మెగా హీరోలకు సవాల్ విసురుతున్న అల్లు అర్జున్!
అల్లు అర్జున్ ఇంట్లో ఓ స్టార్ హీరో పెద్ద ఫోటో ఉందట. అది చిరంజీవి ఫోటో అనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీని ఏలిన చిరంజీవిని కాదని అల్లు అర్జున్ ఎవరి ఫోటో ఇంట్లో పెట్టుకున్నాడో తెలుసా?
అల్లు అర్జున్ ఎదుగుదలకు చిరంజీవి కూడా పరోక్షంగా కారణం అయ్యాడనేది నిజం. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మెగా హీరో అనే ట్యాగ్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసింది. మెగా హీరోలందరికీ కామన్ గా అభిమానులు ఉంటారు. అలాగే ఒక సామాజిక వర్గం వాళ్ళను అనుసరిస్తుంది.
అయితే కొన్నాళ్లుగా మెగా హీరోలకు అల్లు అర్జున్ దూరమవుతూ వస్తున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. మెగా హీరో అనే ట్యాగ్ వదిలించుకోవాలని అనుకుంటున్నాడు. కొణిదెల-అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇటీవల అవి తారాస్థాయికి చేరాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.
మెగా హీరోల మధ్య మాటల దాడి చోటు చేసుకుంది. పుష్ప చిత్రం పై పవన్ కళ్యాణ్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ఒకప్పుడు హీరోలు అడవులను పెంచి, అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పటి హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. నటుడిగా నాకు అలాంటి పాత్రలు చేయడం ఇష్టం ఉండదని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మామయ్య స్పందించారు. అల్లు అర్జున్ నిజంగా స్మగ్లింగ్ చేయలేదు. అది సినిమాలో పాత్ర మాత్రమే అంటూ అసహనం వెళ్లగక్కారు.
Allu Arjun, #Pushpa2, sukumar
అది ఎన్టీఆర్ బయోగ్రఫి అట. అలాగే అల్లు అర్జున్ ఆఫీస్ లో ఎన్టీఆర్ పెద్ద ఫోటో ఫ్రేమ్ కూడా ఒకటి ఉందట. ఈ విషయం టాలీవుడ్ లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్ లెజెండరీ నటుడు. ఆయన ఫోటోలు చాలా మంది సెలెబ్స్ నివాసాల్లో ఉంటాయి. అలాగే ఎన్టీఆర్-అల్లు రామలింగయ్య మధ్య గట్టి అనుబంధం ఉండేదట. ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య మంచి మిత్రులు. మా ఇంట్లో వంట గదిలోకి కూడా అల్లు రామలింగయ్య వచ్చేసే వారని బాలకృష్ణ ఓ సందర్భంలో వెల్లడించారు.
Allu Arjun
కాబట్టి అల్లు అర్జున్ ఆఫీసులో, ఇంట్లో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉండటం పెద్ద ఆశ్చర్యకర పరిణామం ఏమీ కాదని చెప్పొచ్చు. ఇక అల్లు అరవింద్ కి చెందిన ఆహా యాప్ కోసం బాలకృష్ణ హోస్ట్ గా మారారు. అన్ స్టాపబుల్ టాక్ షో సక్సెస్ఫుల్ గా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. సీజన్ 4 త్వరలో ప్రారంభం కానుంది. అన్ స్టాపబుల్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది.
మరోవైపు పుష్ప 2 విడుదలకు సిద్ధం అవుతుంది. ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప2 వాయిదాపడింది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ పలు భాషల్లో పుష్ప 2 విడుదల కానుంది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు.