- Home
- Entertainment
- బన్నీ, రాంచరణ్ తో పోల్చుకున్నందుకు ఆ హీరోకి చుక్కలు చూపించారుగా.. అల్లు అరవింద్ ట్రీట్మెంటే వేరు
బన్నీ, రాంచరణ్ తో పోల్చుకున్నందుకు ఆ హీరోకి చుక్కలు చూపించారుగా.. అల్లు అరవింద్ ట్రీట్మెంటే వేరు
చాలా మంది స్టార్ సెలెబ్రిటీల పిల్లలు లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది స్టార్స్ మాత్రం తాము ఎంత పెద్ద సెలెబ్రిటీ అయిన తమ పిల్లలకు కూడా డబ్బు విలువ తెలియాలని కోరుకుంటారు.

చాలా మంది స్టార్ సెలెబ్రిటీల పిల్లలు లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది స్టార్స్ మాత్రం తాము ఎంత పెద్ద సెలెబ్రిటీ అయిన తమ పిల్లలకు కూడా డబ్బు విలువ తెలియాలని కోరుకుంటారు. పూరి జగన్నాధ్ లాంటి వారి మాటలు ఇలాగే ఉంటాయి. నేను ఎంత కష్టపడ్డానో నా పిల్లలు కూడా అంతే కష్టపడాలి అని పూరి జగన్నాధ్ అంటుంటారు.
ఇక స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ శైలి కూడా దాదాపు అంతేనట. డబ్బు విషయంలో తన తండ్రి తనకి చుక్కలు చూపించారని అల్లు హీరో శిరీష్ ఒక సందర్భంలో తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ అలీ అల్లు శిరీష్ ని ఆసక్తికర ప్రశ్న అడిగారు.
అల్లు శిరీష్ ఒక సందర్భంలో తనని తాను రాంచరణ్, అల్లు అర్జున్ తో పోల్చుకుంటూ మాట్లాడాడట. బన్నీకి 21 ఏళ్ళు వచ్చినప్పుడు కారు కొనిచ్చారు. రాంచరణ్ కి కూడా ఆ ఏజ్ రాగానే కారు కొనిచ్చారు. నాకు కూడా ఇప్పుడు 21 ఏళ్ళు వచ్చాయి కారు కొనివ్వండి అని మీ నాన్నని అడిగావట.. అప్పుడు ఆయన నీపై అక్షింతలు చల్లినట్లు తెలిసింది.. ఏంటా సంగతి అని అలీ ప్రశ్నించాడు.
దీనితో శిరీష్ మొదట నవ్వేశాడు. యంగ్ ఏజ్ రాగానే చాలా మంది ప్రొడ్యూసర్స్, స్టార్స్ కొడుకులు మంచి మంచి స్పోర్ట్స్ కారుల్లో తిరుగుతుంటారు. కాబట్టి నాక్కూడా కారు కావాలి అని అడిగా. వెంటనే నాన్న చెప్పు తీసుకుని కొడతా అన్నారు. నేను కారు కొనివ్వను. కానీ నీకు 21 ఏజ్ వచ్చింది కాబట్టి కొంత డబ్బు ఇస్తా. దానితో నువ్వు సంపాదించుకుని కొనుక్కో అన్నారు.
ఆ జోష్ లో ఒప్పేసుకున్నా. కానీ ఆ డబ్బుని మరింత ఎక్కువ చేసి కారు కొనుక్కోవడానికి మూడేళ్లు పట్టింది అని శిరీష్ తెలిపాడు. డబ్బులు పిల్లలకి ఈజీగా ఇవ్వకూడదు అని నాన్న భావిస్తారు. చిన్నప్పటి నుంచి అలాగే పెంచారు. నేను 10వ తరగతి చదువుతునప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు శ్రీకాంత్, వేణు హీరోలుగా పెళ్ళాం ఊరెళితే అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆ చిత్రానికి నాన్నగారు కూడా ప్రొడ్యూసర్. ఆ మూవీ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ మారిషస్ వెళుతున్నారు. నేను కూడా వెళతా అని మారం చేశా. సరే పంపిస్తా.. కానీ ఒక కండిషన్ అని నాన్నగారు మెలిక పెట్టారు. మేము షూటింగ్ కోసం ఆల్రెడీ ఒక బడ్జెట్ అనుకున్నాం. నువ్వు వెలితే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. యూనిట్ తో పాటు అకౌంటెంట్ కూడా వెళుతున్నాడు.
ఆ జాబ్ నువ్వు చేస్తానంటే అకౌంటెంట్ ని ఆపి నిన్ను పంపిస్తా అన్నారు. ఈ పది రోజులు ఆఫీస్ కి వచ్చి అకౌంట్స్ మీద ట్రైనింగ్ తీసుకో అన్నారు. అలా పది రోజులు అకౌంట్స్ గురించి మొత్తం తెలుసుకున్నా. మారిషస్ లో ఉదయాన్నే బడ్జెట్ లెక్కలు వేసేవాడిని.. వాళ్ళు షూటింగ్ చేస్తున్నప్పుడు నేను జాలిగా టూర్ ఎంజాయ్ చేశా. మళ్ళీ ఈవెనింగ్ వచ్చి అకౌంట్స్ చూసుకునేవాడిని. ఆ విధంగా మారిషస్ టూర్ ముగిసింది అని శిరీష్ తెలిపాడు. ఎంతైనా తండ్రిగా, నిర్మాతగా అల్లు అరవింద్ ట్రీట్మెంటే వేరు అని ఫ్యాన్స్ అంటున్నారు.