MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్‌ తగ్గనంటున్నాడు.. ఇక తగ్గాల్సింది ఎన్టీఆరే.. `దేవర` వచ్చేది అప్పుడేనా?

అల్లు అర్జున్‌ తగ్గనంటున్నాడు.. ఇక తగ్గాల్సింది ఎన్టీఆరే.. `దేవర` వచ్చేది అప్పుడేనా?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ మధ్య మంచి స్నేహం ఉంది. బావ బావ అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు బన్నీపై తారక్‌ పెట్టుకున్న ఆశలు బెడిసి కొట్టేలా ఉన్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 27 2024, 10:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సినిమాలకు రిలీజ్‌ డేట్‌ అనేది పెద్ద మ్యాటర్‌ అయిపోయింది. దీనికోసం పెద్ద రచ్చే నడుస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాకి క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. `దేవర` రిలీజ్‌ డేట్‌ విషయంలో సరికొత్త కన్‌ప్యూజన్‌ నెలకొంది. ఎప్పుడు రిలీజ్‌ చేయాలనేది మేకర్స్ కి తలనొప్పిగా ఉంది. ఓ క్లారిటీ లేక కన్‌ఫ్యూజన్ లో ఉండిపోయారు. ఇది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని ఆందోళన కలిగిస్తుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. `ఆచార్య` వంటి డిజాస్టర్‌ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న మూవీ ఇది. ఆ సినిమా నిరాశ పరచిన నేపథ్యంలో ఇప్పుడు `దేవర`తో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే తపనతో చేస్తున్నారు. ఓ కసిగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అదే సమయంలో భారీ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. చాలా లావిష్‌గా తీస్తున్నారు. ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్లు కూడా ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. 
 

36

ఇదిలా ఉంటే సినిమాని ప్రారంభించే సమయంలోనే `దేవర`ని ఈ ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేస్తామని టీమ్‌ ప్రకటించింది. ఆ టార్గెట్‌తోనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. సినిమా చాలా వరకు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పుడు సడెన్‌గా ఈ మూవీ వాయిదా పడుతుందంటూ వార్తలు ప్రారంభమయ్యాయి. గత నాలుగైదు రోజులుగా ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొత్త డేట్ లాక్‌ అయినట్టుగా ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదట. 

46

`పుష్ప2` సినిమా వాయిదా పడుతుందని, దీంతో ఆగస్ట్ 15న `దేవర`ని రిలీజ్‌ చేయాలని భావించారట. కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం మేరకు `పుష్ప2` వాయిదా పడటం లేదని సమాచారం. సుకుమార్‌ ఈ మూవీని అనుకున్న టైమ్‌కే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. తాజాగా టీమ్‌ నుంచి ఈ విషయం క్లారిటీ వచ్చింది. `ఆగస్ట్ 15న తాము సినిమాని లాక్‌ చేశాం` అని టీమ్‌ నుంచి అందిన సమాచారం. దీంతో `దేవర`కి మరింత బ్యాక్‌ వెళ్లాల్సిన పరిస్థితి. 
 

56

అల్లు అర్జున్‌ తగ్గితే ఇండిపెండెంట్‌ డేని ఎన్టీఆర్‌ టార్గెట్‌ చేశాడు. కానీ ఇప్పుడు తగ్గకపోవడంతో ఎన్టీఆర్‌ తగ్గాల్సి వస్తుంది. ఈ సినిమాని సెప్టెంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనకు టీమ్‌ వెళ్లిందని సమాచారం. సెప్టెంబర్‌లో `గేమ్‌ ఛేంజర్‌` ఉంది. దీంతో  దసరాని టార్గెట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 
 

66

ఇక `దేవర` ఆలస్యానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. టీమ్‌ నుంచి అందే సమాచారం మేరకు ఇది వీఎఫ్‌ఎక్స్ డిలే అవుతుందని, అందుకే వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏప్రిల్‌లో పార్లమెంట్‌ ఎలక్షన్లు ఉంటాయి. అలాగే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. అది సినిమాపై చాలా ప్రభావం చూపిస్తుంది. దీంతో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమాని వాయిదా వేస్తున్నట్టు టాక్‌. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న `దేవర`లో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Recommended image2
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image3
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved