MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • నీ యవ్వా తగ్గేదేలే... మెగా హీరోలతో సమరానికి కాలు దువ్వుతున్న అల్లు అర్జున్!

నీ యవ్వా తగ్గేదేలే... మెగా హీరోలతో సమరానికి కాలు దువ్వుతున్న అల్లు అర్జున్!

అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో సంధి చేసుకుంటాడని పలువురు భావిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ కి అలాంటి ఆలోచన లేదట. తన సినిమాకు ఎంత నష్టం జరిగినా పర్లేదు. వారితో కాంప్రమైజ్ అయ్యేది లేదని ఫిక్స్ అయ్యాడట.   

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 14 2024, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Allu Arjun

Allu Arjun


అల్లు అర్జున్ మెగా హీరోలకు దూరమయ్యాడు. చిరంజీవి-అల్లు అరవింద్ కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన చాలా కాలంగా ఉంది. గతంలో ఈ విమర్శలను అల్లు అరవింద్, చిరంజీవి ఖండించారు. అల్లు అర్జున్ మాత్రం మెగా హీరో అనే ట్యాగ్ వద్దనుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Allu Arjun

Allu Arjun

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన పరిణామం మరింత చిచ్చు రాజేసింది. కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేసిన అల్లు అర్జున్... నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవి చంద్రారెడ్డి ఇంటికి నేరుగా వెళ్లి మద్దతు తెలిపాడు. ఇది మెగా ఫ్యామిలీకి అసలు నచ్చలేదు. పరోక్షంగా వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించినట్లు అయ్యింది. 
 

36
Allu Arjun-Nagababu

Allu Arjun-Nagababu

పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు సోషల్ మీడియాలో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. అల్లు అర్జున్ ని ఉద్దేశించే నాగబాబు ఆ కామెంట్స్ చేశాడని ఫ్యాన్స్ భావించారు. నాగబాబును ట్రోల్ చేశారు. ఆయన కొన్నాళ్ళు ట్విట్టర్ అకౌంట్ కి దూరమయ్యాడు.

46
Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ ని సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. అల్లు అర్జున్ అంటే మెగా హీరోలు, కుటుంబ సభ్యులు నచ్చనట్లే ఉంటున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ అటాక్ చేశాడు. కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్... పుష్ప చిత్రంపై పరోక్ష విమర్శలు చేశాడు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రల్లో నటించేవారు. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశాడు. 
 

56

ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ పై మెగా హీరోలు కత్తి కట్టారని అర్థం అవుతుంది. ఇది పుష్ప 2 పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు భయపడుతున్నాయి. దాంతో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో సంధి చేసుకుంటాడని పలువురు భావిస్తున్నారు. 


 

66

అయితే అల్లు అర్జున్ కి అలాంటి ఆలోచన లేదట. తన సినిమాకు ఎంత నష్టం జరిగినా పర్లేదు. వారితో కాంప్రమైజ్ అయ్యేది లేదని ఫిక్స్ అయ్యాడట. పైగా తనకున్న ఇమేజ్, ఫేమ్ రీత్యా ఎంత దుష్ప్రచారం చేసినా సినిమాను ఆపలేరు అనేది ఆయన ఆలోచన అట. అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధం అంటున్నాడట. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved