- Home
- Entertainment
- బన్నీ మామూలు దేశముదురు కాదుగా..దెబ్బకి రాఘవేంద్రరావు షాక్, అడిగి మరీ ఆ సీన్ పెట్టించుకున్నాడట
బన్నీ మామూలు దేశముదురు కాదుగా..దెబ్బకి రాఘవేంద్రరావు షాక్, అడిగి మరీ ఆ సీన్ పెట్టించుకున్నాడట
గంగోత్రి చిత్రం సమయానికి బన్నీ నూనూగు మీసాల కుర్రాడు. అప్పటికే రాఘవేంద్ర రావు సినిమా అంటే హీరోయిన్ నడుముపై పళ్ళు, పూలు వేయడం ఉంటాయని బన్నీ ఆశించాడట.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఆగష్టులో రిలీజ్ కావాల్సిన పుష్ప 2 వాయిదా పడడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. అయినా బన్నీ ఎప్పుడొచ్చినా పుష్ప 2 జాతర మామూలుగా ఉండదు అనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడంటే బన్నీ పాన్ ఇండియా స్టార్. కానీ కెరీర్ బిగినింగ్ లో చాలా సరదాగా ఉండేవాడు.
గంగోత్రి, ఆర్య చిత్రాల తర్వాత అల్లు అర్జున్ ఒక టివి షోలో పాల్గొన్నాడు. ఈ షోకి దివంగత కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం హోస్ట్ గా వ్యవహరించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం సరదాగా ప్రశ్నలు అడుగుతుంటే బన్నీ కూడా అంతే సరదాగా సమాధానం ఇచ్చారు.
ఈ షోలో అల్లు అర్జున్.. తన తొలి చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నా చిన్నప్పుడు న్యూ ఇయర్ ఫంక్షన్ లో డ్యాన్స్ చేశానట. ఆ డ్యాన్స్ రాఘవేంద్ర రావు గారికి నచ్చింది. 100 రూపాయల నోటుపై సంతకం చేసి నేను మీ కొడుకుని హీరోగా బుక్ చేసుకుంటున్నా అని సరదాగా ఇచ్చారట.
అప్పుడు రాఘవేంద్ర రావు సరదాగా అన్నమాటే నిజం అయింది. ఆయన దర్శకత్వంలోనే నేను హీరోగా ఎంట్రీ ఇచ్చాను అని బన్నీ తెలిపాడు. గంగోత్రి చిత్రం విషయంలో మరో గమ్మత్తైన విశేషం కూడా ఉంది. ఇది వింటే బన్నీ నిజంగానే దేశముదురు అనాల్సిందే.
గంగోత్రి చిత్రం సమయానికి బన్నీ నూనూగు మీసాల కుర్రాడు. అప్పటికే రాఘవేంద్ర రావు సినిమా అంటే హీరోయిన్ నడుముపై పళ్ళు, పూలు వేయడం ఉంటాయని బన్నీ ఆశించాడట. ఆ సీన్ తాను బాగా ఎంజాయ్ చేస్తానని సిగ్గుపడుతూ చెప్పాడు. కానీ గంగోత్రిలో నాకు ఆ ఛాన్స్ రాలేదు. షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతోంది.
దీనితో బన్నీ రాఘవేంద్ర రావు దగ్గరకి వెళ్లి అంకుల్ మీ సినిమాలో నేను ఏదో మిస్ అవుతున్నా అని చెప్పాడట. బన్నీ ఉద్దేశం రాఘవేంద్ర రావు కి అర్ధం అయి షాక్ అయ్యారు. సరే ఒక సీన్ ఉంది.. కానీ ఫ్రేమ్ లో నువ్వు ఉండవు. ఎవరో ఒకరు హీరోయిన్ బొడ్డుపై ఫ్రూట్ విసిరితే సరిపోతుంది. కాబట్టి నువ్వే విసురు అని చెప్పారు. సింగిల్ టేక్ లో విసిరా.. సెట్స్ లో అంతా క్లాప్స్ కొట్టారని బన్నీ తెలిపాడు.