- Home
- Entertainment
- తాను సూపర్ స్టార్ గా సక్సెస్ కావడానికి కారణం చెప్పిన అల్లు అర్జున్.. బన్నీకి ఇగో ఉందా ?
తాను సూపర్ స్టార్ గా సక్సెస్ కావడానికి కారణం చెప్పిన అల్లు అర్జున్.. బన్నీకి ఇగో ఉందా ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ లో సూపర్ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే.

Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ లో సూపర్ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. పుష్ప మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లకిపైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
పుష్ప 2లో ఒక డైలాగ్ ఉంది.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. కాదు.. ఇంటర్నేషనల్ అని. ఇప్పుడు అల్లు అర్జున్ క్రేజ్ నిజంగానే అంతర్జాతీయ స్థాయికి వెళుతోంది. అమెరికాలోని ప్రముఖ సినీ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో ప్రచురించబడింది. ఆ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అనేక విషయాలు పంచుకున్నారు.
Pushpa 2 The Rule
అల్లు అర్జున్ తనకి ఇగో లేదనే విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంత స్టార్ డమ్ సాధించినప్పటికీ నాకు ఇగో లేదు. ఎందుకంటే నేను స్టార్ స్టేటస్ ని సీరియస్ గా తీసుకోను అని అల్లు అర్జున్ తెలిపారు. ఇదే ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ సంఘటన గురించి కూడా విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అదే విధంగా తన సక్సెస్ కి ముఖ్య కారణాన్ని కూడా అల్లు అర్జున్ రివీల్ చేశారు. నేను నా చిత్రాన్ని సాధారణ ప్రేక్షకుడిలా చూస్తాను. అందువల్ల సినిమాలో, నాలో నెగిటివ్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. నా సక్సెస్ సీక్రెట్ అదే అని అల్లు అర్జున్ తెలిపారు. సినిమాల్లో ఎంత పెద్ద సక్సెస్ సాధించినా రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉంటానని బన్నీ తెలిపారు.
షూటింగ్ లేని సమయాల్లో ఖాళీగా ఉంటాను. ఎలాంటి పని చేయను. అదే నాకు విశ్రాంతి అని బన్నీ తెలిపారు. గర్వానికి నా మనసులో చోటు లేదు. ఈ అలవాటు నాకు పుట్టుకతో వచ్చింది అని అల్లు అర్జున్ తెలిపారు.