MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • రామ్‌ చరణ్‌ డాన్స్ చేస్తాడా? నాకు పెద్ద డౌట్‌, చాలా టెన్షన్‌ పడ్డాం.. బావ ముందే అల్లు అర్జున్‌ కామెంట్‌

రామ్‌ చరణ్‌ డాన్స్ చేస్తాడా? నాకు పెద్ద డౌట్‌, చాలా టెన్షన్‌ పడ్డాం.. బావ ముందే అల్లు అర్జున్‌ కామెంట్‌

రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్స్. అయితే చరణ్‌ డాన్సులపై బన్నీ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఆయనకు డాన్సు వస్తుందా? అనే డౌట్‌ని వ్యక్తం చేయడం షాకిస్తుంది.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 08 2024, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్‌ హీరోల్లో బెస్ట్ డాన్సర్లు ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ది బెస్ట్ డాన్సర్లుగా రాణిస్తున్నారు. రామ్‌ పోతినేని సైతం దుమ్మేలేపుతాడు. వీళ్లు చేసేది ఎలాంటి సినిమా అయినా, అందులో కచ్చితంగా డాన్స్ నెంబర్స్ ఉండాల్సిందే. సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ ఉన్నా, వీరి సినిమాల్లో డాన్సులకు కొదవలేదు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ప్రత్యేకంగా వాటిని డిజైన్‌ చేస్తుంటారు దర్శకులు. అందుకే కొన్నిసార్లు పాటలకంటే ఆ డాన్స్ మూమెంట్సే చర్చనీయాంశం అవుతాయి.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నాటు నాటు పాటలో డాన్స్ కి ఏకంగా ప్రపంచమే ఫిదా అయ్యింది. ఏకంగా ఆస్కార్‌ అవార్డు కూడా వరించింది. ఈ అరుదైన అవార్డు రావడానికి తారక్‌, చరణ్‌ చేసిన డాన్సు కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. అలాగే బన్నీ సినిమాల్లో డాన్స్ ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. తారక్‌, చరణ్‌ సినిమాల్లోనూ అదిరిపోయే డాన్స్ నెంబర్స్ ఉంటాయి. ఫ్యాన్స్ వాటికి ఊగిపోతుంటాయి. వారి సినిమాలు రిలీజ్‌ అయ్యాక వాళ్ల డాన్సులు ఊపేస్తుంటాయి. ఏడు పదుల వయసులోనూ మెగాస్టార్‌ చిరంజీవి కుర్రహీరోలకు పోటీ ఇస్తుండటం విశేషం.
 

36

ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో డాన్సుకు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. చిరంజీవి చిన్నప్పట్నుంచే అల్లుఅర్జున్‌, రామ్‌ చరణ్‌లను ట్రైన్‌ చేశారు. వాళ్లు బాగా డాన్స్ చేసేలా ప్రోత్సహించాడు. శిక్షణ ఇప్పించాడు. అందుకే ఈ ఇద్దరు బెస్ట్ డాన్సర్లుగా రాణిస్తున్నారు. డాన్సులు చేస్తూనే ఈ ఇద్దరు పెరిగారు. అలాంటిది రామ్‌ చరణ్‌ డాన్స్ ల గురించి బన్నీ చేసిన కామెంట్స్ షాకిస్తున్నాయి. రామ్‌ చరణ్‌కి డాన్స్ వస్తుందా? అనే డౌటే అందుకు కారణమని చెప్పొచ్చు. అసలు చరణ్ కి డాన్స్ వస్తుందా? ఎలా చేస్తాడనే డౌట్ చాలా రోజులుగా ఉండేదట. ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ ఈ కామెంట్స్ చేయడం ఆశ్చర్యంగా మారింది. మరి ఇంతకి ఏం జరిగింది? బన్నీ ఏం చెప్పాడనేది చూస్తే.. 
 

46

`మా ఫ్యామిలీలో డాన్సులు కంపేర్‌ చేస్తుంటారు. చిరంజీవిగారు డాన్స్ చేస్తారు, నేను చేస్తాను. చరణ్‌ చేస్తాడా? చేయడా నేను ఎప్పుడూ చూడలేదు. జనాల్లాగే నాకూ చరణ్‌ చేస్తాడని తెలియదు. కానీ ఒక రోజు మా కజిన్‌ సంగీత్‌ జరిగింది. అందులో చరణ్‌ డాన్స్ చేయాలి. నాకు మిలియన్‌ డాలర్ల క్వశ్చన్‌. ఏదో లైట్‌ లైట్‌గా చేస్తాడు, కానీ బాగా చేయగలడా? అనే డౌట్ ఉండేది. కానీ ఆ ఈవెంట్‌లో చించేశాడు. ఆయన డాన్సులకు అరుపులే అరుపులు. అది చూసి నేను, మా నాన్న(అల్లు అరవింద్‌) అబ్బా.. చరణ్‌ డాన్స్ చేస్తాడని ఊపిరిపీల్చుకున్నాం` అని తెలిపారు బన్నీ. `ఎవడు` సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు బన్నీ. అయితే పక్కనే బావ చరణ్‌ కూడా ఉన్నాడు. ఆయన ముందే ఆయన గురించి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 

56

అయితే ఆ సంగీత్ లో రామ్‌ చరణ్‌ డాన్స్ ఇరగదీశారు. ఆ వీడియో క్లిప్ ని కూడా ఆ ఇంటర్వ్యూలో చూపించారు. చరణ్‌ డాన్స్ లకు బన్నీతోపాటు వాళ్ల కజిన్స్ అంతా అరుపులతో హోరెత్తించారు. చరణ్‌ డాన్స్ లకు ఫిదా అయ్యారు. చిన్నప్పట్నుంచి కలిసి డాన్సులు చేసి, కలిసి పెరిగారు ఈ ఇద్దరు. అలాంటిది చరణ్‌ డాన్స్ చేస్తాడా? లేదా అనే డౌట్‌ బన్నీకి రావడం ఆశ్చర్యంగా ఉంది. `ఎవడు` సినిమాలో బన్నీ గెస్ట్ రోల్‌ చేశారు. ఫేస్‌ ఆఫ్‌ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో ఒక యాక్సిడెంట్‌లో బన్నీ ఫేస్‌ డ్యామేజ్‌ అవుతుంది. ఆ ప్రమాదంలోనే మరణించిన రామ్‌ చరణ్‌ పాత్ర ఫేస్‌ని బన్నీ పాత్రకి మార్పిడి చేస్తారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 
 

66

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు పాన్‌ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. `పుష్ప`తో బన్నీ పాన్‌ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు `పుష్ప2`తో రాబోతున్నారు. ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌`తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిన చరణ్‌.. ఇప్పుడు `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంతో రాబోతున్నారు. ఈ రెండు సినిమాలు డిసెంబర్‌లోనే విడుదల కాబోతుండటం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved