Akshay Kumar కారుకు ప్రమాదం, ఆటో నుజ్జునుజ్జు.. హీరోకి ఎలా ఉంది? అసలేం జరిగిందంటే?
Akshay Kumar బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కారుకి ప్రమాదం జరిగింది. ఆయనకు సంబంధించిన కారు ఆటో రిక్షాని ఢీ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు.

అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం
అక్షయ్ కుమార్ కి సంబంధించిన కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. హీరోకి ఏమైందని టెన్షన్ పడుతున్నారు. అక్షయ్ కుమార్ కారు ఆటోని ఢీ కొట్టింది. కానీ అందులో ఆందోళన చెందే విషయం లేదు. ఎందుకంటే ఆ కారులో హీరో లేరు.
అక్షయ్ కుమార్ కారులో లేరు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో , ప్రమాదం తర్వాత అక్కడ జనం గుమిగూడటం, డ్రైవర్‌కు నీళ్లు తాగించారు. అయితే ఈ కారులో హీరో అక్షయ్ లేరని తెలిసి అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాకపోతే ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
అక్షయ్ కుమార్ సెక్యూరిటీ కారుకు ప్రమాదం
ముంబయి మీడియా ప్రకారం.. జుహూలోని ఇంటి దగ్గర అక్షయ్ కుమార్ సెక్యూరిటీ కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత అక్షయ్ కుమార్ కారు బోల్తా పడింది. అక్కడున్న వాళ్లు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తర్వాత కారులో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీశారు. ఆటో డ్రైవర్‌ను కూడా జనం బయటకు తీయడం వీడియోలో కనిపిస్తోంది. కారులో ఉన్న వాళ్లంతా సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
అక్షయ్ కుమార్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు
ప్రమాదం తర్వాత అక్షయ్ కుమార్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ప్రమాదంలో ఆటోకు భారీ నష్టం జరిగింది. ఆటో పైకప్పు పూర్తిగా దెబ్బతింది. కారు కూడా పాడైంది. కారులో అక్షయ్ లేరని, అది కూడా తనసెక్యూరిటీ కారు అని తెలియడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమాలు
2025లో అక్షయ్ కుమార్ సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి, వాటిలో కొన్ని హిట్ అయితే కొన్ని ఫ్లాప్ అయ్యాయి. 2026లో కూడా అక్షయ్ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆయన 'వెల్కమ్ టు జంగిల్' రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా 'భూత్ బంగ్లా' సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.

