- Home
- Entertainment
- రాంచరణ్ సినిమాని వెనక్కి నెట్టాలనుకోవడం తప్పు..ఆయనపై డైరెక్ట్ అటాక్ కి దిగిన అల్లు అర్జున్, అసలేం జరిగింది ?
రాంచరణ్ సినిమాని వెనక్కి నెట్టాలనుకోవడం తప్పు..ఆయనపై డైరెక్ట్ అటాక్ కి దిగిన అల్లు అర్జున్, అసలేం జరిగింది ?
Allu Arjun and Ram Charan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు గతంలో చాలా సార్లు వైరల్ అయ్యాయి. కొన్నిసార్లు వివాదానికి దారితీశాయి. టాలీవుడ్ లో థియేటర్ల సమస్య అప్పుడప్పుడూ తలెత్తుతూ ఉంటుంది. పెద్ద చిత్రాలు ఒకేసారి రెండు మూడు రిలీజ్ అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది.

Ram Charan, Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు గతంలో చాలా సార్లు వైరల్ అయ్యాయి. కొన్నిసార్లు వివాదానికి దారితీశాయి. టాలీవుడ్ లో థియేటర్ల సమస్య అప్పుడప్పుడూ తలెత్తుతూ ఉంటుంది. పెద్ద చిత్రాలు ఒకేసారి రెండు మూడు రిలీజ్ అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఈ సమస్యపై గతంలో లెజెండ్రీ డైరెక్టర్ దాసరి నారాయణరావు చాలాసార్లు మాట్లాడారు.
Ram Charan
ఒకేసారి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఇండస్ట్రీకి నష్టం అని దాసరి తెలిపారు. అయితే 2015లో రాంచరణ్ నటించిన బ్రూస్ లీ, అనుష్క నటించిన రుద్రమదేవి చిత్రాల మధ్య వివాదం నెలకొంది. రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
బ్రూస్ లీ, రుద్రమ దేవి చిత్రాలు కేవలం వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. రుద్రమదేవి చిత్రం 2015 అక్టోబర్ 9న రిలీజ్ కాగా,, బ్రూస్ లీ చిత్రం అక్టోబర్ 16న రిలీజ్ అయింది. దీనితో రుద్రమ దేవి చిత్రం చాలా థియేటర్లు కోల్పోవలసి వచ్చింది. రుద్రమదేవి చిత్రం బాగా ఆడుతున్న సమయంలో బ్రూస్ లీ చిత్రాన్ని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని దాసరి అన్నారు. మరో వారం ఆలస్యంగా బ్రూస్ లీ వచ్చి ఉంటే రుద్రమదేవి చిత్రానికి మంచి వసూళ్లు వచ్చేవి అని తెలిపారు. స్టార్ హీరోల చిత్రాలకు పండుగలు అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ. చేతకాని వాళ్ళు మాత్రమే తమ చిత్రాలని పండుగలకు రిలీజ్ చేద్దాం అనుకుంటారు అంటూ దాసరి విమర్శలతో విరుచుకుపడ్డారు.
దీనితో అల్లు అర్జున్ డైరెక్ట్ గా దాసరికి కౌంటర్ ఇచ్చారు. రాంచరణ్ చిత్రాన్ని వెనక్కి నెట్టాలనుకోవడం తప్పు అని తెలిపారు. ఎందుకంటే మూడు నెలల ముందే బ్రూస్ లీ రిలీజ్ డేట్ ప్రకటించారు. రుద్రమ దేవి చిత్రం సెప్టెంబర్ లోనే రిలీజ్ కావలసింది. కానీ వాయిదా పడింది. అందువల్లే బ్రూస్ లీ చిత్రంతో అనుకోకుండా క్లాష్ ఏర్పడింది. ఎవరిదీ తప్పు లేదు. కాబట్టి బ్రూస్ లీ చిత్రాన్ని ఆలస్యం రిలీజ్ చేయాలని చెప్పడం భావ్యం కాదని అల్లు అర్జున్ అన్నారు.