- Home
- Entertainment
- టీడీపీ నేత ఫామ్ హౌస్ లో అల్లు అర్జున్.. రాయలసీమ వంటకాలతో పుష్పరాజ్ కి ఘనంగా విందు, ఫొటోస్
టీడీపీ నేత ఫామ్ హౌస్ లో అల్లు అర్జున్.. రాయలసీమ వంటకాలతో పుష్పరాజ్ కి ఘనంగా విందు, ఫొటోస్
తాజాగా అల్లు అర్జున్ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఫామ్ హౌస్ లో మెరిశారు. అంతే కాదు అక్కడ పసందైన రాయలసీమ వంటకాలతో బన్నీ విందు ఎంజాయ్ చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆ మధ్యన అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పుష్ప ది రూల్ టీజర్ ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. సినిమాపై ప్రారంభంలోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
దీనితో పుష్ప 2ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. పుష్ప సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తనకు అచ్చొచ్చిన మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నెక్స్ట్ మూవీ ఉండబోతోంది. మహాభారతంలో రెండు కీలక పర్వాల ఆధారంగా త్రివిక్రమ్ హై బడ్జెట్ లో గ్రాండ్ విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఫామ్ హౌస్ లో మెరిశారు. అంతే కాదు అక్కడ పసందైన రాయలసీమ వంటకాలతో బన్నీ విందు ఎంజాయ్ చేశారు. అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి తన స్నేహితులతో కలసి బెంగుళూరుకి వెళుతుండగా మార్గ మధ్యలో గార్లదిన్నె మండలం కనుంపల్లిలో ఆగారు.
దీనితో అల్లు అర్జున్ కి అనంతపురం జిల్లా టిడిపి నాయకుల నుంచి ఫేమ్ హౌస్ లోకి స్వాగతం లభించింది. శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి అల్లు అర్జున్ ని తన ఫామ్ హౌస్ లోకి తీసుకుని వెళ్లారు. ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి కూడా బన్నీకి వెల్ కమ్ చెప్పారు.
అల్లు అర్జున్ కోసం రాయలసీమ వంటకాలతో అదిరిపోయే విందు ఏర్పాటు చేశారు. అనంతరం ఫామ్ హౌస్ బయట బన్నీ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి అల్లు అర్జున్ బయలుదేరి బెంగుళూరు వెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ లుక్ కొత్తగా ఉంది. పుష్ప చిత్రం కోసం బన్నీ గత మూడేళ్ళుగా లాంగ్ హెయిర్ తోనే కనిపిస్తున్నాడు. ఇప్పుడు బన్నీ హెయిర్ మరింత పొడవుగా పెరిగింది. పుష్ప మొదటి భాగం కంటే కాస్త డిఫెరెంట్ గా కూడా ఉంది. అంటే అల్లు అర్జున్ పుష్ప 2లో సరికొత్త లుక్ తో కనిపిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది.