- Home
- Entertainment
- అల్లు అర్జున్ ని అవమానించిన స్టార్ డైరెక్టర్..కసితో కొడితే 23 ఏళ్లలో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా బన్నీ
అల్లు అర్జున్ ని అవమానించిన స్టార్ డైరెక్టర్..కసితో కొడితే 23 ఏళ్లలో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా బన్నీ
అల్లు అర్జున్ తన తొలి చిత్రానికి సిద్ధమవుతున్న సమయంలో ఓ స్టార్ డైరెక్టర్ నుంచి అవమానం ఎదుర్కొన్నాడు. బన్నీతో చేయాల్సిన చిత్రాన్ని ఆ డైరెక్టర్ మరో హీరోతో చేశాడు. ఇంతకీ ఆ మూవీ ఏంటి. ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గంగోత్రితో బన్నీ ఎంట్రీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ గంగోత్రి చిత్రంతో జరిగింది. తొలి చిత్రంతోనే అల్లు అర్జున్ హిట్టు కొట్టి ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించాడు. బన్నీ వెనుక అల్లు అరవింద్, చిరంజీవి లాంటి భారీ బ్యాగ్రౌండ్ ఉండడంతో మంచి పబ్లిసిటీ లభించింది. అయితే లుక్స్ విషయంలో బన్నీ బిగినింగ్ లో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ త్వరగానే తన లుక్స్ సరిచేసుకుని స్టైలిష్ స్టార్ గా మారాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ కొడుకు అయినప్పటికీ బన్నీకి తొలి చిత్రం అంత ఈజీగా దక్కలేదు.
KNOW
ఆ మూవీలో బన్నీ నటించాల్సింది
ఓ స్టార్ డైరెక్టర్ దగ్గర బన్నీ అవమానాలు ఎదుర్కొన్నాడు. బన్నీ నటించాల్సిన తొలి చిత్రం గంగోత్రి కాదట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పట్లో డైరెక్టర్ తేజ టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉన్నారు. కొత్త కుర్రాళ్ళని పరిచయం చేయడంలో ఆయన స్పెషలిస్ట్. జయం చిత్రాన్ని డైరెక్టర్ తేజ ముందుగా బన్నీతో చేయాలని అనుకున్నారు. బన్నీ, తేజ కాంబినేషన్ లో చిత్రానికి అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.
సడెన్ గా హీరోని మార్చేసిన డైరెక్టర్
తేజ దర్శకత్వంలో బన్నీ తొలి చిత్రంలో నటిస్తున్నాడని తెలియడంతో అందరం కంగ్రాట్స్ చెప్పాం. బన్నీ తొలి చిత్రం కన్ఫర్మ్ కావడంతో అశ్వినీ దత్ ఆఫీస్ లో చిన్న పార్టీ కూడా జరిగింది. కానీ సడెన్ గా ఒక రోజు పేపర్ లో తేజ తదుపరి చిత్రం నితిన్ అనే కుర్రాడితో చేయబోతున్నట్లు వార్త వచ్చింది అని చిన్ని కృష్ణ తెలిపారు. ఆ వార్త చూసి అందరం షాక్ కి గురయ్యాం. అల్లు అర్జున్ ని ఆ చిత్రం నుంచి ఎందుకు తప్పించారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అంటూ చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్ కి అవమానం
అయితే బన్నీని జయం చిత్రం నుంచి తప్పించడానికి గల కారణాలని మాత్రం ఓపెన్ గా చెప్పలేదు. తనతో సినిమా చేస్తానని చెప్పి మరో హీరోని తీసుకోవడంతో అల్లు అర్జున్ అవమానంగా భావించాడు. చాలా బాధపడ్డాడు. బన్నీ ప్లేస్ లో ఎవరున్నా బాధపడడం సహజం. డైరెక్టర్ తేజ అలా చేయడంతో నేను కూడా హర్ట్ అయ్యాను. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది అని చిన్ని కృష్ణ తెలిపారు.
కసితో వర్క్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా బన్నీ
అదే సమయంలో రాఘవేంద్ర రావు గారు 100వ చిత్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేను వెంటనే అల్లు అరవింద్ గారికి మాట ఇచ్చా.. మీ అబ్బాయి 365 రోజుల లోపు టాలీవుడ్ లో హీరోగా నిలబడతాడు అని చెప్పా. అప్పుడే గంగోత్రి కథ సిద్ధం చేసినట్లు చిన్ని కృష్ణ తెలిపారు. గంగోత్రి మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. కొన్ని ఏరియాల్లో గంగోత్రి చిత్రం ఇంద్ర వసూళ్ళని కూడా అధికమించినట్లు చిన్ని కృష్ణ తెలిపారు. ఆ రోజు అవమానానికి గురైన అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ సింహాసనంపై తిరుగులేని చక్రవర్తి అని చెప్పొచ్చు. జయం మూవీ మిస్ అయ్యాక కసితో వర్క్ చేసిన బన్నీ 23 ఏళ్ళు తిరిగేసరికి పుష్ప 2 చిత్రంతో ఇండియాలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ సాధించి తిరుగులేని హీరో అయ్యాడు.