అమితాబచ్చన్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, బిగ్ బీ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మొదటి ప్రేయసి ఎవరో తెలుసా? ఆమె బాలీవుడ్ హీరోయన్ కాదు, కాలేజీ ఫ్రెండ్ కాదు, స్కూల్ మెట్ కాదు, అసలు ఎవరికీ తెలియని ఆమె ఎవరు? బిగ్ బీ ఎప్పుడు ప్రేమించారు. ఆమె వివరాలు ఏంటి.? వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం ఎప్పుడు నడిచింది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది?
- FB
- TW
- Linkdin
Follow Us
)
అమితాబ్ బచ్చన్ ఒక లెజెండ్. బిగ్ బీ చేసిన సినిమాల లిస్ట్, కౌన్ బనేగా కరోడ్‌పతి లాంటి షోలతో ఆయన పాపులారిటీ ఏంటో అర్ధం అవుతుంది. అన్నీ చూస్తేనే అర్థమవుతుంది. ఆయన సూపర్ హిట్ సినిమాలు హిందీ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ ముంబైలో ఆయన ఇంటి ముందు జనాలు ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురుచూస్తుంటారంటే.. అమితాబ్ గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేం. ఒక్క క్షణం ఆయన్ని చూడాలని కోరుకునే అభిమానులెందరో.
సినిమాలో అమితాబ్ ఏంటో అందరికి తెలుసు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొంత వరకూ తెలుసు. అంతే కాదు అమితాబ్ గురించి కొత్త విషయం తెలసుకోవాలని ఇప్పటకీ ప్రయత్నించేవారు ఉన్నారు. బిగ్ బీ కెరీర్ లో, ఆయన పర్సనల్లైఫ్ లో రేఖతో అనుబంధం, జయా బచ్చన్ ఎంట్రీ ఇవన్నీ చాలా ఆసక్తికరమైన విషయాలే. బిగ్ బి జయా బచ్చన్ ను పెళ్లాడి 50 ఏళ్ళకు పైనే అవుతోంది. ఆయన కెరీర్ లో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. ఎంతో మందితో బిగ్ బీకి ముడిపెడుతూ గాసిప్స్ వచ్చాయి.
తాజాగా బిగ్ బీ అమితాబ్ కు సబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఆయన మొదటి ప్రేయసి ఎవరు అని. బచ్చన్ మొదటి ప్రేయసి హీరోయిన్ కాదు, సినిమాలకు సబంధం లేదు.. ఆమె ఎవరో తెలుసా? బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో పనిచేసిన ఓ అమ్మాయిని బిగ్ బీ ప్రేమించారు. ఈ విషయాన్ని రచయిత, సినిమా చరిత్రకారుడు హనీఫ్ జవేరి 'మేరీ సహేలి' పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం చెప్పారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే మాయా అనే అమ్మాయితో అమితాబ్‌కి మొదటి ప్రేమ పుట్టింది.
హీరో కాకముందు బిగ్ బీ అమితాబచ్చన్ అప్పుడు కలకత్తాలో ఒక కంపెనీలో పనిచేసేవాడు. అప్పుడే మాయా పరిచయం అయ్యింది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. బచ్చన్ మాయాని చాలా ప్రేమించేవాడు. అదే సమయంలో బిగ్ బి తన నటనా జీవితం కోసం ముంబై వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఆయన తన చిన్నాన్న ఇంట్లో ఉండేవాడు. మాయా అక్కడికి కూడా వచ్చేది. కానీ ఇది బచ్చన్ చిన్నాన్నకి ఈ విషయం నచ్చలేదు. తన తల్లి తేజీ బచ్చన్‌కి తెలిస్తే ఏమవుతుందో అని బచ్చన్ భయపడ్డాడు.
మాయా చాలా ధైర్యవంతురాలు, ఓపెన్ మైండెడ్. అమితాబ్‌తో బయట కూడా తిరిగేది. ఇదే వాళ్ళ ప్రేమకి గండి కొట్టింది. అమితాబ్ ఈ విషయం నటుడు మెహమూద్ సోదరుడు అన్వర్ అలీతో చెప్పుకున్నాడు. అప్పుడు వాళ్ళు 'సాత్ హిందూస్థానీ' సినిమాలో కలిసి పనిచేస్తున్నారు. అన్వర్ అలీ బచ్చన్‌కి "నువ్వు మాయాతో జీవితం గడపలేవు. ఆమె బచ్చన్ కుటుంబానికి సరిపోదు. నువ్వు ఇలాగే చేస్తే ఇంకా సమస్యలు వస్తాయి" అని సలహా ఇచ్చాడు.
అందుకే బిగ్ బి మాయాతో సంబంధం తెంచుకున్నాడు. మాయా తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆమె సినిమాల్లోకి రాలేదు. బిగ్ బి 1970లో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో జయా బచ్చన్‌ని కలిశాడు. 'ఏక్ నజర్' సినిమాలో కలిసి నటించారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. 'జంజీర్' సినిమా విడుదలైన తర్వాత 1973లో వీరు పెళ్లి చేసుకున్నారు. అలా అమితాబచ్చన్ మొదటి ప్రేమ అసంపూర్తిగా ముగిసింది.