MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • "పుష్ప 2 ": తెలుగు వెర్షన్ 7 రోజుల కలెక్షన్స్ (ఏరియావైజ్)

"పుష్ప 2 ": తెలుగు వెర్షన్ 7 రోజుల కలెక్షన్స్ (ఏరియావైజ్)

"పుష్ప 2: ది రూల్" బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ, ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అధిగమించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ బెల్ట్‌లో కూడా అత్యధిక వసూళ్లు రాబడుతూ, రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 13 2024, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Allu Arjun, Pushpa 2 , Box office Collections

Allu Arjun, Pushpa 2 , Box-office Collections

"పుష్ప 2: ది రూల్" బాక్సాఫీస్ దగ్గర తన జోరుని కొనసాగిస్తోంది. వీకెండ్ తర్వాత కూడా చాలా చోట్ల రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. అసలు తొలి రోజునుంచే ఈ  కలెక్షన్ల ప్రభంజన కొనసాగింది.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

ఇది ఇంతకు ముందు రికార్డు హోల్డర్ "ఆర్ఆర్ఆర్" మరియు "బాహుబలి" సినిమాలను దాటింది. ఇండియాలో రూ. 165 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి, వీటిలో తెలుగు మార్కెట్ నుంచే రూ. 85 కోట్లు సాధించింది​. ఈ క్రమంలో వారం పూర్తయ్యే సరికి పుష్ప 2 తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని చూద్దాం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
pushpa 2

pushpa 2

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన "పుష్ప 2: ది రూల్" సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తొలి భాగం "పుష్ప: ది రైజ్" విజయం తరువాత ఈ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, వాటిని అందుకుని సినిమా అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లను సాధిస్తోంది.

35


అల్లు అర్జున్  పుష్ప 2 తెలుగు వెర్షన్ 7 రోజుల ప్రపంచవ్యాప్తంగా  బాక్స్-ఆఫీస్ కలెక్షన్స్

ప్రాంతం         షేర్  
     
నైజాం    ₹ 70.5 కోట్లు     
సీడెడ్    ₹ 25.2 కోట్లు     
ఉత్తరాంధ్ర    ₹ 17.3 కోట్లు     
గుంటూరు    ₹ 12.2 కోట్లు     
తూర్పు గోదావరి ₹ 9.2 కోట్లు     
పశ్చిమ గోదావరి ₹ 7.85 కోట్లు     
కృష్ణ    ₹ 10 కోట్లు 
నెల్లూరు    ₹ 5.9 కోట్లు     
AP/TS    ₹ 158.15 కోట్లు     
ROI (సుమారు) ₹ 27 కోట్లు     
ఓవర్సీస్    ₹ 49 కోట్లు     
ప్రపంచవ్యాప్తంగా  ₹ 234.5 కోట్లు 

45


డిసెంబరు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని వెర్షన్లలోనూ దూసుకెళుతోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌ రాష్ట్రాలలో భారీ వసూళ్లు రాబడుతోంది. ఒరిజినల్ తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌లోనే అధిక కలెక్షన్లు వస్తున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో పుష్ప-2 రికార్డు మైలురాయిని అందుకోబోతోంది. రూ.1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టబోతోందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విడుదలైన వారం రోజుల్లోనే ఈ మైలురాయిని సాధించిన భారతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించడం ఖాయం.

55


ఢిల్లీలో ఏర్పాటు చేసిన థాంక్యూ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  "నేను ఎప్పుడూ చెబుతుంటాను... రికార్డులు ఉన్నది బద్దలు కొట్టడానికేనని! మరో రెండు, మూడు నెలలు పాటు నేను ఈ రికార్డులన్నింటినీ చక్కగా ఆస్వాదిస్తానేమో.

కానీ, వచ్చే వేసవిలో విడుదలయ్యే సినిమాల్లో ఏదో ఒకటి నా సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని కోరుకుంటాను. ఈ వసూళ్ల అంకెలు తాత్కాలికం మాత్రమే... కానీ అభిమానులు, ప్రేక్షకులు చూపించే ప్రేమ మాత్రం నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Recommended image2
Jananayagan Leak: మేం కోట్లు పెట్టి తీస్తే.. పైరసీ చేస్తారా? సీఎం విజయ్ సినిమా .. ముగ్గురిపై గుండా యాక్ట్
Recommended image3
Balakrishna దృష్టిలో పడితే చాలు మీ లైఫ్‌ మారిపోయినట్టే.. క్యారెక్టర్స్ చేసిన హీరో విషయంలో జరిగింది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved