Brahmamudi: కళ్యాణ్ కి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చిన అనామిక.. రుద్రాణి దెబ్బకు కృష్ణమూర్తి కుటుంబం విలవిలా!
Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ టిఆర్ పీ రేటింగ్ మీ సొంతం చేసుకుంటుంది. కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న ఒక మధ్య తరగతి కుటుంబం కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో అపర్ణ దగ్గరికి వెళ్లి నేను పుట్టింటికి వెళ్తాను అని పర్మిషన్ తీసుకుంటుంది కావ్య. ఇంట్లో పని అంతా అయిపోయిందా అని అడుగుతుంది అపర్ణ. అయిపోయింది అని కావ్య చెప్పడంతో పుట్టింటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది అపర్ణ. తాతయ్య దగ్గరికి వెళ్లి మీ ఆశీర్వచనం కావాలి అని అడుగుతుంది. ఏంటి విశేషం అంటుంది రుద్రాణి. ఈరోజుతో ఒప్పుకున్న కాంట్రాక్ట్ పని పూర్తయిపోతుంది. ఈ పని అయిపోతే అప్పులన్నీ తీరిపోయి ఇల్లు అమ్మ వాళ్ళ సొంతం అయిపోతుంది అంటుంది కావ్య.
వదిన దగ్గర నుంచి శిక్ష తప్పించుకున్నావు కానీ నాకు దొరికిపోయావు, ఇప్పుడు చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. అదే సమయంలో రాజ్ కిందికి రావడంతో అమ్మాయిని డ్రాప్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు సీతారామయ్య. మీరు చెప్పిన దగ్గర నుంచి రోజూ డ్రాప్ చేస్తున్నాను తాతయ్య అంటాడు రాజ్. సరే అని చెప్పి కావ్యని ఆశీర్వదించి పంపిస్తారు చిట్టి దంపతులు. మరోవైపు కారులో వెళ్తున్న కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేసి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మీరు ఇంకా రాలేదు అంటుంది.
లేదు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను, ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను అని చెప్తాడు కళ్యాణ్. ఇంతలో అప్పు ఫోన్ చేస్తుంది. అప్పుడు అప్పు తనని రమ్మనమన్న విషయం గుర్తొస్తుంది కళ్యాణ్ కి. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే మళ్లీ రమ్మనమని సతాయిస్తుంది అందుకే అనామిక దగ్గరికి వెళ్లి అప్పుడు గుడ్ న్యూస్ అప్పు దగ్గరికి వెళ్లి ఆమెని కన్విన్స్ చేయొచ్చు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయడు కళ్యాణ్. మరోవైపు కలర్ కాంబినేషన్ కోసం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు కృష్ణమూర్తి.
ఎందుకయ్యా అంత కన్ఫ్యూజ్ అంటుంది కనకం. బొమ్మకి రంగులు వేయడం అంటే రంగులు పులమటం అనుకుంటున్నావా అంటాడు కృష్ణమూర్తి. మరేంటి అంటుంది కనకం. ఆకాశంలో ఇంద్రధనస్సులో రంగుల్లా, వర్షం రావడానికి ముందు నెమలి నాట్యంలా జీవకళ పొట్టి పడాలి అనుకుంటూ అక్కడికి వస్తుంది కావ్య. కరెక్ట్ గా చెప్పావమ్మా అంటాడు కృష్ణమూర్తి. మీ నాన్నకి సేవలు చేయలేక నాకు కనిపిస్తున్నాయి ఇంద్రధనస్సులోని రంగులు అని వెటకారం ఆడుతుంది కనకం. కృష్ణమూర్తి కూడా కనకాన్ని ఆటపట్టిస్తాడు.
