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ప్రతి ఆదివారం ఈటీవీలో మధ్యాహ్నం ఈ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు రేఖ ఇలా షాకింగ్ లుక్‌లో కనిపించి సస్పెన్స్ ని క్రియేట్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ కూడా ఆమె బాగానే ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ ఫోటోలు పంచుకుంది. కానీ ఇప్పుడు సడెన్‌గా ఇలా మారడమే షాకిస్తుంది. మరి ఏం జరిగిందనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
రేఖ తెలుగులో `ఆనందం`, `ఒకటో నెంబర్ కుర్రాడు`తోపాటు `మన్మథుడు`లో స్పెషల్ అప్పీయరెన్స్, `దొంగోడు`, `అనగనగా ఒక కుర్రాడు`, `జానకి వెడ్స్ శ్రీరామ్`, `ప్రేమించుకున్నాం పెళ్లికి రండి`, `నాయుడమ్మ`, `నిన్న నేడు రేపు` చిత్రాల్లో నటించింది. మధ్యలో `జీనియస్` చిత్రంలో స్పెషల్ అప్పీయరెన్స్ చేసింది.
2014 నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. దాదాపు 9ఏళ్లు కనిపించకుండా పోయిన ఈ బ్యూటీ మూడేళ్ల క్రితం అలీ షోలో మెరిసింది. మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు రావడం ఆశ్చర్యపరుస్తుంది.