- Home
- Entertainment
- 20 కోట్ల చెవి కమ్మలు, 72 కోట్ల డ్రెస్, 1000 కోట్ల ఆస్తులతో, టాలీవుడ్ రిచ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
20 కోట్ల చెవి కమ్మలు, 72 కోట్ల డ్రెస్, 1000 కోట్ల ఆస్తులతో, టాలీవుడ్ రిచ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
దాదాపు 1000 కోట్ల ఆస్తి, 20 కోట్ల చెవి కమ్మలు, అమెరికాలో లగ్జరీ హౌస్, మహారాణిలా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా? టాలీవుడ్ లో వేల కోట్ల ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోన్న ఈ బ్యూటీ ఎవరు?

మాజీ ప్రపంచ సుందరి
చాలా మంది హీరోయిన్లు మోడలింగ్, ఫ్యాషన్ షోల నుంచి ఇండస్ట్రీకి వస్తుంటారు. మిస్ ఇండియా అయినా, మిస్ యూనివర్స్ అయినా.. ఆతరువాత హీరోయిన్ అవ్వాల్సిందే. బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో చాలమంది అలా వచ్చినవారే. అదేవిధంగా, ఈ రోజు ప్రపంచ సుందరి కిరీటంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, భారతీయ సినిమాలో ప్రముఖ ముఖాల్లో ఒకరిగా ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీని ఏలింది. బాలీవుడ్, హాలీవుడ్ లో అద్భుతాలు చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు గ్లోబల్ బ్యటీ ప్రియాక చోప్రా.
KNOW
ప్రియాంక చోప్రా ఫిల్మ్ జర్నీ
2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకొని, ఒక మోడల్‌గా తన ప్రయాణం ప్రారంభించిన ప్రియాంక ప్రస్తుతం అంతర్జాతీయ సెలబ్రిటీగా మారిపోయింది. బాలీవుడ్, హాలీవుడ్‌లో తన ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఈ మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా ఇప్పుడు టాలీవుడ్ పై కన్నేసింది. సౌత్ సినిమాతో తన ప్రస్థానం స్టార్ట్ చేసిన ప్రియాంక, ఇప్పుడు అదే సౌత్ సినిమా ద్వారా పాన్ ఇండియాను షేక్ చేయబోతోంది. తమిళంలో "తమిజన్" అనే సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి 2002లో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా, ఆతరువాత సౌత్ వైపు తిరిగి చూడలేదు. వెంటనే బాలీవుడ్ కు జంప్ అయ్యింది. ఇక బాలీవుడ్‌లో ఆమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా 'ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై' 2003 లో రిలీజ్ అయిన ఈసినిమాలో సన్నీ డియోల్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాత బ్లఫ్‌మాస్టర్, డాన్, ఫ్యాషన్, కమీనీ, 7 కూన్ మాఫ్, బర్ఫీ!, మేరీ కోమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది ప్రియాంక చోప్రా.
హాలీవుడ్‌లో రాణించిన ఇండియన్ స్టార్ హీరోయిన్
హిందీ సినిమాల్లో స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ తో పాటు కొన్ని సార్లు వివాదాలు కూడా పేస్ చేసింది. తన స్టైల్ లో విమర్శలు కూడా చేస్తుంటుంది ప్రియాంక. ఈక్రమంలోనే హాలీవుడ్ వైపు చూసిన ప్రియాంక. వెంటనే అక్కడ ప్నయత్నాలు మొదలు పెట్టింది. అమెరికాలో కొన్ని సిరీస్ లు చేసుకుంటూ వచ్చిన ఆమెకు హాలీవుడ్ సీరీస్ 'క్వాంటికో' ద్వారా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అలాగే, కొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. 2018లో ప్రముఖ పాప్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక. ఇక ఆతరువాత హాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె తమ కుమార్తె మాల్టీ మేరీతో కలసి లాస్ ఏంజిల్స్‌లో జీవిస్తోంది.
ప్రియాంక చోప్రా లగ్జరీ లైఫ్
ప్రియాంక చోప్రా సినిమాల ద్వారా కోట్లు కూడబెట్టింది. రకరకాల బిజినెస్ లలో కూడా ఆమె పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఇండియాలో ఆమెకు బోలెడు ఆస్తులు ఉన్నాయి. అంతే కాదు ఇండియాలో ప్రముఖంగా ముంబయల్ లో ఉన్న కొన్నిప్లాట్స్ ను రీసెంట్ గా అమ్మేసింది ప్రియాంక. లాస్ ఏంజిల్స్‌లో ఆమె కొత్తగా 100 కోట్లు పెట్టి లగ్జరీ హౌస్ ను నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు తన ఫ్యాషన్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంది ప్రియాంక చోప్రా. ఇక ఆమె తన ఫ్యాషన్ చాయిస్‌లతో ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది. ఒకసారి ఆమె ధరించిన 50 క్యారెట్ల వజ్రాల చెవిపోగులు విలువ 21.75 కోట్లు కాగా.. మరోసారి 72 కోట్ల విలువైన గౌన్‌ను ధరించింది. 2018లో నిక్‌తో నిశ్చితార్థం సమయంలో ఆమె ధరించిన వజ్ర ఉంగరం విలువ 2.1 కోట్లు. ఇక 45 ప్రియాంక లక్షల ధర ఉన్న దుస్తులు ధరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ప్రియాంక చోప్రా ఆస్తులు
బాలీవుడ్ సినిమాలను తగ్గించినప్పటికీ, ఆమె బ్రాండ్ వెల్యూలో ఎక్కడా తగ్గలేదు. హాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ.. ఆమె కోట్లు సంపాదిస్తోంది. సినిమాకు 30 కోట్ల వరకూ ఆమె రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు కొన్ని ప్రొడెక్ట్స్ కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. బ్రాండ్స్ ద్వారా కోట్లు కొల్లగొడుతున్న ప్రియాంక చోప్రా.. ఇతర ఆదాయాల ద్వారా బాగానే కూడబెట్టినట్టు సమాచారం. ఈరకంగా కొన్ని అంచనాల ప్రకారం ప్రియాంక చోప్రాకు 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆమె చివరిసారిగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘ది వైట్ టైగర్’ 2021లో విడుదలైంది. లగ్జరీ కార్లు, బంగ్లా, నగలతో పాటు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది ప్రియాంక చోప్రా.
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ప్రియాంక
హాలీవుడ్ కు వెళ్లిన తరువాత ఇండియన్ సినిమాల్లో నటించడం మానేసింది ప్రియాంక చోప్రా. అడపాదడపా ఒకటి రెండు సినిమాలు తప్పించి ఎక్కువగా అమెరికాలోనే ఉంటోంది. అయితే ప్రస్తుతం ఆమె టాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాలో ప్రియాంక చోప్రా హిరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంకాను టాలీవుడ్ కు రప్పించాడు జక్కన్న. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈసినిమాలో ప్రియాంక చోప్రా పాత్ర ఎలా ఉండబోతోందా అని అంతా ఎదురు చస్తున్నారు. మహేష్ బాబు జోడీగా ఆమె ఛాయిస్ పర్ఫెక్ట్ అంటున్నారు ఫ్యాన్స్.