- Home
- Entertainment
- దటీజ్ ఐకాన్ స్టార్.. సాయం చేయమని కలెక్టర్ అడిగితే ఏకంగా విద్యార్థినిని దత్తత తీసుకున్న అల్లు అర్జున్
దటీజ్ ఐకాన్ స్టార్.. సాయం చేయమని కలెక్టర్ అడిగితే ఏకంగా విద్యార్థినిని దత్తత తీసుకున్న అల్లు అర్జున్
పుష్ప మొదటి భాగం హిందీలో ఊహించని విధంగా సక్సెస్ అయింది. పుష్ప 2పై నార్త్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలసి చేసిన మ్యాజిక్ కి ఇండియా మొత్తం ఫిదా అయింది.

పుష్ప మొదటి భాగం హిందీలో ఊహించని విధంగా సక్సెస్ అయింది. పుష్ప 2పై నార్త్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలసి చేసిన మ్యాజిక్ కి ఇండియా మొత్తం ఫిదా అయింది. పుష్ప మొదటి భాగం హిట్ కావడంతో పుష్ప 2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కానీ ఇంకా పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కాలేదు.
అయితే తాజాగా అల్లు అర్జున్ గోల్డెన్ హార్ట్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. సహాయ కార్యక్రమాల్లో అల్లు అర్జున్ చురుగ్గా పాల్గొనడం చూస్తూనే ఉన్నాం. కోవిడ్ సమయంలో కూడా బన్నీ ఎంతోమందిని ఆదుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ గొప్పమనసు మరోసారి బయట పడింది. కేరళలో ఓ విద్యార్థినిని అల్లు అర్జున్ దత్తత తీసుకున్నాడు. దీని వెనుక పెద్ద ఎమోషనల్ స్టోరీనే ఉంది.
కేరళలో ఆ మధ్యన వరదలు వచ్చాయి. అప్పటి సబ్ కలెక్టర్, ప్రస్తుత కలెక్టర్ కృష్ణ తేజ అలెప్పి ప్రాంతాన్ని అందుకునేందుకు 'ఐయామ్ ఫర్ అలెప్పి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలో ఇల్లు ఆశ్రయం కోల్పోయిన ప్రజలని అందుకున్నారు.
ఇప్పుడు అదే కార్యక్రమానికి కొనసాగింపుగా కృష్ణ తేజ 'వియార్ ఫర్ అలెప్పి' అనే కార్యక్రమం ప్రారంభించారు. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యులని కోల్పోయిన వారిని ఆదుకునే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. కోవిడ్ కారణంగా ఒక నర్సింగ్ విద్యార్థిని తన తండ్రిని కోల్పోయింది. దీనితో ఆమె నర్సింగ్ కోసం ఫీజు కట్టలేని స్థితిని వెళ్ళింది. ఆమెకి మెరిట్ ర్యాంక్ వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి.
ఆమె ముస్లిం యువతి. కోవిడ్ కారణంగా ఆమె తండ్రి మరణించారు. ప్లస్ 2లో ఆ యువతి 92 శాతం మార్కులు సాధించింది. తండ్రి మరణం, ఆర్థిక సమస్యల కారణంగా ఆమె చదువు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్ కృష్ణ తేజ ఎలాగైనా ఆదుకోవాలని భావించారు.
దీనితో అవకాశం చిక్కినప్పుడు అల్లు అర్జున్ తో ఆమె గురించి చెప్పి ఒక సంవత్సరం ఫీజుకి సాయం చేయాలని కోరారు. ఆ యువతి పరిస్థితికి చలించిన బన్నీ ఒక సంవత్సరం కాదు.. ఆమె చదువుకి అయ్యే ఖర్చు, హాస్టల్ వసతి అన్ని ఖర్చులు తానే భరిస్తానని.. ఆమెని దత్తత తీసుకున్నట్లు కలెక్టర్ కి తెలిపారు. దీనితో కలెక్టర్ కృష్ణ తేజ అల్లు అర్జున్ కి కృతజ్ఞతలు తెలిపారు.