MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'కల్కి' మూవీపై మనవళ్లు, మనవరాళ్ల రివ్యూ.. అమితాబ్ బచ్చన్ కి షాక్

'కల్కి' మూవీపై మనవళ్లు, మనవరాళ్ల రివ్యూ.. అమితాబ్ బచ్చన్ కి షాక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ పై పెను సంచలనం సృష్టించింది. 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 16 2024, 07:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ పై పెను సంచలనం సృష్టించింది. 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తన విజన్ ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసారు. మహాభారతాన్ని, ఇలా సైన్స్ ఫిక్షన్ మూవీలో మిక్స్ చేయడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దీనికి ప్రభాస్ క్రేజ్ జోడవడంతో సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్ అయింది. అమితాబ్ బచ్చన్, దీపికా, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రం అశ్వథామ పాత్రలో నటించారు. ఆయన పాత్ర కథలో అత్యంత కీలకం. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. 

35

దీపికా పదుకొనె కల్కికి జన్మనిచ్చే సుమతి పాత్రలో నటించింది. ఆమెని, కల్కిని రక్షించే పాత్రలో అమితాబ్ కనిపించారు.ప్రపంచం మొత్తం కల్కి చిత్రానికి ప్రశంసలు దక్కాయి. అయితే అమితాబ్ సొంత ఫ్యామిలీ నుంచి ఆయనకి ఊహించని షాక్ తగిలింది. 

45

కౌన్ బనేగా కరోడ్ పతి షోలో అమితాబ్ కల్కి చిత్రం గురించి మాట్లాడారు. మా మనవళ్లు మనవరాళ్లు హాలీవుడ్ సినిమాలు చూస్తారు. నన్ను కూడా చూడమని అడుగుతారు. హాలీవుడ్ చిత్రాలు చూసే వారిలో రెండు రకాలు ఉంటారు.. కొంతమంది అద్భుతం అని పొగుడుతుంటారు. కొంతమంది అసలు ఏమి అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటారు. నేను రెండో కేటగిరికి చెందిన వాడిని. 

55

నాకు హాలీవుడ్ చిత్రాలు అర్థం కావు అని అమితాబ్ బచ్చన్ అన్నారు. మా మనవళ్లు మనవరాళ్ళతో మీరు చూసే హాలీవుడ్ చిత్రాలు నాకు అసలు అర్థం కావు అని చెప్పా. దీనికి వారు కౌంటర్ గా మీరు నటించిన కల్కి 2898 ఎడి చిత్రం కూడా మాకు అసలు అర్థం కాలేదు అని చెప్పారట. దీనితో అమితాబ్ బచ్చన్ షాక్ అయ్యారు. ఇండియా మొత్తం నీరాజనాలు పట్టిన చిత్రం సొంత ఫ్యామిలీకే అర్థం కాలేదని షాక్ అయ్యారట. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: వైజాగ్‌ స్టార్‌ హోటల్‌లో బాలయ్యకి సీక్రెట్‌రూమ్‌, అర్థరాత్రి దర్శకుడితో జంప్‌.. బాలయ్య రియాలిటీ రివీల్‌
Recommended image2
Peddi Controversy: రామ్ చరణ్ పెద్ది లో.. వివాదాస్పద సీన్లకు కత్తెర, కట్ చేసిన సన్నివేశాలివే?
Recommended image3
Monsoon Movies: భార్యాభర్తలు కలిసి వర్షం పడుతున్నప్పుడు చూడాల్సిన 5 రొమాంటిక్ సినిమాలు ఏవో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved