MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్, సుకుమార్ పై కోపంగా మెగా ఫ్యాన్స్

రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్, సుకుమార్ పై కోపంగా మెగా ఫ్యాన్స్

మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఈ సినిమా కోసం ఆయన ఓ బాలీవుడ్ హీరోయిన్ ను ఫిక్స్ చేశాడట. అయితే ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 21 2025, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్ది బిజీలో రామ్ చరణ్
Image Credit : instagram /buchi babu sana

పెద్ది బిజీలో రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గెటప్, ఏఆర్ రెహమాన్ సంగీతంతో పాటు కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ చేయబోయే పాత్ర ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే పెద్ది సినిమాపై భారీ బజ్‌ క్రియేట్ అయ్యింది. వరుసగా రెండు ప్లాపులు పడటంతో మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టీమ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా
Image Credit : Ram charan Sukumar

సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా

పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో మళ్లీ కలిసి పనిచేయనున్నారు. అధికారిక ప్రకటన ఇప్పటికే ఇచ్చేశారు కూడా. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబోపై మళ్లీ అంచనాలు పెరిగాయి. పుష్ప 2 వంటి గ్లోబల్ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ సినిమా అనగానే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ నెలకొంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబో అంటే అందరి చూపు ఇటువైపే ఉంది.

35
రామ్ చరణ్ జోడీగా కృతీ సనన్ ?
Image Credit : Instagram

రామ్ చరణ్ జోడీగా కృతీ సనన్ ?

ఈ భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా బాలీవుడ్ నటి కృతి సనన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో కృతీ సనన్ మహేష్ బాబుకు జోడిగా నటించింది. ఈసినిమాతోనే ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సాధించలేదు. అంతే కాదు బాలీవుడ్ కు వెళ్ళిపోయిన కృతీ.. మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. రీసెంట్ గా ఆమె ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటించింది. కాని ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, మళ్లీ సుకుమార్ కృతిని ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. కథకు ఆమె పూర్తిగా సరిపోతుందని భావించిన సుకుమార్ ఆమెతో మరోసారి పని చేయాలనుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

45
మెగా ఫ్యాన్స్ అసంతృప్తి ?
Image Credit : Asianet News

మెగా ఫ్యాన్స్ అసంతృప్తి ?

అయితే ఈ వార్తలపై మెగా ఫ్యాన్స్ కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఎన్ని హిట్స్ ఉన్నా.. టాలీవుడ్ లో ‘వన్ నేనొక్కడినే’, ‘దోచేయ్’, ‘ఆదిపురుష్’ వంటి ప్లాప్ సినిమాలు ఆమె ఖాతాలో ఉండటంతో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవడం సరైందా? అనే చర్చ జరుగుతోంది. కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా కథకు తగ్గ మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. అయితే సుకుమార్ కృతీ సనన్ ను ఎంపిక చేశాడు అనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మూవీ టీమ్ మాత్రం అధికారికంగా ఎటువంటిప్రకటన చేయలేదు.

55
అధికారిక ప్రకటన ఎప్పుడు?
Image Credit : Facebook / Ramcharan

అధికారిక ప్రకటన ఎప్పుడు?

ఇదిలా ఉంటే, రామ్ చరణ్-సుకుమార్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని సమాచారం. కథ, బడ్జెట్, కాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్, ఇతర నటీనటుల వివరాలతో సంబంధిత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Related Stories
Recommended image1
పాతాళ భైరవి రివ్యూ, 73 ఏళ్ల క్రితమే ఆడియన్స్ కు చెమటలు పట్టించిన హారర్ థ్రిల్లర్ మూవీ
Recommended image2
80 ఏళ్లు దాటినా ఫిట్ గా ఉన్న తెలుగు ఫిల్మ్ స్టార్స్ ఏవరో తెలుసా? వారి ఆరోగ్య రహస్యం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved