MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శోభన్ బాబు తర్వాత టాలీవుడ్ అందగాడు ఎవరో తెలుసా? 11 భాషల్లో 1000కి పైగా సినిమాలు చేసిన హీరో ఎవరు?

శోభన్ బాబు తర్వాత టాలీవుడ్ అందగాడు ఎవరో తెలుసా? 11 భాషల్లో 1000కి పైగా సినిమాలు చేసిన హీరో ఎవరు?

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందగాడు సోగ్గాడు లాంటి బిరుదులు ఉన్న ఏకైక హీరో శోభన్ బాబు మాత్రమే. ఆయన తర్వాత ఆ ఇమేజ్ టాలీవుడ్ లో ఒకే ఒక్క హీరోకి దక్కింది. అంతే కాదు లేడీ ఫ్యాన్స్ కూడా శోభన్ బాబుతో సమానంగా ఆ హీరోకి దక్కారు. ఇంతకీ ఎవరా హీరో?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 26 2026, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలీవుడ్ అందగాడు..
Image Credit : Asianet News

టాలీవుడ్ అందగాడు..

టాలీవుడ్ మొదటి తరం హీరోలలో హ్యాండ్సమ్ ఎవరంటే ముందుగా శోభన్ బాబు పేరే వినిపించేది. ఆయన గ్లామర్ ఎలా ఉండేదంటే.. 'సోగ్గాడు', 'అందగాడు' అందాల నటుడు, అని ఆయన్ను ముద్దుగా పిలుచుకునేవారు. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. హీరోయిన్లు కూడా శోభన్ బాబుతో సినిమా అంటే ఎగిరి గతంతేసేవారు. ఇక లేడీ ఫ్యాన్స్ ఆకాలంలోనే ఎలా ఉండేవారంటే? ఒకసారి అవుట్‌డోర్ షూటింగ్‌లో ఒక మహిళ సడెన్‌గా వచ్చి ఆయనకు ముద్దు పెట్టేసిందట. మరి శోభన్ బాబు తర్వాత అంత లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు? అంత అందంగా ఉన్నది ఎవరో తెలుసా. ఆ హీరో ఎవరో కాదు సుమన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శోభన్ బాబు తర్వాత అంతటి అందగాడు..
Image Credit : Youtube/ Telugu Full Screen

శోభన్ బాబు తర్వాత అంతటి అందగాడు..

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. కెరీర్ బిగినింగ్ లో సుమన్ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. హైట్, పర్సనాలిటీతో పాటు కలర్ కూడా సుమన్ కు కలిసొచ్చింది. అంతే కాదు కరాటే నేర్చుకుని ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బాగా చేసేవారు. సుమన్ పక్కన ఏ హీరోయిన్ అయినా బాగుండేది. ఆయన అందంతో పాటు నటన కూడా అందరిని ఆకట్టుకునేది. టాలీవుడ్ లో స్టార్ హీరో అవుతాడు అన్న నమ్మకం అందరికి ఉండేది. కానీ సుమన్ లైఫ్ లో జరిగిన కొన్ని విషాదాలు.. ఆయన కెరీర్ పై దబ్బ పడేలా చేశాయి. దాంతో అవకాశాలు తగ్గి సుమన్ స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఇక తన పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్న సుమన్.. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి, నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

34
లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ..
Image Credit : our own

లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ..

అప్పట్లో టాలీవుడ్‌లో శోభన్ బాబు తర్వాత అంత భారీ స్థాయిలో మహిళా అభిమానులను (లేడీ ఫ్యాన్స్) సంపాదించుకున్న నటుడు తనేనని సుమన్ స్పష్టం చేశారు. శోభన్ బాబు అందం, అభినయం చూసేందుకు ఎంతోమంది మహిళా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారని, ఆ తర్వాత ఆ స్థాయి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తనకు దక్కిందని సుమన్ తెలిపారు. ఆ కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కేవలం సినిమాలు మాత్రమే అని.. కుటుంబమంతా కలిసి వచ్చి చూసేలా తన సినిమాలు ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. తన సినిమాల్లో ఎలాంటి అసభ్యకరమైన డబుల్ మీనింగ్ డైలాగులు, కుల మతాలకు సంబంధించిన రెచ్చగొట్టే సన్నివేశాలు లేకుండా జాగ్రత్తపడ్డానని, కుటుంబ విలువలకు పెద్దపీట వేయడం వల్లే తన చిత్రాలు కనీసం నాలుగు వారాలు విజయవంతంగా ఆడేవని ఆయన వివరించారు.

44
11 భాషల్లో 1000 కి పైగా సినిమాలు..
Image Credit : our own

11 భాషల్లో 1000 కి పైగా సినిమాలు..

ఇక తన సినీ కెరీర్‌లో 11 భాషల్లో వెయ్యికి పైగా సినిమాలలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు సుమన్ అన్నారు. అయితే తనను తాను ఎప్పుడూ 'గ్రేట్' అని గొప్పగా చెప్పుకోనని, ఒక మనిషి గొప్పో కాదో అతను జీవించి ఉన్నంతవరకు చెప్పలేమని, మరణానంతరం ప్రజల మదిలో నిలిచే స్థానాన్ని బట్టే అది ఆధారపడి ఉంటుందని ఆయన ఎంతో లోతైన తత్వాన్ని వ్యక్తపరిచారు. జీవితం అనేది గడియారం ముళ్ల లాంటిదని, ఎవరి జీవితంలోనైనా ఎత్తుపల్లాలు సర్వసాధారణమని సుమన్ తన సుదీర్ఘ అనుభవంతో వివరించారు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదని, కాలం ఎవరిని ఎప్పుడు ఏ స్థానంలో నిలబెడుతుందో ఎవరూ చెప్పలేరని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి తాను సాధించిన విజయాలు, దేవుడు ఇచ్చిన జీవితం పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంటానని, నటుడిగా తాను పొందిన ఆదరమే తన అసలైన సంపదని సుమన్ వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
శోభన్ బాబు
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 11 Days Collections: సండే రోజు `జైలర్‌ 2` ఊహించని జంప్‌.. రజనీకాంత్‌ మూవీకి రికార్డ్ కలెక్షన్లు
Recommended image2
Shalini Remuneration: షాలిని బిగ్‌ బాస్‌ తెలుగు 10 పారితోషికం.. రెండు వారాల దక్షికి, షాలినికి సేమా?
Recommended image3
దసరాకు మొదలైన రజనీ, విజయ్ - రష్మికల సందడి.. దీపావళి వరకు తగ్గేదే లే..
Related Stories
Recommended image1
Gandhi: కరెన్సీ నోటుపై ఉండే గాంధీ ఫోటోను ఎవరు, ఎప్పుడు తీశారో తెలుసా?
Recommended image2
ANR: సావిత్రితో నటించడానికి నో చెప్పిన ఏఎన్నార్.. ఎన్టీఆర్ మహానటి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved