MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భార్య బర్త్ డే కి సర్ ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్, రెండు కోట్లు ఖర్చు పెట్టి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా...?

భార్య బర్త్ డే కి సర్ ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్, రెండు కోట్లు ఖర్చు పెట్టి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా...?

భార్యల మీద ప్రేమతో చాలా చేస్తుంటారు భర్తలు. కాస్ట్లీ గిఫ్ట్ లతో కలరింగ్ ఇస్తుంటారు. కాని కళ్ళు తిరిగే కాస్ట్ తో సర్ ప్రైజ్ ఇవ్వడంతో తనకు తానే సాటి అనిపించుకన్నాడు అల్లు అర్జున్. తన భార్య స్నేహారెడ్డికి అదరిగిపోయే గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 30 2022, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో ఎదిగిపోయాడు. ఇక ఆయన ఎంత ఎదిగినా.. ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి పక్కాగా టైమ్ కేటాయిస్తాడు. తన భార్య .. పిల్లలతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. ఫారెన్ టూర్లకు వెళ్తూ.. హడావిడి చేస్తుంటాడు. ముఖ్యంగా తను గాఢంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న తన భార్య స్నేహా రెడ్డి అంటే బన్నీకిప్రాణం. 

27

బన్నీ పిల్లలతో బాగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. ఆ వీడియోలను స్నేహా రెడ్డి తన ఇన్ స్టా పేజ్ లో అప్ లోడ్ చేస్తుంటుంది. సోషల్ మీడియా ద్వారా స్నేహా రెడ్డి కూడా అందరికి పరిచయం అయ్యింది. ఇక బన్నీ తో టైమ్ స్పెండ్ చేసిన పిక్స్ కూడా ఆమె ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. 

37

ఇక ఇది ఇలా ఉంటే.. స్నేహ రెడ్డి పుట్టినరోజు  సందర్భంగా అల్లు అర్జున్ జీవితంలో మర్చిపోలేని విధంగా విషెష్  తెలిపారట.హ్యాపీ బర్త డే మై క్యూటీ అంటూ చాలా రొమాంటిక్ గా చాలా స్పెషల్ గా బర్త డే విషెస్ అందించి సర్ప్రైజ్ చేశాడట అల్లు అర్జున్. కాగా అర్ధరాత్రి 12 గంటలకు స్నేహ రెడ్డికి అదరిపోయేలా.. సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడట. తన భార్యకు ఇష్టమైన డైమండ్ రింగ్ ను బన్నీ ప్రజెంట్ చేశారట దీని కాస్ట్ రెండు కోట్లు పైనే..  ఉంటుందని అంచనా

47

దీంతో అల్లు అర్జున్ అభిమానులు షాక్ అవుతున్నారు. భార్య పుట్టినరోజు కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టావా అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.. రెండు నిమిషాలు ఆనందం కోసం రెండు కోట్లా.. నువ్వు గ్రేట్ బన్నీ నీలాంటి భర్త అందరికీ దొరకాలి అంటూ అమ్మాయిలు కామెంట్ చేస్తున్నారు. దీంతో స్నేహ రెడ్డి అల్లు అర్జున్ పేర్లు సోషల్ మీడియాలో రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి.

57
Allu Arjun Golden temple

Allu Arjun Golden temple

అలాగే స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో పాటు అమృత్ సర్ వెళ్లారు. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణ దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.  చాలా నిరాడంబరంగా.. సింపుల్ గా.. దర్శనం చేసుకున్నారు అల్లు దంపతులు అల్లు అర్జున్ స్వర్ణ దేవాలయం సందర్శనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

67

ఇక  స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2011 మార్చ్ లో వీరి వివాహం జరిగింది. 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. స్టార్ హీరో వైఫ్ అయిన స్నేహారెడ్డి ఆ గ్లామర్ మైంటైన్ చేస్తారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని అందంతో.. స్నేహారెడ్డి అప్పుడప్పడూ ఫోటో షూట్స్ చేస్తారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది స్నేహా రెడ్డి. 

77

ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. అంతే కాదు  తన తాత జ్ఞాపకార్థం కట్టించిన అల్లు స్టూడియోస్ ను ఓపెనింగ్ చేయబో్తున్నారు. ఈ స్టూడియోలోనే పుష్ప పార్ట్ 2 షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారు టీమ్. స్టూడియో ఓపెనింగ్ రోజే.. మూవీ ఓపెనింగ్ చేసి.. ఓ పది రోజులు తరువాత రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్  చేయాలని చూస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved