స్టయిలీష్ స్టార్ తెగ సందడి చేస్తున్నాడుగా!
టాలీవుడ్ స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. అభిమానులకు సంబరంగానే ఉంటుంది. ఆయన కనిపిస్తే చాలు అభిమానులకు రిథమ్ వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త గెటప్స్ లో, కొత్త కాస్ట్యూమ్స్ తో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. నిజం చెప్పాలంటే ట్రెండ్ సెట్ చేస్తుంటాడు.
ఇటీవల అల్లు అర్జున్ కొత్త కొత్త లుక్‌లో దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా తన కొత్త లుక్‌లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్విట్టర్ ద్వారా బన్నీ రెండు ఫోటోలను పంచుకున్నారు. రెడ్ టీషర్ట్ తో కనిపిస్తూ తన ఆఫీస్ వద్ద సందడి చేశాడు. అందులో ఒకటి బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది.
అయితే చాలా రోజుల తర్వాత తన ప్రొడక్షన్ ఆఫీస్ గీతా ఆర్ట్స్ కి బన్నీ వెళ్ళారు. ఈ సందర్భంగా ఫోటోలకు పోజులిచ్చారు. `చాలా కాలం తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్ళాను. అక్కడ ఎలాంటి హరీబరీ లేదు. కరోనా వల్ల ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు త్వరలోనే అంతం కావాలి` అని తెలిపారు. అదేసమయంలో అందరు సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే బన్నీఇటీవల కొత్త కొత్త లుక్‌లో కనిపిస్తూ అలరిస్తున్నారు. ఈ మధ్య నిహారిక ఎంగేజ్మెంట్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి పాల్గొని సందడి చేశాడు. ఇంకా చెప్పాలంటే ఎంగేజ్మెంట్లో తనే హైలైట్ అయ్యాడు.
అంతకు ముందు రానా మ్యారేజ్ ఈవెంట్లోనూ డిఫెరెంట్ లుక్‌లో ఆకట్టుకున్నారు. లాల్చీ టైప్ ఫిట్ డ్రెస్‌తో అబ్బుర పరిచాడు.
అంతేకాదు గతంలో టీషర్ట్ గెడ్డం పెంచి కనిపించి తన కొత్త సినిమా `పుష్ప`లో లుక్ ఇదే అని రివీల్ చేశాడు. ఆ ఫోటోలు సైతం అప్పట్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం బన్నీ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు కొరటాల శివ డైరెక్షన్లో మరో సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే.