MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • AA23: అల్లు అర్జున్ కోసం అట్లర్ ప్లాప్ హీరోయిన్, ఆందోళనలో ఐకాన్ స్టార్ అభిమానులు, నిజమెంత?

AA23: అల్లు అర్జున్ కోసం అట్లర్ ప్లాప్ హీరోయిన్, ఆందోళనలో ఐకాన్ స్టార్ అభిమానులు, నిజమెంత?

AA23: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు. బన్నీతో సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్లు కూడా క్యూలో నిలబడతారు. కానీ ఏరి కోరి అల్లు అర్జున్

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 22 2026, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతున్న బన్నీ..
Image Credit : instagram

భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతున్న బన్నీ..

'పుష్ప' చిత్రంతో పాన్-ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుసగా ప్రయోగాత్మక పాన్-వరల్డ్ కథలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న 'రాకా' మూవీ షూటింగ్‌లో బన్నీ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తన 23వ చిత్రాన్ని (AA23) పట్టాలెక్కించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అయ్యిందా..?
Image Credit : Asianet News

హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అయ్యిందా..?

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో.. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'కూలీ'లో పూజా హెగ్డే ప్రత్యేక గీతం 'మోనికా'తో ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంది. ఆ అనుబంధంతోనే ఈ కొత్త ప్రాజెక్ట్‌లోనూ ఆమెకు కీలక పాత్ర కేటాయిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

35
భయపడుతున్న అభిమానులు..
Image Credit : social media

భయపడుతున్న అభిమానులు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అభిమానులు మాత్రం పూజా హెగ్డే విషయంలో భయంతో ఉన్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. ఇప్పుడు పూజా హెగ్డే ఉన్నపరిస్థితుల్లో ఈసినిమాకు మైనస్ అవుతుందేమో అని బయపడుతున్నారు. వరుసగా ప్లాప్ లు పడేసరికి పూజా ప్లాప్ హీరోయిన్ అన్న పేరు వచ్చింది. కొంత మంది ఐరన్ లెగ్ అని కూడా అంటున్నారు.

45
ముచ్చటగా మూడో సినిమా..
Image Credit : Asianet News

ముచ్చటగా మూడో సినిమా..

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ నిజంగా సెట్ అయితే.. ఇది వారికి ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'దువ్వాడ జగన్నాథం (DJ), అల వైకుంఠపురములో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు వారి కెమిస్ట్రీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అల వైకుంఠపురములో సినిమాతో ఈ జంట ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటు అందులోని 'బుట్టబొమ్మ' పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

55
హీరోయిన్లు చాలా స్పెషల్..
Image Credit : Asianet News

హీరోయిన్లు చాలా స్పెషల్..

సాధారణంగా లోకేశ్ కనగరాజ్ తన యాక్షన్ డ్రామాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రత్యేకమైన శైలి, ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఒకవైపు బన్నీ మాస్ ఇమేజ్, మరోవైపు లోకేశ్ డార్క్ యాక్షన్ వాతావరణంలో పూజా హెగ్డే ఎలా ఒదిగిపోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ 'హ్యాట్రిక్ కాంబో'పై చర్చ నడుస్తున్నప్పటికీ, మేకర్స్ లేదా నిర్మాణ సంస్థ నుండి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక క్లారిటీ వస్తే ఏది నిజమో తెలుస్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సుడిగాలి సుధీర్‌కు నిశ్చితార్థం జరిగినా.. పెళ్లి మాత్రం ఎందుకు ఆగిపోయింది?
Recommended image2
Crazy Kalyanam Day 1 Collections: టీ ఖర్చులు కూడా రాలేదు.. జైలర్‌ 2కి, రణబాలికి మధ్య నలిగిన క్రేజీ కళ్యాణం
Recommended image3
Jailer 2 Collections: డబుల్ సెంచరీ కొట్టిన జైలర్ 2 .. రజినీకాంత్ సినిమా రెండో రోజు వసూళ్లు ఇవే!
Related Stories
Recommended image1
Mannat: 18 కోట్లకు కొన్న బంగ్లా విలువ ఇప్పుడు 300 కోట్లు.. దేశంలోనే ఖరీదైన బంగ్లా..
Recommended image2
Horror Movie: 25 ఏళ్ల నాటి హారర్ సినిమా OTTలో ట్రెండింగ్... ఒంటరిగా చూశారంటే అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved