MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun: అల్లు అర్జున్ 'పుష్ప' గుట్టు రట్టు చేసిన అమితాబ్ బచ్చన్.. అసలు మ్యాటర్ లీక్

Allu Arjun: అల్లు అర్జున్ 'పుష్ప' గుట్టు రట్టు చేసిన అమితాబ్ బచ్చన్.. అసలు మ్యాటర్ లీక్

పుష్ప సాంగ్స్ విడుదలయ్యాక ఆ స్టెప్పులని సెలెబ్రిటీలు సైతం రీక్రియెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చూశాం. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ చెప్పుల్ని ఈడ్చుకుంటూ వేసిన స్టెప్ వరల్డ్ మొత్తం వ్యాపించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 12 2022, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పుష్ప మొదటి భాగం హిందీలో ఊహించని విధంగా సక్సెస్ అయింది. పుష్ప 2పై నార్త్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలసి చేసిన మ్యాజిక్ కి ఇండియా మొత్తం ఫిదా అయింది. పుష్ప మొదటి భాగం హిట్ కావడంతో పుష్ప 2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. దీనితో సుకుమార్ పెరిగిన అంచనాలని దృష్టిలో పెట్టుకుని పుష్ప 2 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

పుష్ప సాంగ్స్ విడుదలయ్యాక ఆ స్టెప్పులని సెలెబ్రిటీలు సైతం రీక్రియెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చూశాం. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ చెప్పుల్ని ఈడ్చుకుంటూ వేసిన స్టెప్ వరల్డ్ మొత్తం వ్యాపించింది. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఆ స్టెప్పుపై వీడియో పోస్ట్ చేశారు. ఇక ఫ్యాన్స్ నుంచి అయితే వేలల్లో వీడియోలు వైరల్ అయ్యాయి.

36

అల్లు అర్జున్ గాగుల్స్ పెట్టుకుని చెప్పుల్ని ఈడ్చుతూ స్టెప్పు వేయడం.. చెప్పు జారిపోతే దానిని సరి చేసుకోవడం అభిమానులని భలే ఆకట్టుకుంది. సింపుల్ గా అనిపించే ఈ స్టెప్ కి సెలెబ్రిటీలు కూడా థ్రిల్ అయ్యారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్వయంగా ఆ స్టెప్పు గురించి మాట్లాడారు. అది కొరియోగ్రఫీలో భాగంగా బన్నీ అలా డ్యాన్స్ చేయలేదు అని.. చెప్పు జారిపోవడం మిస్టేక్ అని బాంబు పేల్చారు. 

46

ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 14 సీజన్ ప్రారంభం అయింది. ఈ షోలో పుష్ప గురించి ప్రశ్న వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్.. అల్లు అర్జున్ వేసిన స్టెప్పు గురించి అసలు మ్యాటర్ లీక్ చేశారు. ఓ చిత్ర షూటింగ్ లో భాగంగా నేను హైదరాబాద్ వెళ్లాను. అప్పుడు అల్లు అర్జున్ స్టెప్ బాగా వైరల్ అవుతోంది. దీనితో మాయా దర్శకుడిని.. కొరియోగ్రఫీలో భాగంగా బన్నీ ఇలా డ్యాన్స్ చేశారా లేక మిస్టేక్ జరిగిందా అని అడిగాను. 

56

మా దర్శకుడు వివరాలు తెలుసుకుని.. అల్లు అర్జున్ చెప్పు జారిపోవడం పొరపాటుగా జరిగింది. అది కొరియోగ్రఫీ కాదు. కానీ సుకుమార్ కి అది నచ్చడంతో అలాగే ఉంచేశారట అని అమితాబ్ బచ్చన్ అన్నారు. అలా అల్లు అర్జున్ పొరపాటుగా చేసిన స్టెప్ అదిరిపోయే స్టెప్పులాగా మారిపోయింది. 

66

పలు సందర్భాల్లో సెలెబ్రిటీలు పొరపాటుగా చేసిన అంశాలు వైరల్ అయిపోవడం చూస్తూనే ఉన్నాం. శ్రీవల్లి స్టెప్పు, తగ్గేదే లే అంటూ బన్నీ గడ్డాన్ని సరి చేసుకోవడం, ఒక భుజాన్ని పైకి లేపి నటించడం, చిత్తూరు స్లాంగ్ ఇలా పుష్ప చిత్రంలో చాలా అంశాలు అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్ పుష్ప 2 స్క్రిప్ట్ ఫినిష్ చేయగానే సెట్స్ పైకి వెళ్లనున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image2
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved