- Home
- Entertainment
- నువ్వు స్వీట్ పాయిజన్.. ఇమ్మాన్యుయెల్ చేసిన మోసాన్ని తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన తనూజ
నువ్వు స్వీట్ పాయిజన్.. ఇమ్మాన్యుయెల్ చేసిన మోసాన్ని తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన తనూజ
బిగ్ బాస్ తెలుగు 9లో ఫ్రెండ్స్ గా ఉన్న తనూజ, ఇమ్మాన్యుయెల్ ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఇమ్మాన్యుయెల్ చేసిన మోసాన్ని తనూజ తట్టుకోలేకపోయింది. దీంతో కొట్టుకునే వరకు వెళ్లారు.

తనూజ, ఇమ్మాన్యూయెల్ మధ్య గొడవ తారాస్థాయికి
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ క్రమంగా రణరంగంగా మారుతుంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత అలాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఏడో వారం నిజంగానే రణరంగంగా మారింది. మొన్నటి వరకు స్నేహంగా ఉన్న ఇమ్మాన్యుయెల్, తనూజ ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఒకరిపై ఒకరికి ఉన్న కోపాన్ని బయటపెట్టుకున్నారు. నామినేషన్‌లో నెలకొన్న గొడవ తారా స్థాయికి చేరుకుంది. మోసాలు బయట పెట్టడం నుంచి నువ్వు విషం అంటే నువ్వు విషం అని ఆరోపించుకునే స్థాయికి చేరుకుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే? సోమవారం నామినేషన్ల ప్రక్రియ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇందులోనే అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. కళ్యాణ్ చేసిన మోసానికి ఇమ్మాన్యుయెల్ ఫైర్ కావడం, అది చూసి తనూజ షాక్ అవ్వడంతో ఈ గొడవ స్టార్ట్ అయ్యింది.
కళ్యాణ్ కారణంగా తనూజ, ఇమ్మూల మధ్య గొడవ
నామినేషన్ల ప్రక్రియలో బిగ్ బాస్ ఇచ్చిన బెలూన్ టాస్క్ లో ఇమ్మాన్యుయెల్, ఆయేషా టికెట్లు గెలుచుకున్నారు. అందులో ఇమ్మాన్యుయెల్ తన టికెట్‌ని కళ్యాణ్‌కి ఇచ్చాడు. ఆయన తనూజని నామినేట్ చేస్తారని చెప్పడంతో ఇమ్మూ తన టికెట్‌ని అతనికి ఇచ్చాడు. కానీ కళ్యాణ్ తనూజని కాకుండా సంజనాని నామినేట్ చేశాడు. తన మమ్మీనే కళ్యాణ్ నామినేట్ చేయడం, పైగా తనతో అలా చెప్పి ఇలా చేయడంతో ఇమ్మూ తట్టుకోలేకపోయాడు, దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కట్ చేస్తే ఇదే విషయంపై మంగళవారం ఇమ్మాన్యుయెల్, తనూజ మధ్య గొడవ జరిగింది. తనని నామినేట్ చేసేందుకు ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ కుట్ర చేయడాన్ని తనూజ జీర్ణించుకోలేదు. దివ్య వద్ద తన ఆవేదన వ్యక్తం చేసింది.
వెళ్లిపో అంటూ ఇమ్మూ, తనూజ సెటైర్లు
ఇంతలోనే ఇమ్మాన్యుయెల్ వచ్చాడు. ఆయనతో మాట్లాడనని చెప్పిన తనూజ.. నిన్ను నామినేట్ చేయడానికి నా వద్ద పాయింట్లు ఉన్నాయి, కళ్యాణ్ వద్ద కూడా ఉన్నాయి. అందుకే అతనికి టికెట్ ఇచ్చానని తెలిపారు. తనకు మీరు చెప్పిన పాయింట్లే అర్థం కాలేదని ఆమె వాదించింది. నామినేట్ చేయాలనుకుంటే నువ్వు డైరెక్ట్ గా చేయమని తనూజ వాదించింది. అదే చెప్పానని ఇమ్మూ అన్నాడు. ఈ క్రమంలోనే రమ్యని నామినేట్ చేయాలని తనకు ఉంది, వాళ్లు వాళ్లు చూసుకుంటారు, అందులో తనకేంటి సంబంధం అంటూ దివ్యకి వివరించాడు ఇమ్మూ. ఇది చూసి సూపర్ గేమ్ అంటూ సెటైర్లు వేస్తూ క్లాప్స్ కొట్టింది తనూజ. అందుకు ఇమ్మాన్యుయెల్ కూడా సూపర్ గేమ్ అంటూ క్లాప్స్ కొట్టారు. దీంతో ఇద్దరు రైజ్ అయ్యారు. వెళ్లి పో అంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. నిన్ను కేర్ చేయనంటూ తనూజ కామెంట్ చేసింది. ఇమ్మూ కూడా తగ్గలేదు.
నువ్వు పాయిజన్ అంటూ ఇమ్మూ, తనూజ ఫైర్
అనంతరం ఇలాంటి వ్యక్తి కోసమా నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందని తనకు బాధేసిందని, ఇలాంటి వ్యక్తి కోసమా ఇన్నాళ్లు నిలబడిందని బాధ కలిగిందని ఇమ్మాన్యుయెల్ ఆవేదన వ్యక్తం చేయగా, ఎవరూ ఎవరికోసం నిలబడలేదు, సపోర్ట్ చేయలేదని తనూజ కౌంటర్ ఇచ్చింది. అలాంటప్పుడు రింగుల గేమ్‌లో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు ఈ హౌజ్‌లో అని ఎందుకు అన్నావ్ అని తనూజని నిలదీశాడు ఇమ్మాన్యుయెల్. ఇప్పుడు చెప్పు అంటూ రెచ్చిపోయాడు. నీతోనే కాదు, రీతూతో కూడా అన్నాను అని తనూజ చెప్పగా, నీ సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరితో ఒకటి చెబుతావని కౌంటర్ ఇచ్చాడు ఇమ్మూ. స్వీట్ పాయిజన్ అంటారు చూడు ఈ రోజు నువ్వు చేశావని తనూజ అంటే, నువ్వు స్వీట్ పాయిజన్ అని ఇమ్మాన్యుయెల్ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో తనూజ కంట్రోల్ తప్పింది, ఇమ్మాన్యుయెల్ చెంపమీద ఒక్కటిచ్చేసింది. ఈ గొడవ హౌజ్‌ని ఒక్కసారిగా హీటెక్కించింది. మంగళవారం ఎపిసోడ్‌లో ఇది హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.
ఏడో వారం నామినేషన్‌లో ఉన్నది వీరే
ఇక ఏడో వారం నామినేషన్‌లో రీతూ చౌదరీ, శ్రీనివాసా సాయి, రాము రాథోడ్, కళ్యాణ్, సంజన, దివ్య ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి. ఆరోవారం ఊహించని విధంగా భరణి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తనూజ, దివ్యలతో బాండింగ్ పెంచుకోవడం తప్ప, గేమ్ ఆడలేదని విమర్శలు ఎదుర్కొన్న భరణి హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో తనూజ, ఇమ్మాన్యుయెల్, సంజనా, దివ్య, కళ్యాణ్, డీమాన్ పవన్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, దివ్వెల మాధురి, రమ్య మోక్ష, గౌరవ్, నిఖిల్ నాయర్, శ్రీనివాసా సాయి హౌజ్‌లో ఉన్నారు.