MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇండియన్ ఆర్మీపై ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్, ఇంతకీ ఆమె ఏమంటుందంటే?

ఇండియన్ ఆర్మీపై ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్, ఇంతకీ ఆమె ఏమంటుందంటే?

భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ భారత సైన్యాన్ని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశారు. ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 13 2025, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అలియా భట్ ఇండియన్ ఆర్మీపై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రీసెంట్ గా  దేశవ్యాప్తంగా నెలకొన్న భావోద్వేగ వాతావరణాన్ని ఆమె వివరించారు. “గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్త వెనుక ఉంది, ప్రతి భోజనం చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశం కోసం మన కోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం”  అంటూ సైనికులు త్యాగాల గురించి ఆమె బావోద్వేగంతో పోస్ట్ పెట్టారు. ఇంతటితో ఆగకుండా అలియా భారత సైనికుల త్యాగాన్ని స్మరించుకున్నారు. 
 

34

“మనలో చాలామంది తమ ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్ వద్ద ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో కూడిన రాత్రి అని ఆ తల్లికి తెలుస్తుంది.”
 

44

ఈ పోస్ట్‌కి బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అలియా రచించిన ఈ మాటలు దేశభక్తిని ప్రతిబింబించడమే కాక, సైనికుల కుటుంబాలు ఎదుర్కొనే పరిస్థితులను కూడా కల్పించాయి. సైనికి కుటుంబాలకు మనోధైర్యాన్ని అందించాయి. అలియా భట్ ఇలాగే  పలు సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తూ వస్తున్నారు. తాజా పోస్టుతో ఆమె భావోద్వేగాన్ని కలిపిన సందేశం సైనికుల పట్ల గౌరవాన్ని పెంచింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
సమంత నుంచి ఆలియా భట్ వరకూ టాప్ హీరోయిన్లకు 10Th class లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
Recommended image2
14 ఏళ్లు షూటింగ్ జరుపుకున్న ఏకైక సినిమా, రిలీజ్ చేస్తే రిజల్ట్ ఏమయ్యిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved