ఫస్ట్ హాఫ్ కే మైండ్ బ్లాక్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంటుందంటే? పుష్ప 2 రివ్యూ ఇచ్చేసిన దేవిశ్రీ!
పుష్ప 2 మూవీ రివ్యూ విడుదలకు ముందే ఇచ్చేశాడు, ఆ మూవీ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది పుష్ప చిత్రం. దర్శకుడు సుకుమార్ పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించాడు. 2021లో విడుదలైన పుష్ప చిత్రం పాన్ ఇండియా హిట్. వరల్డ్ వైడ్ రూ. 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
నార్త్ లో పుష్ప సత్తా చాటింది. పూర్ ప్రమోషన్స్ నేపథ్యంలో పుష్ప చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కలేదు. ఫస్ట్ డే కేవలం రూ. 3 కోట్లు మాత్రమే రాబట్టింది. మౌత్ టాక్ తో మూవీ పుంజుకుంది. లాంగ్ రన్ లో పుష్ప హిందీ వెర్షన్ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. హిందీ ఆడియన్స్ లో బన్నీకి క్రేజ్ ఏర్పడింది.
పుష్ప సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 పై విపరీతమైన హైప్ ఏర్పడింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ సర్వే ప్రకారం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న హిందీ చిత్రాల జాబితాలో టాప్ 3లో పుష్ప 2 ఉంది. ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కావాల్సింది. షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 6కి వాయిదా పడింది.
ఇదిలా ఉండగా.. పుష్ప 2 చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్, విడుదలకు ముందే రివ్యూ ఇచ్చాడు. పుష్ప 2 ఎలా ఉంటుందో తెలియజేశాడు. ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న దేవిశ్రీ ప్రసాద్ కి ఈ ప్రశ్న ఎదురైంది. ఓ జర్నలిస్ట్.. పుష్ప చిత్రానికి మంచి సాంగ్స్ ఇచ్చారు. అయితే బీజీఎం విషయంలో కొంచెం తగ్గిందనే వాదన ఉంది. పుష్ప 2కి బీజీఎమ్ ఎలా ఉండబోతుందని, అడిగారు.
పుష్ప 2 బీజిఎమ్ అసలు తగ్గేదేలే అన్నట్లు ఉంటుందని దేవిశ్రీ అన్నారు. నా గురించి నేను చెప్పుకున్నట్లు ఉంటుంది. కానీ ఒక సినిమాకు ఒక టెక్నీషియన్ బాగా పని చేశాడు అంటే అది కేవలం ఆ టెక్నీషియన్ కి చెందదు. టీం కి చెందుతుంది. పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూసి నా మైండ్ పోయింది. అసలు స్క్రిప్ట్ నెరేట్ చేసేటప్పుడే చంద్రబోస్, నేను మూడు సార్లు క్లాప్స్ కొట్టాము.
ఇదా ఇంటర్వెల్, ఇదా ఇంటర్వెల్ అని పలుమార్లు అడిగాము. సుకుమార్ స్క్రిప్ట్ అద్భుతం. ఇక బన్నీ గ్రేట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. పుష్ప 2 అనేది నెక్స్ట్ లెవెల్ మూవీ. చాలా బాగుంటుంది అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప సిరీస్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ రూ. 300 కోట్లకు పైమాటే అని సమాచారం. రష్మిక మందాన హీరోయిన్ కాగా, ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా చేస్తున్నాడు. అనసూయ, సునీల్, రావు రమేష్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు.
పుష్ప మూవీ కథ విషయానికి వస్తే... దళితుడిగా పుట్టిన పుష్ప చిన్నప్పటి నుండి సమాజంలో గౌరవానికి నోచుకోడు. ఒక అగ్ర కులం వ్యక్తి పుష్ప తల్లిని పెళ్లి చేసుకోకుండా తనను కంటాడు. దాంతో పుష్పరాజ్ కి ఇంటి పేరు కూడా ఉండదు. అవమానాలు, ఛీత్కారాలు చూస్తూ పెరిగిన పుష్పలో ఒక తెగింపు అనేది ఉంటుంది.
Pushpa 2
డబ్బులు ఉంటే గౌరవం దానంతటకదే వచ్చేస్తుందని నమ్మిన పుష్ప.. ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కూలీగా ప్రస్థానం మొదలుపెట్టి సిండికేట్ ని శాసించే నాయకుడు అవుతాడు. తిరుగు లేకుండా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న పుష్పకి పోలీస్ ఆఫీసర్ షెకావత్ రూపంలో సమస్య ఎదురవుతుంది. పుష్ప-షెకావత్ మధ్య ఆధిపత్య పోరు ఎలా నడిచింది అనేది, పార్ట్ 2.