- Home
- Entertainment
- నాగ చైతన్యతో మొదలు.. గీతా ఆర్ట్స్ కి పూర్వ వైభవం, సూర్య హీరోగా మ..మ.. మాస్ కాంబినేషన్
నాగ చైతన్యతో మొదలు.. గీతా ఆర్ట్స్ కి పూర్వ వైభవం, సూర్య హీరోగా మ..మ.. మాస్ కాంబినేషన్
అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ అంటే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. మగధీర, గజినీ లాంటి భారీ చిత్రాలు నిర్మించిన సంస్థ గీతా ఆర్ట్స్. కానీ ఇటీవల అల్లు అరవింద్ డైరెక్టర్ గా సినిమా నిర్మాణంలో ఇన్వాల్వ్ కావడం తక్కువ.

అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ అంటే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. మగధీర, గజినీ లాంటి భారీ చిత్రాలు నిర్మించిన సంస్థ గీతా ఆర్ట్స్. కానీ ఇటీవల అల్లు అరవింద్ డైరెక్టర్ గా సినిమా నిర్మాణంలో ఇన్వాల్వ్ కావడం తక్కువ. గీతా ఆర్ట్స్ 2 అనే కొత్త బ్యానర్ ని స్థాపించి ఆ బాధ్యతలని తమకు నమ్మకస్తుడైన బన్నీ వాసుకి అప్పగించారు.
ఆ బ్యానర్ లో మీడియం రేంజ్ చిత్రాలు, డబ్బింగ్ చిత్రాలు వస్తున్నాయి. అయితే గీతా ఆర్ట్స్ 2ని చిన్న సినిమాల కోసం కొనసాగిస్తూ.. గీతా ఆర్ట్స్ బ్యానర్ ని తిరిగి యాక్టివ్ మోడ్ లోకి తీసుకురానున్నారట అల్లు అరవింద్. దీనికోసం సాలిడ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి.
స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు రెడీ చేస్తున్నారు అల్లు అరవింద్. ఇందులో భాగంగా ముందుగా నాగ చైతన్య హీరోగా చందూ ముండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం ఉండబోతోంది. అతి త్వరలో ఈ చిత్రానికి ప్రకటన రానుంది.
ఆ తర్వాత త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో మరో పాన్ ఇండియా చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. మహేష్ గుంటూరు కారం పూర్తి కాగానే.. బన్నీ పుష్ప 2 కంప్లీట్ చేయగానే ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని సంస్థ కూడా భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది.
ఇక అల్లు అరవింద్ సెటప్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న మరో సాలిడ్ ప్రాజెక్టు సూర్య హీరోగా. సూర్య కోసం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుని దించబోతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి కూడా చాలా కాలంగా సూర్యతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కాక మరో ఇద్దరు స్టార్ హీరోలతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాల అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చివరగా తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'.