సరే నాన్న ఇవన్నీ తర్వాత ముందు ఈరోజు పని మొత్తం పూర్తి చేసేయాలి లేట్ అయిన పర్వాలేదు అంటుంది కావ్య. కనకం కంగారు పడితే నువ్వేమి కంగారు పడకు నేను ఇంట్లో చెప్పే వచ్చాను అంటుంది. మరోవైపు కెఫీకి పరుగెత్తుకుంటూ వచ్చిన కళ్యాణ్ లేటుగా వచ్చారు అంటూ ఆట పట్టేస్తుంది అనామిక. నెక్స్ట్ టైం అలా చేయను కానీ మీరేదో సర్ప్రైజ్ అన్నారు కదా అదేంటి అని ఆసక్తిగా అడుగుతాడు కళ్యాణ్. అప్పుడు సిగ్గుపడుతూ తన బ్యాగ్ లోంచి వెడ్డింగ్ కార్డు తీసి కళ్యాణ్ కి ఇస్తుంది అనామిక.
అదేంటి మీకు పెళ్లా అని షాక్ అవుతాడు కళ్యాణ్. ఎందుకు అలా షాక్ అవుతున్నారు పెళ్లి కార్డు చదవండి అంటుంది అనామిక. అనామికని తిట్టుకుంటూనే పెళ్లి కార్డు చదువుతాడు కళ్యాణ్ అందులో పెళ్ళి కొడుకు పేరు దుగ్గిరాల కళ్యాణ్ అని చూసి షాక్ అవుతాడు వెంటనే అనామిక అని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. అప్పుడే అప్పు అతనికి ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేసే మూడ్ లో తను ఉండడు. మళ్లీ హ్యాండ్ ఇచ్చాడు వీడిని అస్సలు నమ్మకూడదు అని తిట్టుకుంటుంది అప్పు.
మరోవైపు రుద్రాణి రాహుల్ కి ఫోన్ చేసి కావ్య ఇంట్లో బొమ్మలు అన్ని మాయం చేసేయమంటుంది. అర్థమైంది వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కకూడదు అంతే కదా ఆ పని ఈ రాత్రికి పూర్తవుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాహుల్. మరోవైపు రాజ్ సీతారామయ్యకి ఫోన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడుగుతాడు. అన్ని వేసుకున్నాను, అవన్నీ చూసుకోవడానికి చిట్టి ఉంది కానీ నువ్వు కావ్య కి ఫోన్ చేసావా అని అడుగుతాడు సీతారామయ్య. లేదు అంటాడు రాజ్.
ఈ ఇంట్లో నీ మీద ప్రేమ చూపించడానికి చాలామంది ఉన్నారు కానీ నిన్నే నమ్ముకుని ఇంటికి వచ్చిన నీ భార్య బాధ్యతలని నువ్వే చూడాలి అంటాడు సీతారామయ్య. లేదు తాతయ్య ఇప్పుడు చేస్తాను అంటాడు రాజ్. వద్దు తను రావడం లేట్ అవుతుందని ఇప్పుడే ఫోన్ చేసింది అంటాడు సీతారామయ్య. సరే అయితే తనని పిక్ చేసుకొని ఇంటికి తీసుకు వస్తాను అంటాడు రాజ్.
గుడ్ ఈమాట కోసమే ఎదురు చూస్తున్నాను అని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సీతారామయ్య. తరువాయి భాగంలో కృష్ణమూర్తి దగ్గర బొమ్మలు రౌడీలు దొంగలించుకొని వెళ్ళిపోతారు. వాళ్లని అడ్డుకునే క్రమంలో కృష్ణమూర్తికి బాగా దెబ్బలు తగిలి స్పృహ కోల్పోతాడు. పొద్దున్నే అక్కడికి వచ్చిన కావ్య, కనకం వాళ్లకి దెబ్బలతో ఉన్న కృష్ణమూర్తి కనిపిస్తాడు అప్పుడు కావ్యకి మన కష్టాన్నంత దొంగలు దోచుకెళ్ళిపోయారు అని చెప్పి ఏడుస్తాడు కృష్ణమూర్తి.