MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కొన్నేళ్లుగా మా మధ్య అది జరుగుతుంది.. మెగా ఫ్యామిలీతో విభేదాలపై అల్లు అరవింద్‌ ఆసక్తికర విషయాలు వెల్లడి..

కొన్నేళ్లుగా మా మధ్య అది జరుగుతుంది.. మెగా ఫ్యామిలీతో విభేదాలపై అల్లు అరవింద్‌ ఆసక్తికర విషయాలు వెల్లడి..

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీకి, అల్లు అరవింద్‌ ఫ్యామిలీకి మధ్య విభేదాలు తలెత్తాయనేది చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అల్లు అరవింద్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 11 2022, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిరంజీవి సొంతంగా టాలీవుడ్‌లోకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. అప్పటికే అల్లు రామలింగయ్య సీనియర్‌ నటుడిగా, కమెడీయన్‌గా రాణిస్తున్నారు. ఇండస్ట్రీలో పాతుకుపోయారు. అలాంటి టైమ్‌లో అప్పుడప్పుడే చిరంజీవిలోని ప్రతిభని గుర్తించిన అల్లు రామలింగయ్య భవిష్యత్‌లో చిరు పెద్ద స్టార్‌ అవుతాడని ఊహించిన, ఆయన ప్రవర్తన నేపథ్యం నచ్చి అల్లుడిని చేసుకున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలా అటు అల్లు ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యామిలీ విస్తరిస్తూ వచ్చింది. చిరంజీవికి మెగాస్టార్‌ ఇమేజ్‌ పెరిగిపోవడంతో అల్లు ఫ్యామిలీ సైతం మెగా ఫ్యామిలీ కుటుంబంలోనే భాగమైపోయిందనే భావన అందరిలోనూ కలుగుతూ వస్తుంది. కానీ రెండు బలమైన కుటుంబాలే అని సుస్పష్టం. అయితే ఇటీవల కాలంలో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తలెత్తాయనే టాక్‌ వినిపిస్తుంది. 

36

బన్నీ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడంతో, మెగా ఫ్యామిలీలోనూ వరుసగా హీరోలు సినీ రంగంలోకి రావడంతో రెండు కుటుంబాల మధ్య పోటీ పెరిగిందని, ఇది విభేదాలకు కారణమైందనే కామెంట్లు తరచూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విభేదాలపై మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ స్పందించారు. ఇప్పటికే ఆయన పలు మార్లు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు మరోసారి స్పష్టం చేశారు. 
 

46

ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్‌కి ఈ ప్రశ్న ఎదురుకాగా ఆయన చెబుతూ, చిరంజీవి, తాను 80 నుంచి స్నేహితులమని చెప్పారు. స్నేహితులుగా ఉంటూనే కెరీర్‌ పరంగా ఎదుగుతూ వచ్చామన్నారు. చిరు, తాను బావబావమరుదులుగా కాకుండా ఫ్రెండ్స్ గానే ఎదిగామన్నారు అల్లు అరవింద్‌. అలా తమ కుటుంబాలు కూడా ఎదుగుతూ వచ్చాయని, పిల్లలు వచ్చారు, వారు కూడా ఇదే రంగంలో స్థిరపడటంతో మరింత పెరిగిందన్నారు. 
 

56

చిత్ర పరిశ్రమలో అవకాశాలను పంచుకోవాలని, ఎవరి స్థానాలను వారు కాపాడుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే పోటీ ఉంటుందన్నారు. అయితే ఎంత పోటీ ఉన్నా అది కెరీర్ పరంగానే కానీ, ఫ్యామిలీల పరంగా కాదని స్పష్టం చేశారు అల్లు అరవింద్‌. అందరూ ఆ విషయాల్లో ఒకే మాట మీద ఉంటారని చెప్పారు. సంక్రాంతి పండుగ వస్తే తమ ఇంట్లో నాన్నగారి కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరం చిరంజీవి ఇంటికి చేరతామని తెలిపారు అరవింద్‌. 
 

66

`దీపావళి పండుగ రోజున కూడా అందరం కలిసి చిరంజీవి ఇంట్లో సరదాగా సెలబ్రేట్‌ చేసుకుంటామని, కొన్నేళ్లుగా ఇది జరుగుతుందన్నారు. మేమంతా కలిసి పండుగలు సెలబ్రేట్‌ చేసుకుంటామని వీడియోలు తీసి చూపించాలా? అలా పెట్టలేం కదా. కాంపిటీషన్‌లో ఎవరికి వాళ్లు పైకి వస్తున్నారు. కానీ వీరంతా ఒక్కటే` అని క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్‌. ఆయన నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌ బిగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌(గీతా ఆర్ట్స్)ని నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పుడు అల్లు రామలింగయ్య పేరుతో ఫిల్మ్ స్టూడియోని కూడా నిర్మించారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved