- Home
- Entertainment
- NTR: అలియా, రష్మిక, దీపికా, దిశా.. ఎన్టీఆర్‌ని రిజెక్ట్ చేసిన హీరోయిన్లు.. నెక్ట్స్ జాన్వీ, చివరికి ఆమే ?
NTR: అలియా, రష్మిక, దీపికా, దిశా.. ఎన్టీఆర్‌ని రిజెక్ట్ చేసిన హీరోయిన్లు.. నెక్ట్స్ జాన్వీ, చివరికి ఆమే ?
ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోయిన్లు పోటీ పడుతుంటారు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన్ని రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్లు జాబితా పెరిగిపోతుంది.

ఎన్టీఆర్(NTR) ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్`లో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు కొరటాల శివతో `NTR 30` సినిమా చేయబోతున్నారు. ఈ చిత్ర ప్రీ లుక్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేయగా, ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. మాస్‌కి మాస్టర్‌లా ఉందీ లుక్, ఓ చేతిలో భారీ కత్తి, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని భయానికి వణుకు పుట్టించేందుకు వస్తున్నా అనడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఎన్టీఆర్ లుక్, పాత్ర అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నటించేందుకు ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఫైనల్ కాకపోవడం విచారకరం. మొదటగా అలియాభట్(Alia Bhatt) ఓకే చెప్పిందని వార్తలొచ్చాయి. ఆమె కూడా ఎన్టీఆర్-కొరటాల సినిమాలో నటిస్తున్నట్టు తెలిపింది. కానీ ఇంతలో ఆమె రణ్‌బీర్ కపూర్‌తో మ్యారేజ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. అంతకు ముందే చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అలియా ఫైనల్ అయ్యిందనే వార్తతో ఆ గాసిప్స్ కి చెక్ పడింది, కానీ అలియా నో చెప్పడంతో ఇప్పుడు కథ మొదటికొచ్చింది.
ఈ సినిమా కోసం దీపికా పదుకొనె(Deepika Padukone)ని అప్రోచ్ అయినట్టు ప్రచారం జరిగింది. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా ప్రమోషన్ టైమ్‌లో దీపికా.. ఎన్టీఆర్(Jr Ntr)పై ప్రశంసలు కురిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్ బాగుంటుందని, తన ఇంట్రెస్ట్ ని తెలిపింది. దీంతో దీపికా నటించేందుకు స్కోప్ ఉందని అంతా అనుకున్నారు, కానీ దీపికా నో చెప్పింది.ఈ సినిమా తాను చేయలేనని తెలిపిందట.
ఆ తర్వాత రష్మిక మందన్నా(Rashmika Mandanna) పేరు కూడా ప్రధానంగా వార్తల్లో నిలిచింది. అలియాభట్ రిజెక్ట్ చేయగానే వెంటనే రష్మిక పేరు తెరపైకి వచ్చింది. వరుస హిట్లతో ఉండటంతోపాటు ఆమె హిందీలో సినిమాలు చేస్తూ, నార్త్ లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. దీంతో ఆ క్రేజ్ తమ సినిమాకి యూజ్ అవుతుందని భావించిన కొరటాల ఆమెని అప్రోచ్ అయ్యారని, కానీ అది సెట్ కాలేదని టాక్.
మరోవైపు శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) పేరు కూడా తెరపైకి వచ్చింది. `సాహో` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌తో చేసింది శ్రద్ధా కపూర్. అదే ఇంట్రెస్ట్ తో ఆమెని సంప్రదించగా, సుముఖత వ్యక్తం చేయలేదని టాక్. `సాహో` రిజెల్ట్ కారణంగాఆమె డిజప్పాయింట్‌లో ఉందని, దీంతో తారక్‌ని రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది.
బోల్డ్ బ్యూటీ దిశా పటానీ(Disha Patani) పేరు బాగా వినిపిస్తుంది. పూరీ రూపొందించిన `లోఫర్` చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది దిశా. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె హిందీకే పరిమితమయ్యింది. కానీ అ్కడ సక్సెస్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమెని మళ్లీ తెలుగులోకి తీసుకురావాలనుకున్నారట కొరటాల. కానీ ఆమె కూడా రిజక్ట్ చేసిందనే పుకార్ ఊపందుకుంది.
దీంతో ఇప్పుడు మరో పేరు ప్రచారంలో ఉంది. ఎప్పటి నుంచో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) పేరుని పరిశీలిస్తున్నారట. జాన్వీ.. విజయ్ దేవరకొండ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలొచ్చాయి. కానీ ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. ఆమె భారీ చిత్రంతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారట. అయితే ఎన్టీఆర్ సినిమాని అందుకు పర్‌ఫెక్ట్ అని భావిస్తుందా? లేక వెయిట్ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కొరటాల జాన్వీతో చర్చలు జరుపుతున్నారట.
ఒకవేళ జాన్వీ కూడా రిజక్ట్ చేస్తే చివరగా అనన్య పాండేని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. చివరి ఆప్షన్‌గా అనన్య (Ananya Panday)పేరుని అనుకుంటున్నారట. ఇప్పుడు బాల్ జాన్వీ కపూర్ వద్ద ఆగిందని, ఆమె ఫైనల్ కాబోతుందని టాక్. రష్మిక మందన్నా విషయంలోనూ ఇదే టాక్ వచ్చింది. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఎన్టీఆర్30లో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దీనికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.