- Home
- Entertainment
- Alia Bhatt:రణ్‌బీర్‌తో ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందిః `ఆర్‌ఆర్‌ఆర్` హీరోయిన్ షాకింగ్ కామెంట్
Alia Bhatt:రణ్‌బీర్‌తో ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందిః `ఆర్‌ఆర్‌ఆర్` హీరోయిన్ షాకింగ్ కామెంట్
కరోనా కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా అలియా భట్ మీడియా ముందు మాత్రం తమ పెళ్లి అప్పుడే అయిపోయిందని చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది.

`ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) హీరోయిన్ అలియాభట్(Alia Bhatt) ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. రణ్‌బీర్ కపూర్‌తో తన పెళ్లి జరిగిపోయిందని వెల్లడించి షాక్ ఇచ్చింది. రణ్‌బీర్, అలియా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో Alia Bhatt మాత్రం ఆల్ రెడీ మ్యారేజ్ అయిపోయిందని చెప్పడం బాలీవుడ్‌ని ఆశ్చర్య పరుస్తుంది. అయితే అందులోనే చిన్న ట్విస్ట్ ఉంది. మరి ఆ కథేంటో చూస్తే.
అలియాభట్, రణ్‌బీర్ కపూర్ `బ్రహ్మాస్త్ర` సినిమా ప్రారంభం సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటికే రణ్‌బీర్ కత్రినా కైఫ్‌తో ప్రేమాయణం సాగించి బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో అలియా ప్రేమలో పడ్డారు రణ్‌బీర్. అయితే అంతకు ముందే వీరిద్దరు ఓ యాడ్‌లో కలిసి నటించారు. ఆ సమయంలోనే రణ్‌బీర్‌కి ఫిదా అయ్యినట్టు అలియా తెలిపింది. మొత్తానికి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ప్రారంభంలో తమ ప్రేమ విషయం మాత్రం ఎక్కడ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.
కానీ ఆ తర్వాత మీడియా ముందు ఒక్కోక్కరుగా రివీల్ చేస్తూ వస్తున్నారు. దీనికి తోడు ఒకరింటికి ఒకరు వెళ్తూ తమ ప్రేమ విషయాన్ని కన్ఫమ్ చేస్తూ వస్తున్నారు. ఇద్దరు ఘాటు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని కన్ఫమ్ చేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి లేకుంటే వీరి మ్యారేజ్ ఇప్పటికే జరిగి ఉండేది. 2020లోనే వీరి మ్యారేజ్‌కి సంబంధించిన వార్తలు వినిపించాయి. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత సెకండ్ వేవ్‌కి ముందు కూడా మరోసారి అలియా, రణ్‌బీర్ మ్యారేజ్ న్యూస్ బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి.
ఇప్పటికే అటు అలియాభట్ ఫ్యామిలీ, ఇటు రణ్‌బీర్ కపూర్ ఫ్యామిలీ వీరి మ్యారేజ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇక మంచి టైమ్ చూసుకుని మ్యారేజ్ చేసుకోవాల్సిందే. కానీ కరోనా కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది.
అయితే తాజాగా అలియా భట్ మీడియా ముందు మాత్రం తమ పెళ్లి అప్పుడే అయిపోయిందని చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం అలియా `గంగూబాయిః కథియవాడి` చిత్రంలోనటిస్తుంది. ఇది ఫిబ్రవరి 25న విడుదలవుతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బిజీగా ఉంది అలియా.
ఈ సందర్భంగానే రణ్‌బీర్ కపూర్‌తో తన పెళ్లిపై స్పందించింది. తామిద్దరం ఇప్పటికే మ్యారేజ్ చేసుకున్నామని వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన ఆలోచనల్లో రణ్‌బీర్‌ని మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది అలియా. ఇది సరదాగా విలేకరికి అలియా చెప్పడం విశేషం.
గతంలో కరోనా లేకపోతే తమ మ్యారేజ్ ఇప్పటికే జరిగి ఉండేదని రణ్‌బీర్ కపూర్ తెలిపిన నేపథ్యంలో అలియా వ్యాఖ్యలు ఆసక్తిని రెకెత్తిస్తున్నాయి. బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారగా, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలియాభట్, రణ్‌బీర్ కపూర్ కలిసి `బ్రహ్మాస్త్ర`లో నటిస్తున్నారు. తొలి భాగం ఈ ఏడాది రాబోతుంది. దీంతోపాటు ఇది మూడు భాగాలుగా విడుదల కానుంది. అంటే మరో రెండేళ్ల పాటు ఈ జోడి ఈ సినిమాతో టచ్‌లోనే ఉంటారని చెప్పొచ్చు. మరోవైపు అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్` లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది.
అలాగే తెలుగులో మరో సినిమాకి కమిట్ అయ్యింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా `ఎన్టీఆర్ 30`లో హీరోయిన్‌గా నటిస్తున్న అలియా వెల్లడించింది. వీటితోపాటు హిందీలో సొంత బ్యానర్‌లో `డార్లింగ్స్` సినిమా చేస్తుంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి `రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` చిత్రంలో నటిస్తుంది.