- Home
- Entertainment
- శ్రీదేవి బతికున్నప్పుడు ఆమెని చూసి ఏడ్చిన అల్లు అరవింద్, చిరంజీవికి కూడా పెద్ద దెబ్బే
శ్రీదేవి బతికున్నప్పుడు ఆమెని చూసి ఏడ్చిన అల్లు అరవింద్, చిరంజీవికి కూడా పెద్ద దెబ్బే
అతిలోక సుందరి శ్రీదేవి అంటే అందరికీ అభిమానమే. తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా రాణించిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది.

Sridevi
అతిలోక సుందరి శ్రీదేవి అంటే అందరికీ అభిమానమే. తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా రాణించిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. దుబాయ్ ఆమె ఊహించని పరిణామాల మధ్య మరణించడం అందరికీ షాకింగ్ గా మారింది. తెలుగులో శ్రీదేవి ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ జగదేక వీరుడు అతిలోక సుందరి మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించారు.
Chiranjeevi, Sridevi
అయితే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి కూడా శ్రీదేవితో అనుబంధం ఉంది. అశ్విని దత్ తో కలసి అల్లు అరవింద్ ఒకసారి శ్రీదేవి ఇంటికి వెళ్లారట. అప్పటికి శ్రీదేవికి తో పెళ్లి జరిగింది. ఇంటికి వచ్చిన అతిథులకు కాఫీ, టీ ఇవ్వడం సహజమే. దీనితో శ్రీదేవి కాఫీ తీసుకువచ్చి ఇచ్చిందట. శ్రీదేవి అంటే అందరి దృష్టిలో ఒక సూపర్ స్టార్. అల్లు అరవింద్ కూడా ఆమెని సూపర్ స్టార్ లాగే ఆరాధించేవారట.
Chiranjeevi, Sridevi
అలాంటి శ్రీదేవి తనకి కాఫీ తెచ్చి ఇవ్వడం ఎంతో బాధ కలిగించిందట. కానీ కపూర్ భార్యగా ఆమె ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలు చేయడం సమంజసమే. కానీ ఆమెని అభిమానించే వ్యక్తిగా ఆ సంఘటన నాకు బాధ కలిగించింది. మనసులో ఏడ్చానని అశ్విని దత్ కి చెప్పారట. అల్లు అరవింద్, శ్రీదేవితో నిర్మించిన చిత్రం పెద్ద డిజాస్టర్.
Chiranjeevi, Sridevi
ఆ మూవీ మరేదో కాదు మెగాస్టార్ చిరంజీవితో కలసి నటించిన ఎస్పీ పరశురామ్. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కీరవాణి సంగీతం అందించారు. కానీ ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లో పెద్ద ఫ్లాప్ లలో ఒకటిగా నిలిచింది. నిర్మాతగా అల్లు అరవింద్ కి, హీరోగా చిరంజీవికి ఈ చిత్రం పెద్ద ఎదురుదెబ్బ. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర మ్యాజిక్ ఈ చిత్రంలో రిపీట్ కాలేదు.