MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమర్‌ - తేజస్వీ, నిరుపమ్ - మంజుల, జాకీ - హరిత, సిద్దార్ద్ - విష్ణు ప్రియా, సీరియల్ కలిపిన బంధం, ప్రేమ పెళ్లి

అమర్‌ - తేజస్వీ, నిరుపమ్ - మంజుల, జాకీ - హరిత, సిద్దార్ద్ - విష్ణు ప్రియా, సీరియల్ కలిపిన బంధం, ప్రేమ పెళ్లి

ఎన్నెన్నో జన్మల బంధం ఎక్కడో ఒక చోట కలుస్తుంది అంటారు పెద్దలు. అది నిజమా కాదా తెలియదు కాని.. కెరీర్ కోసం సినిమాలు, సీరియల్స్ లోకి వచ్చిన తారలు అక్కడ తమ మనసుకు నచ్చి... వారిని మెచ్చిన పార్ట్నర్ ను వెతుక్కుని పెళ్లిల్లు చేసుకున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న సీరియల్ నటులు ఎవరో చూద్దాం. 
 

Mahesh Jujjuri | Updated : Nov 26 2023, 12:41 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

ప్రేమ పెళ్ళి చేసుకున్న సీరియల్ నటీనటులలో రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు అమర్ దీప్ చౌదరి- తేజస్వీనీ గౌడ. ఉయ్యాలా జంపాల సీరియల్ తో తెలుగు  టెలివిజన్ ఆడియన్స్ కి పరిచయమయ్యాడు  అమర్ దీప్. ఈసీరియల్ లో  సెకండ్ హీరోగా మెరిసాడు. ఆతరువాత సిరిసిరి మువ్వలు సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. తెలుగు, కన్నడ, తమిళంలో సీరియల్స్ తో బిజీగా ఉన్న తేజస్విని గౌడ ను ప్రేమిచి రీసెంట్ గా పెళ్ళాడాడు. కోయిలమ్మ  సీరియల్ తో తెలుగు ఆడియన్స్ మనసు దోచిన తేజస్వీ.. అటు తమిళ్ లో కూడా  మంచి గుర్తింపు పొందింది. ఇక అమర్ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఉన్నాడు. టాప్ 5లో అతనుపక్కా.. రన్నర్ గా కూడా అతని పేరే వినిపిస్తుంది. 
 

29
Asianet Image

ఇక అమర్ తో పాటు జానకికలగనలేదుసీరియల్ లో నటిస్తోంది ప్రియాంక జైన్. ఈ బ్యూటీ మొదటి సీరియల్ మౌనరాగం. ఈసీరియల్ లో మూగ అమ్మాయిగా నటించి మెప్పించింది బ్యూటీ. మౌనరాగంలో హీరోగా నటించి శివకుమార్ తో ప్రేమలో ఉంది ప్రియాంక. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. త్వరలో శివనుపెల్ళాడబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బస్ తెలుగు సీజన్ 7 లో టాప్ 5 కంటెస్టెంట్ గా ఉంది ప్రియాంక. 
 

39
Asianet Image

సిద్ధార్థ వర్మ..విష్ణు ప్రియా.. ఈ ఇద్దరు సీరియల్ స్టార్స్..తెలుగు ప్రేక్షకులు మనసు దోచుకున్నతారలు.  త్రినయని, కుంకుమపువ్వు,ఇద్దరమ్మాయిలు అభిషేకం వంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  పలు సీరియల్స్ లో నటించిన సిద్ధార్థ వర్మ బుల్లితెర నటి విష్ణు ప్రియను ఎంతో  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు కూడా. 
 

49
Asianet Image

ఇక ప్రేమపెళ్ళి చేసుకున్న మరోజంట నిరుపమ్ పరిటాల మరియు మంజుల. కన్నడ నటి  మంజుల నిరుపమ్ తో కలిసి చంద్రముఖి సీరియల్‌లో కలిసి నటించింది. చాలాకాలం ఈసీరియల్ లో వీరి జర్నీ కొనసాగింది. అయితే సీరియల్ అయిపోయే నాటికి వీరి పెళ్ళి అయ్యింది.. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కన్నడ నటి అయిన మంజలు చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 

59
Asianet Image

అటుసినిమాలు.. ఇటుసీరియల్స్ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ వచ్చిన సుహాసిని  గుర్తుండే ఉంటుంది. ఆమె తన తోటి నటుడు ధర్మను  ప్రేమించి పెళ్ళాడింది. అపరంజి, అనుబంధాలు,ఇద్దరమ్మాయిలు తదితర సీరియల్స్ లో నటించిన సీనియర్ హీరోయిన్,వెండితెర హీరోయిన్ సుహాసిని తనతో కల్సి ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటించిన ధర్మని పెళ్లాడింది.

69
Asianet Image

ప్రియతమ్ అనగానే ముందుగానే గుర్తొచ్చేది ఈటీవీ లో ప్రసారమైన మనసు మమత సీరియల్ లోని రాజా పాత్ర. అలా ప్రియతమ్ తన నటన తో ఫ్యామిలీ ప్రేక్షకుల కు దగ్గర అయ్యాడు.  చంద్రముఖి క్యారక్ట్ ర్ తో అందరిని మెప్పించిన మానస. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో అనే సీరియల్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రియతమ్ చరణ్,మానస ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు.
 

79
Asianet Image

సీరియల్ కలిపిన బంధంలో సీనియర్ జంట జాకీ- హరిత. హీరోయిన్ రవళి చెల్లెలు అయిన హరిత కొన్నిసినిమాల్లో కూడా నటించింది. ఇక అప్పటికే సినిమాల్లో బాగా ఫేమస్ అయిన జాకీ ఇద్దరు ఒక ప్రోగ్రామ్ లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆతరువాత టెలివిజన్ లోకి అడుగు పెట్టి.. వైదేహి, సంఘర్షణ, కలవారి కోడలు,మనసు తదితర సీరియల్స్ లో కల్సి నటించిన హరిత,జాకీ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.

89
Asianet Image

ఇక సీరియల్ కలిపిన బంధంలో మరో సీనియర్ జంట ఇంద్రనీల్ మరియు మేఘన. తెలుగువారు మెచ్చిన చక్రవాకం సీరియల్ లో నటించారు ఈ ఇద్దరు. ఆసీరియల్ నడుస్తుండగానే ప్రేమించకుని ఇద్దరు ఓ ఇంటివారు అయ్యారు. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 
 

99
Asianet Image

వీరే కాదు.. యాంకర్లు గా రాణిస్తున్న సుమ కనకాల -రాజీవ్ కనకాల,  శ్యామలా-నరసింహరెడ్డి,  ప్రియాంక నాయుడు, మధుబాబు, ఇలా చాలామంది తారలు సీరియల్స్ లో కి వచ్చి తమ లక్ ను పరీక్షించుకోవడంతో పాటు.. లక్కీగ పార్ట్ నర్స్ ను సెలక్ట్ చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
శింబుని 'నాయకుడు' అని పిలిచిన కమల్ హాసన్.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ?
శింబుని 'నాయకుడు' అని పిలిచిన కమల్ హాసన్.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ?
రజనీకాంత్ మూవీ కలెక్షన్లని అధికమించిన కమెడియన్ చిత్రం, వారం రోజుల్లోనే సంచలనం
రజనీకాంత్ మూవీ కలెక్షన్లని అధికమించిన కమెడియన్ చిత్రం, వారం రోజుల్లోనే సంచలనం
ఆలియా భట్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యిందా ? వైరల్ అవుతున్న ఫోటో
ఆలియా భట్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యిందా ? వైరల్ అవుతున్న ఫోటో
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved