MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమితాబ్ బచ్చన్ తో ఫోటోలో ఉన్న స్టార్స్ ఎవరో గుర్తు పట్టారా?

అమితాబ్ బచ్చన్ తో ఫోటోలో ఉన్న స్టార్స్ ఎవరో గుర్తు పట్టారా?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో స్టైలిష్‌గా పోజులిస్తున్న ఈ ఇద్దరు స్టార్  నటులెవరో గుర్తుపట్టారా?  స్టార్ వారసులుగా ఇండస్ట్రీని ఏలుతున్న వీరు ఎవరంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 24 2025, 07:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ షెహెన్షా, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)  పాత ఫోటో ఇది. ఈ ఫోటోలో బిగ్ బి తో ఉన్న ఈ ఇద్దరు కుర్రాళ్ళు ఎవరో మీకు తెలుసా?  స్టార్ హీరో వారసులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతున్నారు. ఇంతకీ వీళ్లు ఎవరంటే? 
 

26

అమితాబ్ బచ్చన్ తో స్టైలిష్ గా జీన్స్ షర్ట్ వేసుకుని నిలబడి ఉన్నది డా. శివరాజ్ కుమార్  (Shivaraj Kumar) , రాఘవేంద్ర రాజ్ కుమార్. ఈ ఫోటో దాదాపు 43 సంవత్సరాల క్రితం తీసింది. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన శివన్న , రాఘన్న, అమితాబ్ బచ్చన్ తో పోజులిచ్చారు. 
 

36

ఈ ఫోటోను సత్తే పే సత్తా సెట్లో 1982లో తీశారు. రాజ్ కుమార్ ఇద్దరు పిల్లలు, ఆ కాలంలో హీరోగా వెలుగొందుతున్న లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ గారిని సినిమా సెట్లో కలిసి ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

46

సత్తే పే సత్తా (1982) సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ తన కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నారు. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు - ఒకరు రఫ్ అండ్ టఫ్ గా ఉండే అన్నయ్యగా, మరొకరు క్రూరంగా కనిపించే విలన్ గా అమితాబ్ బచ్చన్ నటించారు.
 

56

ఇదంతా జరిగి దాదాపు 43 సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా కాలం నుండి అమితాబ్ , శివన్న కలిసి కన్నడ సినిమాలో నటిస్తారని వార్తలు వినిపించాయి. నాగతిహళ్లి చంద్రశేఖర్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటిస్తారని అన్నారు, కానీ అది సాధ్యం కాలేదు. గత సంవత్సరం హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో కూడా శివన్న పాల్గొంటారని చెప్పారు, అది కూడా జరగలేదు. 
 

66

సినిమాల్లో అమితాబ్ బచ్చన్ తో శివన్న నటించకపోయినా, ఇద్దరూ కలిసి ఒక ఆభరణాల యాడ్ లో కనిపించారు. ఈ యాడ్ లో బచ్చన్, శివన్నతో పాటు, తెలుగు స్టార్ నటుడు నాగార్జున మరియు తమిళ నటుడు ప్రభు కూడా నటించారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved