MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shalini Remuneration: షాలిని బిగ్‌ బాస్‌ తెలుగు 10 పారితోషికం.. రెండు వారాల దక్షికి, షాలినికి సేమా?

Shalini Remuneration: షాలిని బిగ్‌ బాస్‌ తెలుగు 10 పారితోషికం.. రెండు వారాల దక్షికి, షాలినికి సేమా?

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగింది. చివర్లో ఎలిమినేట్‌ అయిన షాలిని కామనర్‌గా హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. మరి ఆమె ఎంత పారితోషికం తీసుకుందనేది చూస్తే..

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 26 2026, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
షాలిని బిగ్‌ బాస్‌ పారితోషికం
Image Credit : X/@Srtarmaa

షాలిని బిగ్‌ బాస్‌ పారితోషికం

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌లో ఏడో వారం డబుల్ ఎలిమినేషన్‌ చోటు చేసుకుంది. ఆడియెన్స్ ఓటింగ్‌ ద్వారా దక్షి ఎలిమినేట్‌ అయ్యింది. ఇక రెడ్‌ జోన్‌లో ఉన్న వారిలో ఒకరిని హోస్ట్ నాగార్జున ఎలిమినేట్‌ చేశారు. హౌజ్‌ మేట్స్ ఓటింగ్‌తో షాలినిని ఎలిమినేట్‌ చేశారు. అయితే షాలిని ఎలిమినేషన్‌తో పాటు ఆమెకు అందిన పారితోషికం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏడు వారాల పాటు హౌస్‌లో కొనసాగిన ఆమె ఎంత సంపాదించిందనే చర్చ బుల్లితెర ప్రేక్షకుల్లో మొదలైంది. రెండు వారాలు ఉన్న దక్షికి, ఏడు వారాలు ఉన్న షాలినికి పారితోషికం సేమ్‌ కావడం ఆశ్చర్యపరుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వారానికి రూ.75 వేల పారితోషికం?
Image Credit : Asianet News

వారానికి రూ.75 వేల పారితోషికం?

షాలిని కామనర్‌గా హౌజ్‌లోకి వచ్చింది. అగ్నిపరీక్ష ద్వారా ఆమె ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. షాలినికి బిగ్ బాస్ తెలుగు 10లో వారానికి సుమారు రూ.75 వేల పారితోషికం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె ఏడు వారాల పాటు హౌస్‌లో కొనసాగినందుకు సుమారు రూ.5.25 లక్షలు అందుకున్నట్లు సమాచారం. రెండు వారాలు ఉన్న దక్షి పారితోషికం ఐదు లక్షలు కావడం విశేషం. ఇలా ఇద్దరికీ సేమ్‌ దక్కింది.

34
సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినా మారని ఆటతీరు
Image Credit : youtube/@starmaa

సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినా మారని ఆటతీరు

షాలిని బిగ్ బాస్ ప్రయాణం సాధారణంగా సాగలేదు. ఆరో వారం ఎలిమినేషన్ సమయంలో ఆమెను నేరుగా ఇంటి నుంచి బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌కు పంపించారు నాగార్జున. దీంతో తానేంటో నిరూపించుకునేందుకు ఆమెకి మరో అవకాశం ఇచ్చారు. సీక్రెట్ రూమ్‌లో ఉండి ఇతర కంటెస్టెంట్ల ఆటతీరును గమనించిన ఆమె తిరిగి హౌస్‌లోకి అడుగుపెట్టింది. రీ ఎంట్రీతో తన ఆటను మార్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చాలామంది భావించారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో ఆశించిన మార్పు కనిపించలేదు. గొడవ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించింది. దీనికితోడు రెడ్‌ జోన్‌ లో ఉంది. దీంతో బిగ్‌ బాస్‌ కావాలని ప్లాన్‌ చేసి ఆమెని ఇంటికి పంపించారు. అయితే హౌజ్‌ మేట్సే ఆమె ఎలిమినేట్‌ కావాలని కోరుకోవడం గమనార్హం.

44
రోహిత్‌తో ట్రాక్.. ప్లస్ అయిందా? మైనస్ అయిందా?
Image Credit : youtube@starmaa

రోహిత్‌తో ట్రాక్.. ప్లస్ అయిందా? మైనస్ అయిందా?

హౌస్‌లో షాలిని, రోహిత్ మధ్య సాగిన పరిచయం, వారి మధ్య కనిపించిన సాన్నిహిత్యం కూడా చర్చనీయాంశమయ్యాయి. కొంతమంది ప్రేక్షకులు ఈ జోడీని ఇష్టపడగా, మరికొందరు షాలిని తన వ్యక్తిగత గేమ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టలేదని విమర్శించారు. టాస్కుల్లో తన ప్రతిభను నిరూపించుకోవడం, బలమైన వ్యూహాలతో ముందుకు వెళ్లడం వంటి అంశాల్లో ఆమె మరింత మెరుగ్గా ఆడాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
దసరాకు మొదలైన రజనీ, విజయ్ - రష్మికల సందడి.. దీపావళి వరకు తగ్గేదే లే..
Recommended image2
Dakkshi Remuneration: వచ్చిన రెండు వారాల్లోనే ఎలిమినేట్‌ అయిన దక్షికి దక్కే పారితోషికం ఎంతంటే?
Recommended image3
AI Movie : రూ.12 కోట్ల బడ్జెట్.. రూ.8 లక్షల కలెక్షన్.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన తొలి ఏఐ సినిమా
Related Stories
Recommended image1
Bigg Boss 10: ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌, దక్షితోపాటు షాలిని ఎలిమినేట్‌.. కారణం ఇదే
Recommended image2
Jayasudha-Jayaprada: జయప్రద అంటే జయసుధకి ఎందుకంత కోపం.. మొహం మీదే కారణం చెప్పిన సహజనటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved