MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లై రెండు నెలలే.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన అమలాపాల్‌.. ఫన్నీ పోస్ట్..

పెళ్లై రెండు నెలలే.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన అమలాపాల్‌.. ఫన్నీ పోస్ట్..

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తన సంతోషాన్ని పంచుకుంది. తన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నట్టు వెల్లడించింది. సోషల్‌మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్‌ చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 03 2024, 10:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది అమలాపాల్‌. ఆమె ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది. గోవాకి చెందిన జగత్‌ దేశాయ్‌ని అమలా పాల్‌ రెండు నెలల క్రితం పెళ్లిచేసుకుంది. అక్టోబర్‌లో ప్రియుడిని పరిచయం చేసిన అమలా పాల్‌.. నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తాజాగా అప్పుడే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రెగ్నెన్సీని ప్రకటించింది. తాను ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. తమ జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నారని వెల్లడించింది. వన్‌ ప్లస్‌ వన్‌ ఇక్వల్ట్ 3 అని ఇప్పుడు నాకు తెలిసింది అంటూ ఫన్నీగా వెల్లడించింది. చాలా హ్యాపీగా ఉందని ఆమె సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. 

38

ఈ సందర్బంగా అమలా పాల్‌ తన ప్రెగ్నెన్సీని చూపిస్తూ పలు ఆసక్తికరమైన ఫోటోలను పంచుకుంది. ఇందులో తన భర్త జగత్‌ దేశాయ్‌ లోపల అమలాపాల్‌ తన గర్భాన్ని పట్టుకుని చూపిస్తున్నట్టు ఓ ఫోటోని, తను, తన భర్త ఆమె గర్భాన్ని పట్టుకుని చూపించినట్టు మరో ఫోటోని, సముద్ర తీరంలో తన భార్య భర్తలకు సంబంధించిన ఆఫ్‌ కట్ ఫోటోని షేర్‌ చేసింది అమలా పాల్‌. 
 

48

దీంతో సెలబ్రిటీలు, ఆమె అభిమానులు స్పందించి విషెస్‌ తెలియజేస్తున్నారు. అభినందనలు తెలియజేస్తున్నారు. పండంటి బిడ్డ రావాలని కోరుకుంటున్నారు. అంత బాగుండాలని విష్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు కొంటె కామెంట్లు చేస్తున్నారు. చిలిపి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

58

అమలాపాల్‌ అక్టోబర్‌ చివరి వారంలో తన ప్రియుడు జగత్‌ దేశాయ్‌ బర్త్ డే సందర్భంగా ఆయన్ని పరిచయం చేస్తూ విషెస్ చెప్పింది. అదే సమయంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు తెలిపింది. రింగులు చూపించారు. ఆ వారం పది రోజుల్లోనే నవంబర్‌ 5న గ్రాండ్‌గా రెండో వివాహం చేసుకుంది అమలా పాల్. 
 

68

కరెక్ట్ గా రెండు నెలలు కూడా నిండలేదు. అప్పుడే ప్రెగ్నెన్సీని ప్రకటించడంతో ఆశ్చర్యపోతున్నారు. ఏంటి పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు, ఇంత ఫాస్ట్ గానా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఏదో తేడా కొడుతుందే అని, ప్రెగ్నెంట్‌ అయ్యాక పెళ్లి చేసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
 

78

అమలా పాల్‌.. 2014లో దర్శకుడు ఏ ఎల్‌ విజయ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది కూడా ప్రేమ పెళ్లినే. దాదాపు మూడేళ్ల బంధం తర్వాత 2017లో విడిపోయారు. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంది అమలాపాల్‌. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ రెండో వివాహంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్రకటించడం విశేషం. 

88

ప్రస్తుతం అమలా పాల్.. `డీవిజా`, `లెవెల్‌ క్రాస్‌` చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు మలయాళంలో రూపొందుతున్నాయి. ఈ రెండు ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అమలా పాల్ భర్త జగత్‌.. గోవాలో లగ్జరీ విల్లాలకు మెనేజర్ గా ఉన్నట్టు, రియల్‌ ఎస్టేట్ రంగంలో ఉన్నట్టు తెలుస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tejasswi Prakash: కరణ్, తేజస్విల 7.63 కోట్ల లగ్జరీ హౌస్.. సీక్రెట్ బాత్రూమ్ డిజైన్ గురించి తెలుసా
Recommended image2
Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా
Recommended image3
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved