- Home
- Entertainment
- వెన్నుపోటు పొడిచారు, సూసైడ్ చేసుకోవాలని ట్రై చేశా, బిగ్ బాస్ అమర్ దీప్ సంచలన కామెంట్స్
వెన్నుపోటు పొడిచారు, సూసైడ్ చేసుకోవాలని ట్రై చేశా, బిగ్ బాస్ అమర్ దీప్ సంచలన కామెంట్స్
తెలుగు టీవీ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను చాలామంది వెన్నుపోట్టు పొడిచారని, సూసైడ్ చేసుకోవాలనుకున్నట్టు ఆయన వెల్లడించారు.

బిగ్ బాస్ లో అమర్ దీప్
టెలివిజన్ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ చౌదరి, బిగ్ బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా జానకి కలగనలేదు సీరియల్ తో అమర్ కు బాగా పాపులారిటీ వచ్చింది. ఆతరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం, అక్కడ యాక్టీవ్ గా పార్టిస్పేట్ చేయడంతో పాటు, రైతు బిడ్డ ప్రశాంత్ తో గొడవలతో మరింత పాపులర్ అయ్యాడు అమర్. సీజన్ 7కి అమర్ విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. కాని అతను రన్నర్ తోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ప్రస్తుతం ఆయన నాయుడు గారి అమ్మాయి అనే సినిమా ద్వారా హీరోగా అలరించేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమర్ దీప్ తన జీవితం గురించి బోల్డ్ కామెంట్స్ చేశాడు. తన లైఫ్ లో జరిగిన సంఘటనల గురించి షాకింగ్ విషయాలు ఆయన వెల్లడించారు. ఇంతకీ అమర్ దీప్ ఏమంటున్నాడంటే?
అమర్ దీప్ మాట్లాడుతూ
"నా మెంటల్ స్టేటస్ ఒకప్పుడు చాలా డిస్టర్బ్ అయింది. ఎక్కువగా ఆలోచిస్తూ, పాత విషయాల్ని గుర్తుచేసుకుంటూ ఉండేవాడిని. నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. కొన్ని రోజులు పడుకుంటే, తర్వాత మళ్లీ మూడు రోజుల పాటు నిద్రపట్టేది కాదు. నేను ఇంకా సక్సెస్ కాలేదు. నేను ఊహించుకున్నది ఒక్కటి, జీవితం మళ్లించిందీ మరోలా," అని అన్నారు. .స్లీపింగ్ పిల్స్, యాంగ్జైటీ మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నాను. అవి మానడానికి ప్రయత్నిస్తున్నా, సాధ్యంకావడం లేదన్నారు. అంతేకాదు, "ఒకప్పుడు కొంతమందిని బాధ పెట్టాను, ఇప్పుడు అది రివర్స్ అయ్యిందని నమ్ముతాను," కర్మ రివర్స్ అయ్యింది. కొన్ని సందర్భాల్లో సూసైడ్ కూడా ప్రయత్నించానని అమర్ దీప్ వెల్లడించారు.
అమర్ దీప్ సినిమా కెరీర్
అమర్ దీప్ మాట్లాడుతూ.. "శైలజా రెడ్డి అల్లుడు" సినిమాలో నటించాను. కానీ ఎడిటింగ్ లో నా సీన్ తీసేశారు. ఆ సీన్ కు డబ్బింగ్ కూడా చెప్పాను, టైటిల్ లో పేరు ఉంది, కానీ సినిమాలో కనిపించను. మురళీ శర్మ గారితో కాంబినేషన్‌లో ఓ సీన్ చేశాను కాని అదీ కట్ అయ్యింది. దాంతో పాటు జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మొగాడివోయ్, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేశాను, కానీ వాటిలో చాలా వాటిని చివరికి ఎడిటింగ్ లో తీసేశారని అమర్ దీప్ బాధపడ్డారు. "జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదటి అవకాశం మనోజ్ నంద సినిమాలో వచ్చింది. చాలాకష్టపడితే శాలరీగా 350 ఇచ్చినట్టు అమర్ దీప్ చెప్పుకొచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో తన మానసిక ఆరోగ్య సమస్యలు, కెరీర్ సవాళ్లు గురించి ఎంతో నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పుకొచ్చాడు అమర్ దీప్. తన లవ్ స్టోరీతో పాటు, అమ్మ అంటే ఎంత ఇష్టమో వివరించాడు. హీరో రవితేజ అంటే చాలా ఇష్టమని.. తాను దేవుడిలా కొలిచే వ్యక్తి తన నటన మెచ్చుకున్న సందర్భం మర్చిపోలేనిదన్నారు అమర్ దీప్. ప్రస్తుతం అమర్ దీప్ హీరోగా చేస్తున్న చిత్రం "నాయుడు గారి అమ్మాయి". ఈ సినిమా ద్వారా తన కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలవుతుందనే నమ్మకంతో ఉన్నాడు అమర్.