అల్లు అర్జున్, రామ్‌చరణ్ మధ్య మెగా వార్.. కాంపౌండ్ కి నెక్ట్స్ రాజెవరు ?
మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. టాప్ చైర్ కోసం నువ్వా నేనా అనేలా పోటీ జరుగుతుంది. మరి మెగా కాంపౌండ్‌లో నిలిచే, గెలిచే రాజెవరనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఇటీవల తరచూ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్(Allu Arjun), రామ్‌చరణ్(Ram Charan) ఫ్యాన్స్, అల్లు అర్జున్ చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వార్ జరుగుతుంది. వారు చేసే సినిమాల ప్రధానంగానే ఈ సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఆ హీరో గొప్ప అంటే, ఈ హీరో గొప్ప అని, లేదంటే డాన్సులు, యాక్షన్ సీన్లు, నటన, అది కాకుండా సినిమాల కలెక్షన్లు ఆధారంగా ఫ్యాన్స్ మధ్య ఈ సోషల్ మీడియా వార్ జరుగుతుంటుంది.
ఆ మధ్య బన్నీ ఫ్యాన్స్, రామ్‌చరణ్ ఫ్యాన్స్ గట్టిగానే ఏసుకున్నారు. ఒకరిపై ఒకరు, మా హీరో తోపు అంటూ మా హీరో తోపు అంటూ కామెంట్లు చేసుకున్నారు. స్క్రీన్ షాట్లు తీసి మరీ పోస్ట్ లు పెడుతూ ట్రోల్స్ చేయడం వైరల్ అయ్యింది. మధ్యలోకి పవన్ కళ్యాణ్‌ని లాగుతూ మరింతగా ఏసుకున్నారు. ఇదంతా ఆయా హీరోల మధ్య పోటీని తెలియజేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ప్రధానంగా ఇప్పుడు మెగా కాంపౌండ్‌లో బన్నీ, రామ్‌చరణ్ సేమ్ ఏజ్ గ్రూప్. ఇద్దరికి ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్లుగా రాణిస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. దీంతో మెగా కాంపౌండ్‌లో (Mega Compound) నెక్ట్స్ రాజెవరనేది ఆసక్తికరమైన చర్చకి తెరలేపినట్టయ్యింది.
రామ్‌చరణ్ ప్రస్తుతం సినిమాల లైనప్ అదిరిపోయేలా ఉంది. `ఆర్‌ఆర్‌ఆర్`తో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు శంకర్‌తో `ఆర్‌సీ15` చిత్రం చేస్తున్నారు. ఇది భారీ పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారని, మూడు పాత్రల్లో చరణ్ కనిపిస్తారనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు గౌతమ్ తిన్ననూరితోనూ ఓ భారీ పాన్ ఇండియా సినిమా ఉంది.
వీటితోపాటు రామ్‌చరణ్ లైనప్‌లో భారీ చిత్రాలున్నాయి. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్‌తోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. `విక్రమ్` ఫేమ్ లోకేష్ కనగరాజ్‌తోనూ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఇలా రామ్‌చరణ్ నెక్ట్స్ సినిమాల లైనప్ అదిరిపోయేలా ఉంది. అన్ని భారీ చిత్రాలున్నాయి. ఈ సినిమాలు ఆడితే రామ్‌చరణ్ పాన్ ఇండియా ఇమేజ్‌ని మించి పోతాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ప్రాపర్ ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నారు చరణ్.
మరోవైపు ఐకాన్ స్టార్‌గా రాణిస్తున్న అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన `పుష్ప`కి రెండో పార్ట్ `పుష్ప 2`లో నటిస్తున్నారు. ఇది స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ పడుతుంది. ఈ చిత్ర కథపై దర్శకుడు సుకుమార్ వర్క్ చేస్తున్నారు. `పుష్ప` విజయంతో దీనిపై దేశ వ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు రీచ్ కావాలంటే ఇంకా ఎన్నో హంగులు కావాలి. పైగా `ఆర్‌ఆర్‌ఆర్`, `కేజీఎఫ్ 2` చిత్రాల అనంతరం కథ, టేకింగ్ విషయంలో మరిన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సుకుమార్ కథపై ఇంకా వర్క్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది ఊహించడం కష్టం. సినిమా కనెక్ట్ అయితే నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. లేదంటే బోల్తా కొట్టే పరిస్థితి నెలకొంటుంది. అది సినిమా విడుదలయ్యేంత వరకు చెప్పడం కష్టం. ఈ సినిమా రిజల్ ఏంటనే సస్పెన్స్ ఓ వైపు నెలకొంది. మరోవైపు బన్నీ నెక్ట్స్ సినిమాల లైనప్ విషయంలో క్లారిటీ లేదు. ఆయన `పుష్ప 2` తర్వాత చేయబోయే సినిమా ఎవరితో అనేది ఇంకా తెలియదు. కొరటాల శివతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యింది. బోయపాటితో సినిమా ఉంటుందన్నారు. అలాగే ప్రశాంత్ నీల్‌తోనూ చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి.
