MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పవన్‌తో వివాదం వెనుక అల్లు అర్జున్‌ బిగ్‌ స్ట్రాటజీ..? ఆయన అసలు ప్లాన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే?

పవన్‌తో వివాదం వెనుక అల్లు అర్జున్‌ బిగ్‌ స్ట్రాటజీ..? ఆయన అసలు ప్లాన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే?

పవన్‌ కళ్యాణ్‌కి, అల్లు అర్జున్‌కి మధ్య నెలకొన్న వివాదం, మెగా, అల్లు వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక బన్నీ అసలు ప్లాన్‌ వేరే ఉందట.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 24 2024, 10:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

పవన్‌ కళ్యాణ్‌కి, అల్లు అర్జున్‌కి మధ్య గ్యాప్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇది మెగా, అల్లు వివాదంగానూ మారింది. పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో జనసేన తరఫున పిఠాపురం నుంచి పోటీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోటీలో నిలిచారు. ఈ క్రమంలో అల్లు అర్జున్.. పవన్‌ గెలుపుకోసం ట్వీట్‌ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి కోసం స్వయంగా వెళ్ళి ప్రచారం చేశారు. తన భార్య స్నేహారెడ్డి స్నేహితురాలి భర్త శిల్పరవి చంద్రరెడ్డి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనడం పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అల్లు అర్జున్‌ చేసిన ఆ పనిని మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు వ్యతిరేకించారు. బన్నీపై ట్రోల్‌ చేశారు. విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత నాగబాబు కూడా ఘాటుగానే ట్వీట్‌ చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ బన్నీని అన్‌ ఫాలో చేశాడు. దీంతో వివాదం మరింతగా ముదిరింది. దీనిపై నిహారిక స్పందిస్తూ, సాయిధరమ్‌ బన్నీని అన్‌ ఫాలో కావడంపై ఆమె స్పందిస్తూ అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, ఆయన కారణాలేంటో నాకు తెలియదు అని చెప్పింది. అంతేకాని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పలేకపోయింది. 

39
Allu Arjun

Allu Arjun

ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ ఘన విజయం సాధించిన తర్వాత వీరి మధ్య వివాదం మరింతగా ముదిరినట్టు అయ్యింది. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ మరోసారి అల్లు అర్జున్‌ని ట్రోల్ చేశారు. బన్నీ ప్రచారం చేసినా వైసీపీ నాయకుడు శిల్ప రవిచంద్ర రెడ్డి గెలవకపోవడం కూడా  ఈ వివాదం మరింత పెరగడానికి కారణమయ్యిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు, సోషల్‌ మీడియాలో వస్తోన్న సమాచారం మేరకు మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్‌ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. 
 

49
Allu Arjun

Allu Arjun

తెలుస్తున్న సమాచారం మేరకు.. బన్నీ ఇలా చేయడం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉందట. ఆయన పెద్ద ప్లాన్‌తోనే ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు బన్నీ `మెగా` నీడలోనే ఉన్నాడు. మెగా ఫ్యామిలీ హీరోగానే చెలామణి అవుతున్నాడు. అంతా అలానే పిలుస్తుంటారు. మీడియా కూడా అలానే రాస్తుంది. `అల్లు` ఫ్యామిలీకి బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నా, రామలింగయ్య వారసత్వం ఉన్నప్పటికీ మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత ఆయన సపోర్ట్ తో మిగిలిన హీరోలంతా ఎదిగిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ హీరోలుగానే పిలుస్తుంటారు. 
 

59
Allu Arjun

Allu Arjun

కానీ బన్నీ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. `పుష్ప` సినిమాతో ఆయన రేంజ్‌ మారిపోయింది. `పుష్ప2`తో గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తున్నారు. ఈ సారి గట్టిగా కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా హిట్‌ అయితే నిజంగానే బన్నీకి తనకంటూ సొంతంగా మార్కెట్‌, ఇమేజ్‌, క్రేజ్‌ పెరిగిపోతుంది. ఇంకా మెగా హీరో అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వతహాగా ఆయన ఎదగొచ్చు, ఎక్స్ పోజ్‌ కావచ్చు. అదే ప్లాన్‌తో బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, అదే స్ట్రాటజీతో ఆయన వెళ్తున్నాడని, స్ట్రెయిట్‌గా చెప్పాలంటే `మెగా` నీడ నుంచి బయట పడాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్‌ ముందుకు సాగుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. 
 

69

నిజానికి బన్నీకి, పవన్‌కి పడదు అనే వాదనలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్‌ సినిమా ఈవెంట్లలో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. పవర్‌ స్టార్‌ గురించి చెప్పాలని డిమాండ్‌ చేస్తుంటారు. ఈ విషయంలో బన్నీ చాలా సార్లు చిరాకు పడ్డారు. తాను చిరంజీవికి పెద్ద అభిమానిని, ఆయన్నే ఆరాధిస్తానని అంటూ పరోక్షంగా పవన్‌ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఈ కామెంట్లు కూడా కొంత చర్చనీయాంశం అయ్యాయి. మరోవైపు రామ్‌ చరణ్‌ విషయంలోనూ కొంత గ్యాప్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో చర్చ నడిచింది. ఫ్యాన్స్ దారుణంగా విమర్శలు చేసుకున్నారు. బన్నీ, చరణ్‌ బర్త్ డేల సమయంలో విషెస్‌ చెప్పుకునే విషయంలోనూ ఆ గ్యాప్‌ కనిపించినట్టుగా నెటిజన్లు గుర్తిస్తుంటారు. 
 

79

ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్‌ తనే ఒక బ్రాండ్‌గా ఎదగాలని, అల్లు హీరోగా, ఐకాన్‌ స్టార్‌గా ఎదిగి నిలబడాలని ప్రయత్నిస్తున్నారని. అందులో భాగంగానే ఇలా చేసినట్టు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ నుంచి బయటపడటమే టార్గెట్‌గా బన్నీ ప్లాన్‌ చేస్తున్నారని క్రిటిక్స్ నుంచి, మెగా, అల్లు కాంపౌండ్‌ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.  

89

ఇదిలా ఉంటే నేడుసోమవారం టాలీవుడ్‌ నిర్మాతలు పవన్‌ కళ్యాణ్‌ని కలిశారు. డిప్యూటీ సీఎంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన్ని అభినందించడానికి, అలాగే సీఎం అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఇద్దరిని ఇండస్ట్రీ తరఫున సత్కరించడం కోసం పవన్‌ని కలిశారు. ఇందులో అల్లు అరవింద్‌ కూడా ఉన్నారు. పవన్‌ కోసం ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నాడు.

99

 కొడుకు బన్నీ నంధ్యాల వెళితే, అరవింద్‌ పిఠాపురం వెళ్లాడు. ప్రచారం చేశాడు. నష్టనివారణ కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈ వివాదం విషయంలోనూ ఆయన చక్రం తిప్పుతారా? ఏం చేయబోతున్నారనేది చూడాలి. అయితే ఇవన్నీ తాత్కాలిక మనస్పర్థాలే, ఏదో రోజు అంతా కలిసిపోతారు, మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఒక్కటే అని మరికొందరు అభిప్రాయపడుతుండటం విశేషం. ఏం జరుగుతుందో మున్ముందు తేలనుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved