11 వేలకి పైగా థియేటర్స్ లో పుష్ప 2 రిలీజ్..రికార్డు ముక్క మిగలడం కష్టమే ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పై అంతకంతకూ బజ్ పెరుగుతోంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ పూర్తి చేస్తూనే ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పై అంతకంతకూ బజ్ పెరుగుతోంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ పూర్తి చేస్తూనే ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రానికి నిర్మాతలు ఖర్చుకి వెనుకాడడం లేదు.
ప్రీరిలీజ్ బిజినెస్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా సాగుతోంది. కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే 600 కోట్ల వరకు ఉందని టాక్. ఇంత మొత్తం రిటర్న్ రావాలంటే మాసివ్ ఓపెనింగ్ కంపల్సరీ. నిర్మాతలు ఆ దిశగానే ప్లాన్ చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ లో పుష్ప 2 చిత్రాన్ని రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ కూడా అంతే భారీగా ఉంటాయి.
పుష్ప 2 చిత్రాన్ని ఏకంగా వరల్డ్ వైడ్ 11500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 6500 స్క్రీన్స్ ఇండియాలో కాగా మిగిలిన 5 వేల స్క్రీన్స్ ఓవర్సీస్ లో. రిలీజ్ కి ఇంకా నెల పైనే టైం ఉంది. రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ ఇంకొన్ని స్క్రీన్లు యాడ్ కావచ్చు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మిడ్ నైట్ షోలకు ఆల్మోస్ట్ అనుమతులు లభించినట్లే అని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వాలు మిడ్ నైట్ షోలకు అనుమతులు ఇస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే మిడ్ నైట్ షోలు రికార్డు స్థాయిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దేవర చిత్రం ఓపెనింగ్స్ లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 చిత్రానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రికార్డులు ఇంకా భారీగా ఉంటాయని, పలు రికార్డ్స్ ని బన్నీ మూవీ బ్రేక్ చేయబోతోందని అంచనాలు వినిపిస్తున్నాయి.