- Home
- Entertainment
- తాత ఫోటో పంచుకున్న అల్లు అర్జున్.. ఓ వైపు ట్రోల్స్ మరోవైపు ట్రెండింగ్.. ఒక్క క్యాప్షన్‌కి ఇంత అలజడా?
తాత ఫోటో పంచుకున్న అల్లు అర్జున్.. ఓ వైపు ట్రోల్స్ మరోవైపు ట్రెండింగ్.. ఒక్క క్యాప్షన్‌కి ఇంత అలజడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. తాజాగా ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందుకు రెండు కారణాలున్నాయి. అవే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ తాజాగా తన తాత అల్లు రామలింగయ్య ఫోటోని పంచుకున్నారు. పైన గోడకి తాత ఫోటో వేలాడుతుంది. దాన్ని కింద నుంచి కెమెరాతో క్లిక్ మనిపిస్తున్నట్టుగా ఉందీ ఫోటో. ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ సింపుల్‌గా ఓ క్యాప్షన్ ఇచ్చారు బన్నీ. ఇందులో ఆయన `మా ఫౌండేషన్` అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని అభిమానులు వైరల్ చేస్తున్నారు. ట్రెండ్ చేస్తున్నారు.
దీనికితోడు `అల్లు అర్జున్` యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇందులో ఆయనతోపాటు #AANo1Choice` యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. `పుష్ప` చిత్రంలోని ఆయన డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన ఫోటోని మిక్స్ చేసి ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ నెంబర్ వన్ ఛాయిస్ అని చాటి చెబుతున్నారు అభిమానులు.
అయితే `పుష్ప` చిత్రంతో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. దీంతో ఇండియావైడ్‌గా అల్లు అర్జున్ ఓ బ్రాండ్‌గా ఎదిగారని, అనేక బ్రాండ్లకి ఆయన ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నారని అంటున్నారు. దీంతో అల్లు అర్జున్(ఏఏ) ఓ బ్రాండ్‌గా ప్రమోట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇలా ఇప్పుడు ట్విట్టర్‌లో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది.
ఇదిలా ఉంటే బన్నీకి వ్యతిరేకంగానూ కొన్ని ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. నెగటివ్ కామెంట్లు సైతం ట్రెండ్ కావడం గమనార్హం. కారణం ఆయన పంచుకున్న పోస్ట్. తాత అల్లు రామలింగయ్య ఫోటోని పంచుకుని ఆయన తమ ఫౌండేషన్ అని పేర్కొనడంతో యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. పాత వీడియోలు, క్లిప్‌లను పంచుకుంటూ ఆడుకుంటున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు.
మొదట్నుంచి తమ ఫ్యామిలీకి పునాది వేసింది చిరంజీవి పేరు చెప్పుకుంటూ వచ్చావని, చిరంజీవి వల్లే తామంతా ఈ స్థాయిలో ఉన్నామని, ఆయన చెట్టు కింద పిల్ల మొక్కలం అంటూ చెప్పుకొచ్చిన బన్నీ, ఇప్పుడు మాట మార్చారని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక్క హిట్ వస్తే అన్నీ మార్చేస్తారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒకప్పుడు మావయ్య చిరంజీవి వల్లే ఇండస్ట్రీకి వచ్చానని, ఇప్పుడు మా అల్లు ఆర్మీ సపోర్ట్ వల్లే ఇండస్ట్రీకి వచ్చానని చెప్పుకుంటున్నారంటూ మీమ్స్ తో ఆడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా హీటెక్కిపోతుందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే `అల వైకుంఠపురములో`, `పుష్ప` చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు బన్నీ. `పుష్ప` చిత్రం ఆయనకు నేషనల్ వైడ్ ఇమేజ్ తీసుకొచ్చిందనేది వాస్తవం. ఆయన మ్యానరిజం, పాటలు, డాన్సులను నార్త్ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అనుకరిస్తున్నారు. కేవలం ఇండియా వైడ్‌గానే కాదు, ఇతర దేశాల్లోని సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం బన్నీ మ్యానరిజాన్ని, స్టెప్పులను ఫాలో అవుతూ రీల్స్ చేయడం విశేషం.
గతేడాది డిసెంబర్ 17న `పుష్ప` విడుదలైన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నెమ్మదిగా పుంజుకుని ఏకంగా 350కోట్లు కలెక్షన్లని రాబట్టింది. కష్టకాలంలో, తక్కువ టికెట్ రేట్లలోనే ఈ రేంజ్ కలెక్షన్లని రాబట్టుకోవడం విశేషం. రష్మిక మందన్నా కథానాయకగా నటించగా, ఇందులో సమంత `ఊ అంటావా మావ` అనే ఐటెమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. త్వరలో `పుష్ప 2` ప్రారంభం కాబోతుంది.