ఏఆర్ మురుగదాస్ టాక్ జరిగినట్టు సమాచారం. దీనికితోడు సంజయ్ లీలా భన్సాలీకి, బన్నీకి మధ్య చర్చలు జరిగినట్టు టాక్. కానీ వీటిలో ఏదీ ఫైనల్ కాలేదు. అన్ని వార్తలుగానే, పూకార్లుగానే ఉన్నాయి తప్పితే, అధికారికంగా అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు బన్నీ చేతిలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. బన్నీ నెక్ట్స్ సినిమాల లైనప్ చాలా వీక్‌గా ఉంది. ఇవన్నీ `పుష్ప2` రిజల్ట్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఒకవేళ `పుష్ప 2` రిజల్ట్ తేడా కొడితే ఆయనకు `నా పేరు సూర్య` తర్వాత గ్యాప్ వచ్చినట్టే మరికొంత గ్యాప్ వచ్చే అవకాశాలున్నాయని, పాన్ ఇండియా ఇమేజ్ సైతం దైలమాలో పడుతుందని అంటున్నారు నెటిజన్లు. అదే సమయంలో `నా పేరు సూర్య` తర్వాత త్రివిక్రమ్ `అల వైకుంఠపురములో` చిత్రంతో హిట్ ఇవ్వకపోయినా, బన్నీ పరిస్థితి దారుణంగా ఉండేది. `పుష్ప` ప్రాజెక్ట్ రిస్క్ లో పడేది. దీంతో కెరీర్ మరోలా ఉండేది. లక్కీ బన్నీ నెక్ట్స్ త్రివిక్రమ్‌తో చేయాలనే నిర్ణయం, దానికి తగ్గట్టుగా కథని సిద్ధం చేసుకుని త్రివిక్రమ్ అంతే బాగా తెరకెక్కించడంతో బన్నీ కెరీర్ పెద్ద మలుపు తీసుకుంది. ఇప్పుడు టాప్ గేమ్‌లో నిలిచారు.
ఈ నేపథ్యంలో నెక్ట్స్ జనరేషన్ మెగా కాంపౌండ్‌కి రాజెవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా,సస్పెన్స్ గా మారింది. మొన్నటి వరకు మెగా కాంపౌండ్‌నే కాదు, టాలీవుడ్‌ని మెగాస్టార్ చిరంజీవి శాషించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అత్యంత క్రేజీ హీరోగా నిలిచారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పాన్ ఇండియా సినిమాల హవా పెరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ని ఏలేది ఎవరనేది క్లారిటీ లేదు. టాలీవుడ్ టాప్ స్టార్‌గా ప్రభాస్ రాణిస్తున్నారు. ఆయన సినిమాలు లైనప్ చూస్తుంటే ఆయన్ని ఇప్పట్లో కొట్టే స్టార్ హీరో లేరనిపిస్తుంది.
దీంతో బన్నీ, చరణ్.. ల మధ్య పోటీ మెగా కాంపౌండ్‌కే పరిమితం అవుతుందనే అభిప్రాయం సోషల్ మీడియా ద్వారా వస్తుంది. మెగా ఫ్యామిలీలో బన్నీ, చరణ్ పాన్ ఇండియా స్టార్లుగా రాణిస్తున్న నేపథ్యంలో వీరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని, ఇటీవల వీరి అభిమానుల మధ్య జరుగుతున్న వార్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. మరి బన్నీతో పోల్చితే మంచి లైనప్ ఉన్న చరణ్.. మెగా కాంపౌండ్‌కి రాజుగా నిలబడతాడా? లేక మున్ముందు ఊహించని మార్పులేమైనా చోటు చేసుకుంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది.