MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ లుక్ లీక్, అట్లీ సినిమాలో సూపర్ హీరోగా ఐకాన్ స్టార్

అల్లు అర్జున్ లుక్ లీక్, అట్లీ సినిమాలో సూపర్ హీరోగా ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ సినిమా నుంచి బన్నీ లుక్ లీక్ అయ్యింది.ఈ లుక్ లో ఐకాన్ స్టార్ ఎలా ఉన్నాడంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 21 2025, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అల్లు అర్జున్ 22వ సినిమా
Image Credit : Asianet News

అల్లు అర్జున్ 22వ సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన 22వ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్‌డేట్స్, విశేషాలు అభిమానుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి.

24
హాలీవుడ్ సంస్థతో గ్రాఫిక్ వర్క్
Image Credit : X/Sun Pictures

హాలీవుడ్ సంస్థతో గ్రాఫిక్ వర్క్

దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ పనులు ప్రముఖ హాలీవుడ్ సంస్థలచే నిర్వహించబడుతున్నాయి. Avengers, Avatar లాంటి సినిమాలకు వీఎఫ్ఎక్స్ అందించిన పెద్ద సంస్థ ఈసినిమాకు పనిచేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి విడుదలైన ఓ మేకింగ్ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ కాంబినేషన్‌ పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

Related image1
పాతాళ భైరవి రివ్యూ, 73 ఏళ్ల క్రితమే ఆడియన్స్ కు చెమటలు పట్టించిన హారర్ థ్రిల్లర్ మూవీ
Related image2
రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్, సుకుమార్ పై కోపంగా మెగా ఫ్యాన్స్
34
అల్లు అర్జున్ ఫోటో లీక్
Image Credit : Asianet News

అల్లు అర్జున్ ఫోటో లీక్

ఇదిలా ఉండగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ లుక్ ఒకటి వైరల్ అవుతోంది. షూటింగ్ సెట్స్ లో తీసిన ఈ ఫోటోలో అల్లు అర్జున్ సూపర్ హీరో సూట్ ధరించి, జుట్టును ముడివేసిన స్టైల్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్‌ను చూసిన నెటిజన్లు హాలీవుడ్ రేంజ్‌లో బొమ్మ రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్‌పై తెగ ఖుషీ అవుతున్నారు.ఈ మూవీ షూటింగ్‌ను మేకర్స్ 2026 మధ్య నాటికి పూర్తి చేసి, 2027లో థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ తొలిసారిగా సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నారు. ఈ అంశం కూడా సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది.

44
అప్ డేట్ కోసం ప్యాన్స్ వెయిటింగ్
Image Credit : facebook / Allu Arjun

అప్ డేట్ కోసం ప్యాన్స్ వెయిటింగ్

ఇంకా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా తమిళ యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతికత, గ్రాఫిక్స్ వర్క్‌ను వినియోగించి, ఓ పాన్ వరల్డ్ సినిమాగా రూపొందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ లుక్ లీక్ కావడంతో సినిమా మీద క్రేజ్ మరింతగా పెరిగింది. మేకర్స్ అధికారిక పోస్టర్, టైటిల్, మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. AA22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్, అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. ఈసారి 2 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే లక్ష్యంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Shanmukh Jaswanth: ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్..కుందనపు బొమ్మలా వైష్ణవి
Recommended image2
Rashmika First Kiss : విజయ్‌ దేవరకొండకి మొదటి కిస్.. ఆ అనుభవాన్ని బయటపెట్టిన రష్మిక మందన్నా
Recommended image3
Chiranjeevi: చిరంజీవిని పెట్టుకుని ఇలాంటి సినిమానా ? ఇది కామెడీ కాదు.. సీనియర్ రైటర్ కామెంట్స్
Related Stories
Recommended image1
పాతాళ భైరవి రివ్యూ, 73 ఏళ్ల క్రితమే ఆడియన్స్ కు చెమటలు పట్టించిన హారర్ థ్రిల్లర్ మూవీ
Recommended image2
రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్, సుకుమార్ పై కోపంగా మెగా ఫ్యాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved