Amala Paul Statement: రిలీఫ్ కోసం రొమాంటిక్ సినిమాలు చేస్తానన్న అమలాపాల్
సౌత్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో అమలా పాన్ ఒకరు. అందానికి అందం.. నటనకు నటనతో ఆకట్టుకుంటున్న ఈబ్యూటీ. రాను రాను పరిస్థితుల మారిపోయి డౌన్ అయిపోయింది. ఇక ప్రస్తుతం బోల్డ్ సినిమాలతో హాడావిడిచేస్తున్న చిన్నది.. ఇంకా రొమాంటిక్ సినిమాలు చేయడానిక రెడీ అంటోంది.

సౌత్ లో అందమైన హీరోయిన్లకు కొదవ లేదు. అయితే అందంతో పాటు టాలెంట్ కూడా ఉపయోగించుకుని పైకివాచ్చిన వారు చాలా తక్కువ. స్టార్లుగా వెలుగు వెలిగి మాయమైనవాళ్లు కొందరైతే.. ఇంకా హీరోయిన్ గా జీవనపోరాటు చేస్తున్నవారు ఉన్నారు.. అందులో ముందు వరుసలో ఉన్న హీరోయిన్ గా అమలాపాల్ గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ బిగినింగ్ లోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసిన ఆమె.. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా పెళ్ళి చేసుకుని ఇబ్బందుల్లో పడింది. దాంతో కెరీర్ ను చేచేతుల జారవిడుచుకున్న అమలా పాల్.. మళ్లీ నిలదొక్కుకోవాలని చూస్తోంది. ప్రస్తుత సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసిన నటి..మళ్ళీ మంచి ఇమేజ్ పెంచుకోవాలని ట్రై చేస్తోంది. అందులో బాగంగా నిర్మాతగా సైతం ఆమె సరికొత్త అడుగు వేసింది.
కడావర్ సినిమాను తన ఓన్ ప్రోడక్షన్ లో నిర్మించింది అమలా పాల్. ఆమె కీలకపాత్రలో నటించిన ఈసినిమాను థియేటర్లో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయబోతోంది. ఈనెల 12 నుంచి ఈ సినిమా డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా అమలాపాల్ మీడియాతో మాట్లాడింది. తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలుపంచుకుంది.
తాను ప్రస్తుతం నిర్మాతగా సక్సెస్ కోసం చూస్తున్నానంటోంది. అంతే కాదు సినిమాల విషయంలో కూడా తాను వెనకడుగు వేయలేదని స్ట్రెస్ రిలీజ్ కోసం తాను రొమాంటిక్ సినిమాలు చేస్తానంటోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో అమలా పాల్ హట్ నెస్ డోస్ పెంచింది. సినిమా కోసం..పాత్ర డిమాండ్ ను హద్దులు లేని హాట్ నెస్ కు కూడా ఒకే అంటోంది బ్యూటీ.
amala paul
ఇక తాను నిర్మించిన సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుంది బ్యూటీ. తను నిర్మించిన సినిమా ఆపడానికి చాలా మంది ప్రయత్నించారని. ఈ సినిమా పూర్తి చేయడానికి తాను ఎంతో కష్టపడ్డానంటోంది. దాదాపు నాలుగేళ్లు ఎన్నో పోరాటాలు చేసి సినిమాను పూర్తి చేశామని తెలిపింది.
సినిమా రిలీజ్ విషయంలో కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి.. రావడం కాదు వాటిని కావాలనే సృష్టించారంటోంది అమలా పాల్. చివరకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ముందుకొచ్చిందని చెప్పింది. ఈ విషయంలో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
Amala Paul hot
కడావర్ సినిమా అద్భుతంగా ఉంటుంది అని అంటోంది అమలాపాల్. ఈ సినిమాలో తన పాత్ర కొత్తగా, స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పింది. కథ నచ్చడంవల్లనే తాను ఇప్పటి వరకూ క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ సినిమాలు చేశానని... ఇకపై కెరీర్ లో కాస్త రిలీఫ్ కోసం రొమాంటిక్ సినిమాలు చేస్తానంటోంది.